
'కుటుంబంలో ఒక్కరికే ఇస్తామని, ఆధార్ కార్డుతో ముడిపెడతామని, రేషన్ కార్డుతో ముడిపెడతామని, అయిదేళ్లలో చెల్లిస్తామని, ఉద్యానవన పంటలు రుణమాఫీ నుంచి మినహాయిస్తామని చెప్పారా? హైదరాబాద్ లో ఉద్యోగమో, సద్యోగమో చేసుకుంటున్నవారికి రుణమాఫీ ఇవ్వమని చంద్రబాబు ఎప్పుడైనా చెప్పారా? హైదరాబాద్ లో ఉంటున్న రైతులకు రుణమాఫీ ఇవ్వడానికి మనసు రాదు.
చంద్రబాబుకు ఇక్కడే రేషన్ కార్డు, పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ కూడా ఉండొచ్చు. ఇక్కడే అన్ని తీసుకుని ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అవుతారు. కానీ హైదరాబాద్ లో ఉన్న రైతుకు మాత్రం రుణమాఫీ చేయరు. యాభైవేలు ఉన్న రుణాలన్నీ మాఫీ చేస్తానని చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారు. తెలిసీ చంద్రబాబు ఈ వివరాలు ఎందుకు దాచి పెడుతున్నారు. రాష్ట్రంలో రూ.50వేలలోపు రుణాలు రూ.13వేల 280 కోట్లు ఉన్నాయి' అని వైఎస్ జగన్ అన్నారు
0 comments:
Post a Comment