చెవిరెడ్డిని ఎత్తుకెళ్లి రోడ్డుపై పడేశారు.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చెవిరెడ్డిని ఎత్తుకెళ్లి రోడ్డుపై పడేశారు..

చెవిరెడ్డిని ఎత్తుకెళ్లి రోడ్డుపై పడేశారు..

Written By news on Thursday, March 19, 2015 | 3/19/2015


చెవిరెడ్డిని ఎత్తుకెళ్లి రోడ్డుపై పడేశారు..వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రాంగణం గురువారం రణరంగాన్ని తలపించింది.  సభ నుంచి సస్పెండ్ అయిన వైఎస్ఆర్ సీపీ సభ్యులతో మార్షల్స్‌ చాలా అనుచితంగా వ్యవహరించారు.  నిరసన తెలుపుతున్న వారిని  సభ నుంచి  మార్షల్స్‌ అతి దారుణంగా బయటకు లాక్కొచ్చారు.  గేటు నెంబర్.2 వద్ద చంద్రగిరి ఎమ్మెల్యే  చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డిని ఏకంగా రోడ్డుపై పడేశారు.

మీడియా పాయింట్‌ దగ్గర మాట్లాడుతున్న సభ్యులను తరిమినట్టుగా బయటకు తీసుకెళ్లారు.  అధికార పక్షం తీరుపై విపక్షం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  సభ నుంచి సస్పెండ్‌ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందేమోగాని, మీడియా పాయింట్‌ నుంచి వెళ్లగొట్టే అధికారం టీడీపీకి లేదని విపక్షం తీవ్ర నిరసన తెలిపింది.   అధికార పార్టీ వ్యవహరించిన తీరుపై  విపక్ష సభ్యులు  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  సభలో ఉన్నది ఒకే ప్రతిపక్షమనే విషయాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందని వైఎస్ఆర్ సీపీ సభ్యులు విమర్శించారు. మరో వైపు సభ నుంచి సస్పెండైన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు  అసెంబ్లీ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ముందు ఆందోళనకు దిగారు.
 
Share this article :

0 comments: