ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించండి

ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించండి

Written By news on Tuesday, March 17, 2015 | 3/17/2015


ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించండి
  • బడ్జెట్‌పై చర్చలో ఎంపీలు మేకపాటి, వైవీ
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి తక్షణం పత్యేక హోదా ప్రకటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ పథకం నిధులను గణనీయంగా పెంచాలని కోరారు. బడ్జెట్‌లో కేంద్రం ప్రతిపాదించిన సంక్షేమ పథకాలను పార్టీ తరఫున స్వాగతిస్తున్నామన్నారు. ఈ మేరకు బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఇరువురూ సోమవారం లోక్‌సభలో మాట్లాడారు.
 
వ్యవసాయానికి కోత సరికాదు: మేకపాటి

గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలని, వ్యవసాయ రంగానికి నిధులు పెంచకపోగా కోతలు విధించడం తగదని ఎంపీ మేకపాటి అన్నారు. ‘కేంద్ర బడ్జెట్‌కు వైఎస్సార్ సీపీ తరపున మద్దతు తెలుపుతున్నాం. గత ఏడాదితో పోలిస్తే క్యాపిటల్ వ్యయం కేవలం రూ.15 వేల కోట్లు మాత్రమే పెరిగింది. అంతర్జాతీయంగా చమురు ధరలు త గ్గినా.. ప్రయోజనాలు సామాన్యుడికి చేరలేదు. దేశంలోని 30 కోట్ల మంది అభాగ్యులు ఆధారపడిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు ఎక్కువగా కేటాయించాలని కోరుతున్నా. ఏపీలో కృష్ణపట్నం ప్రాజెక్టు ఐదేళ్ల క్రితమే ప్రారంభమైనా ఇప్పటివరకు అతీగతి లేదు. 2014 డిసెంబరు నాటికి రూ.8.8 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు అనుమతుల్లో జాప్యంతో ఆగిపోయాయి. విభజన బిల్లు ఆమోదం పొందే సమయంలో అప్పటి ప్రధాని రాజ్యసభలో చేసిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాల్సిన అవసరముంది’ అని అన్నారు.
 
ఎంపీ లాడ్స్ నిధులు 15 కోట్లు ఇవ్వాలి: వైవీ

కేంద్రం ప్రతిపాదించిన కొన్ని సంక్షేమ పథకాలు స్వాగతించదగినవిగా ఉన్నాయని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ‘సాలీన రూ. 12 ప్రీమియంతో ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన ద్వారా రూ.2 లక్షల ప్రమాద బీమా పథకం ప్రవేశ పెట్టడం ప్రశంసనీయం. ప్రమాద బీమా పథకం, అటల్ పెన్షన్ వంటి పథకాలు పేదల సంక్షేమాన్ని కోరుకునేలా ఉన్నాయి. ఇక ఏపీ విషయానికి వస్తే.. ఇటీవల 14వ ఆర్థిక సంఘం పన్నుల్లో 42 శాతం వాటాను రాష్ట్రాలకు కేటాయించాలని సిఫార్సు చేసింది.

ఇది మంచిదే. అయితే ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014 లోని సెక్షన్ 46 ప్రకారం ఏపీలో రెవెన్యూ లోటు తీర్చేందుకు, ఆర్థిక వ్యవహారాలు గాడిన పడేందుకు వీలుగా ప్రత్యేక అవార్డు కేటాయించాల్సి ఉంది. కనీసం స్పెషల్ కేటగిరీ స్టేటస్ ప్రకటిస్తే ఏపీ ఆర్థికంగా నిలదొక్కుకుంటుంది. ఇక ప్రతిపాదిత నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్(నిమ్జ్)ను ఒంగోలులో త్వరితగతిన ఏర్పాటు చేయాల్సి ఉంది. చిన్న, సన్నకారు రైతులకు రుణాలు లభ్యమయ్యేలా తీసుకున్న చర్యలను స్వాగతిస్తున్నాం. ఏపీకి ఈ నెలలోనే రూ.10 వేల కోట్ల ప్యాకేజీ వస్తుందని సహాయ మంత్రి వై.ఎస్.చౌదరి చెప్పారు. ఇది నిజమేనా? మంత్రి చెప్పాలి’ అని వైవీ అన్నారు.
Share this article :

0 comments: