పెట్రోల్, డీజిల్‌పై ఎక్కడా లేని పన్నులా..? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పెట్రోల్, డీజిల్‌పై ఎక్కడా లేని పన్నులా..?

పెట్రోల్, డీజిల్‌పై ఎక్కడా లేని పన్నులా..?

Written By news on Saturday, March 21, 2015 | 3/21/2015


సీఎంగా పనిచేయండి.. ‘రియల్’ వ్యాపారిగా కాదు!
  • ‘రాజధాని కోసం’ రైతుల నుంచి బలవంతంగా తీసుకున్న భూములను తిరిగి ఇచ్చివేయండి
‘‘రాష్ట్ర రాజధాని నిర్మాణం విషయంలో చంద్రబాబుకు మనసు లేకుండా పోయింది. రాక్షసుల్లా వ్యవహరిస్తున్నారు. రాజధాని నిర్మాణం కోసం ఆ ప్రాంత రైతుల నుంచి బెదిరించి, భయపెట్టి బలవంతంగా భూములు లాక్కున్నారు’’ అని జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడి 9.3 ఫారాలు ఇచ్చిన రైతుల్లో చాలా మంది వాటిని వెనక్కి తీసుకోవాలని భావిస్తోన్న వారికి తక్షణమే 9.3 ఫారాలను అప్పగించాలనని డిమాండ్ చేశారు.

‘‘మూడు పంటలు పండే పచ్చటి పొలాలను రాజధాని కోసం తీసుకోవడం బాధ కలిగిస్తోంది. రాజధాని ప్రాంతంలో ఏ పర్సెంటేజీ ఇచ్చి రైతుల నుంచి భూములను తీసుకున్నారో.. అదే పర్సెంటేజీకి చంద్రబాబు గానీ, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు గానీ విజయవాడ, హైదరాబాద్‌లలో వాళ్ల సొంత భూములు ఇవ్వగలరా..? ఈ పర్సెంటేజీకి మీరు భూములివ్వలేనపుడు రైతుల నుంచి ఎందుకు లాక్కుంటున్నారు? చంద్రబాబూ.. ముఖ్యమంత్రిగా వ్యవహరించాలి. సీఎం చేయాల్సిన పనులు చేయాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయొద్దు’’ అని హితవు పలికారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
 
‘‘ఆ ప్రాంతంలో చంద్రబాబు చేస్తానంటున్న అభివృద్ధి రోడ్లేసి, కరెంటు ఇచ్చి, నీళ్లివ్వడమే కదా. సాధారణంగా ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారైనా రైతుల నుంచి భూమిని తీసుకున్నా.. ఎకరం భూమి అభివృద్ధికి రూ. 35 లక్షల నుంచి రూ. 40 లక్షలు మాత్రమే ఖర్చు చేస్తారు. రైతులకు 70 శాతం భూమి ఇచ్చి.. తక్కిన 30 శాతం వ్యాపారి తీసుకుంటారు. కానీ ఇవాళ ప్రభుత్వం చేస్తున్నదేమిటంటే 2,200 గజాలు ఇవ్వాల్సిన చోట.. కనీసం వెయ్యి గజాలు కూడా ఇవ్వడం లేదు. ఇదే పర్సేంటేజికీ మీ భూములైతే ఇస్తారా? రాజధాని ప్రాంతంలో దళితులు, గిరిజనులు, బీసీ, మైనారిటీ, పేద, మధ్య తరగతి వారికి ఐదు శాతం భూమిని ఇస్తారట! ఎంత గొప్ప సామాజిక న్యాయం! ఇక మిగిలిందంతా మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికే కదా చంద్రబాబూ..! రాజధాని నిర్మాణానికి వందేళ్లు పడుతుందని చంద్రబాబు ఓ వైపు చెబుతున్నారు.

అలాంటపుడు.. రైతులకు ఆ ప్రాంతంలో ఇచ్చే వెయ్యి గజాల ధర ఎప్పటికి పెరుగుతుంది? ఇది రైతుల జీవితాలతో చెలగాటం ఆడటం కాదా? అంతగా రాజధాని అక్కడే కట్టాలనుకుంటే మంగళగిరిలో ఖాళీగా ఉన్న 2,000 నుంచి 3,000 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఆఫీసులు కట్టండి, భవనాలు కట్టండి, మిగిలిన చోట్ల రోడ్లు వేయండి.. జోనింగ్ చేసి వదలి వేయండి. అపుడు రైతులు తమ భూముల్లో వ్యవసాయం చేసుకుంటారో, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారో వాళ్లే నిర్ణయించుకుంటారు.

అమెరికా, జపాన్, సింగపూరే కట్టాలనుకుంటే అదే ప్రాంతానికి కేవలం 20 కిలోమీటర్ల దిగువన వినుకొండలో 18 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అక్కడ కట్టండి.. కానీ ఇలా రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకుని వారి ఉసురు పోసుకోవద్దు. పరిస్థితులు ఎప్పుడూ ఇలానే ఉండవు.. ఎన్నికలు వస్తాయి.. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు బలవంతంగా రైతుల నుంచి తీసుకున్న భూములను అప్పుడు వారికే తిరