కళ్లార్పకుండా.. గంటా పది నిమిషాల అబద్ధాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కళ్లార్పకుండా.. గంటా పది నిమిషాల అబద్ధాలు

కళ్లార్పకుండా.. గంటా పది నిమిషాల అబద్ధాలు

Written By news on Wednesday, March 18, 2015 | 3/18/2015


కళ్లార్పకుండా.. గంటా పది నిమిషాల అబద్ధాలు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రభుత్వ తీరును, సభా నాయకుడి వ్యవహార తీరును ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కడిగి పారేశారు. ఆయన చెప్పినవన్నీ అబద్ధాలన్న విషయాన్ని ససాక్ష్యంగా సభ ముందుంచారు. బుధవారం నాటి అసెంబ్లీ సమావేశంలో ఆయన పట్టిసీమ ప్రాజెక్టుపై జరిగిన చర్చలో భాగంగా మాట్లాడారు. వైఎస్ జగన్ ఏమన్నారంటే.. '' గంటా పది నిమిషాలు.. గొప్ప టాలెంట్.. కళ్లార్పకుండా అబద్ధాలు ఆడగలిగాడు. మొదటి క్లారిఫికేషన్.. ఈ టెండరు డాక్యుమెంట్ లో 16.9  శాతం మీద బోనస్ ఇస్తామని ఎక్కడైనా చెప్పారా అంటే ఆ మాట మాత్రం చెప్పకుండా అంతా తిప్పి తిప్పి సమాధానాలు చెప్పారు. టెండర్లు వేసిన తర్వాత వాళ్లు ఎక్సెస్ వేసిన తర్వాత 5 శాతం వరకు ఆమోదించి, మిగిలిన 16.9 శాతం బోనస్ కింద ఇవ్వడానికి ఒప్పుకొన్నారు. ఇలాంటిది నిజంగా అబ్బో.. ఇన్ని తెలివితేటలు ఎక్కడా ఉండవు అధ్యక్షా.
వరదల గురించి చెప్పారు. నిజంగా మీరు చెబుతున్నట్లుగా గోదావరి ఆర్నెల్లు, 8 నెలలు ఈ రకంగా పొంగుతూ ఉంటే.. ఇంక కావల్సింది ఏముంది? ఆయన కట్టాలని నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి.. ఎండాకాలంలో కూడా వరదలు వచ్చాయని చెప్పగలడు. ఆల్మట్టి గురించి చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పుల గురించి చెప్పారు. ఒకటే అడుగుతున్నా. ఆల్మట్టి అనే ప్రాజెక్టు చంద్రబాబు ఇక్కడ, దేవెగౌడ అక్కడ ప్రధానిగాను ఉండగానే నలుగురు కేంద్రమంత్రులు టీడీపీవాళ్లు ఉండగానే అదే దేవెగౌడ ఏఐడీపీ నిధులు 300 కోట్లు తీసుకెళ్లి ఆల్మట్టికి పెట్టి, ఆ ప్రాజెక్టును కట్టారు. తెలియకపోతే తెలుసుకోండి. మీ హయాంలోనే ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తయింది. 2004 లో బ్రిజేష్ ట్రిబ్యునల్ వచ్చేసరికే అది పూర్తయింది కాబట్టి నికర జలాల కేటాయింపు జరిగింది. తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు కనీసం పావలా భాగమైనా రాయలసీమ ప్రాజెక్టులు పూర్తిచేసి ఉంటే, వాటికి నికరజలాల కేటాయింపు జరిగేది. 1997లో మీరు అధికారంలో ఉన్నప్పుడు కర్ణాటక ప్రభుత్వం కేసు వేస్తే.. 2000లో తీర్పు వచ్చింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చినది విచిత్రమైన లేఖ కాదు. అది కేవలం ఒక కోట్. బచావత్ ట్రిబ్యునల్ 5సిలో ఏం కోట్ చేశారో.. దాన్నే లేఖ రూపంలో చెప్పారు'' అని వైఎస్ జగన్ చెప్పారు.
Share this article :

0 comments: