అప్పటివరకు అసెంబ్లీకి వెళ్లేది లేదు: వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అప్పటివరకు అసెంబ్లీకి వెళ్లేది లేదు: వైఎస్ జగన్

అప్పటివరకు అసెంబ్లీకి వెళ్లేది లేదు: వైఎస్ జగన్

Written By news on Thursday, March 19, 2015 | 3/19/2015


అప్పటివరకు అసెంబ్లీకి వెళ్లేది లేదు: వైఎస్ జగన్
హైదరాబాద్ : కీలకమైన బడ్జెట్ సమావేశాల్లో కనీసం ప్రతిపక్షం ఏం చెబుతోందో వినే ఓపిక ప్రభుత్వానికి లేకపోవడం దారుణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ అసెంబ్లీ విపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై తామిచ్చిన అవిశ్వాస తీర్మానం మీద చర్చకు పిలిచే వరకు ఇక అసెంబ్లీకి వెళ్లేది లేదని ఆయన స్పష్టం చేశారు. తనతో పాటు తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ.. అంటే మొత్తం ప్రతిపక్షం అసెంబ్లీకి అప్పటివరకు వెళ్లబోదని తెలిపారు. సభ నుంచి 8 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన అనంతరం గవర్నర్ నరసింహన్ ను కలిసిన ఆయన.. ఆ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
  • అత్యంత కీలకమైన బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి..
  • అయితే వీటిలో చర్చ జరగకుండా ప్రభుత్వం కుట్ర చేస్తోంది.
  • మొత్తం బడ్జెట్ సమావేశాలనే 17 రోజులకు కుదించేశారు. దాన్ని మరికొంత కాలం పెంచాలని అడిగినా వినే నాథుడు లేడు.
  • అందులోనూ బడ్జెట్ మీద నాలుగు రోజులు చర్చ జరగాలని నిర్ణయించారు.
  • కానీ వాస్తవంగా చర్చ జరిగింది ఒక్క రోజు మాత్రమే.
  • నేను మాట్లాడేందుకు మైకు పట్టుకోగానే ఒక్క గంట మాత్రమే సమయం ఇస్తామని చెప్పారు.
  • నేను ఒప్పుకోలేదు.. ఇది అన్యాయం అని చెప్పా.
  • 365 రోజుల పాటు రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడాల్సిన బడ్జెట్ మీద ప్రతిపక్షం మాట్లాడేందుకు ఇచ్చేది ఒక్క గంటేనా అని అడిగాను.
  • ప్రతిసారీ సబ్జెక్టు మాత్రమే మాట్లాడుతున్నా.. దాన్ని డైవర్ట్ చేసేందుకు నలుగురిని లేపి వాళ్లతో తిట్టించి, రెచ్చగొడతారు.
  • అయినా.. ఈరోజు వాళ్లు ఎంత రెచ్చగొట్టినా సబ్జెక్టుకే పరిమితం కావాలని నిర్ణయించుకున్నా.
  • అలాగే మాట్లాడాను. కానీ 50 నిమిషాలు కూడా పూర్తిగా మాట్లాడకముందే నాకు మైకు కట్ చేశారు.
  • ప్రజాస్వామ్యంలో జరుగుతున్న ఈ అన్యాయాన్ని అందరూ చూడాలి.
  • దయచేసి జరిగింది ఏంటో అన్ని మీడియా సంస్థలు కూడా గుర్తించాలి.
  • స్పీకర్ లైన్ లోకి వచ్చి మాట్లాడవద్దన్నారు
  • రుణమాఫీ, రైతుల దీనస్థితిపై మాట్లాడకూడదనే డీవియేషన్ ఎక్కడా లేదు
  • ఈ టాపిక్ పై స్పీకర్ మాట్లాడవద్దన్నారు
  • బడ్జెట్ కు సంబంధించి అంకెలతో సహా చెబుతుంటే స్పీకర్ మాట్లాడవద్దని అడ్డుకున్నారు
  • సభలో మాట్లాడుతుంటే టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డుతగలడం.. ఆపై మైక్ కట్ చేయడం
  • ప్రతిపక్షంగా ప్రజాసమస్యలపై మాట్లాడుతుంటే స్పీకర్ మాట్లాడవద్దన్నారు
  • ఇలా చేయడం చరిత్రలో ఇదే మొదటిసారిలా ఉంది
  • సభ జరగాల్సిన తీరు ఇదేనా?
  • దారుణంగా ప్రజాగొంతునొక్కుతున్నారు
  • సభలో మాట్లాడకపోతే ప్రజా సమస్యలు ఎలా బయటకి వస్తాయి
  • ఈరోజు, రేపు నేను మాట్లాడబోయేది మీరే ప్యాకేజ్ గా రిలీజ్ చేసి ప్రజాక్షేత్రంలో పెట్టండి
  • ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు అంతా కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం
  • స్పీకర్ పై అవిశ్వాస తీర్మానాన్ని ఇవ్వబోతున్నాం
  • టీడీపీ వాళ్లు ప్రవర్తిస్తున్న తీరును గుర్తించాలి.
  • అవిశ్వాస తీర్మానంపై పిలిచేదాకా అసెంబ్లీకి వెళ్లేది లేదు.
  • ఒక్కసారి లేస్తే.. నలుగురితో పర్సనల్ గా తిట్టిస్తారు.
  • నిన్న ఎంత దారుణంగా మాట్లాడారంటే.. నిజంగా బాధ అనిపించింది.
  • నేను చదివింది బేగంపేట పబ్లిక్ స్కూలు అయితే శివశివాని అంటారు
  • నేను చిన్నప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ స్టూడెంటుని.
  • నేను చదివింది ఐసీఎస్ఈ సిలబస్
  • మా అమ్మ.. జగన్ ను బెంగళూరు పంపాలని రోశయ్యతో చెప్పిందట.
  • నేను 2009లో నాన్న చనిపోయే వరకు బెంగళూరులోనేఉండి, 2010 మార్చిలో హైదరాబాద్ వచ్చా.
  • అలాంటిది మా అమ్మ రోశయ్యకు చెప్పిందట.. ఆయన ఏమైనా ఆమెకు పెదనాన్నా, చిన్నాయనా?
  • నేను బెంగళూరులోనే ఉంటే మళ్లీ బెంగళూరుకు పంపేదేంటి?
  • నోరు తెరిస్తే అబద్ధాలు. ఎవరితో ఒకరితో బండలు వేయించడం. వాళ్లు మాట్లాడినంతసేపూ స్పీకర్ గారు అభ్యంతరం చెప్పరు.
  • నేను బడ్జెట్ సమావేశంలో టాపిక్ గురించి మాట్లాడుతుంటే సమయం ఇవ్వరు.,
  • నేను వాస్తవాలు మాట్లాడితే టీడీపీ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని వాళ్లకు భయం.
  • నిజంగా దేవుడు వీళ్లందరికీ మొట్టికాయలు వేస్తారు.
  • ఎందుకు మాట్లాడకూడదని అడిగితే 8 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.
  • ప్రతిపక్ష నాయకుడు సబ్జెక్టు గురించి మాట్లాడేటప్పుడు స్పీకరే టీడీపీ నాయకుడిలా మీరు మాట్లాడకూడదు అంటే మేం ప్రజాసమస్యల గురించి ఎలా ప్రస్తావించాలి?
  • నేను 9.03 గంటలకు మైకు తీసుకున్నా. తర్వాత వాళ్లే ఎన్నిసార్లు అడ్డుకున్నారో మీకే తెలుసు. మావాళ్లు ఎవరూ ముందుకు పోలేదు.
  • చివరి పది నిమిషాల్లో స్పీకర్ నేను మాట్లాడకూడదని ఆదేశించేసరికి మా వాళ్లు, నేను అంతా షాకయ్యాం.
  • వెంటనే ఎమ్మెల్యేలు ఇదేం అన్యాయమంటూ వాళ్లు పోడియం వద్దకు వెళ్లారు. అక్కడ కూడా ఎంత సేపున్నాం?..
  • మావాళ్లు ఎంత అడుగుతున్నా... నో ఐ విల్ నాట్ గివ్ అని కళ్లు పెద్దవి చేస్తూ అన్నారు. అప్పుడు మావాళ్లు ఏం చేశారు?
  • స్పీకర్ చేస్తున్నది అన్యాయమని మా వాళ్లు గొంతు పగిలేలా అరిచినా వినే నాథుడు లేడు. అందుకే టేబుల్ మీద కొట్టారు. అదికూడా తప్పేనట. వెంటనే 8 మందిని సస్పెండ్ చేసేశారు.
  • అంటే.. సభలోనే చర్చ జరగకూడదు. సభలో ప్రతిపక్షానికి నంబర్లు చెప్పే అవకాశం ఇవ్వకూడదు.
  • ఇదే కదా దుర్బుద్ధి..
Share this article :

0 comments: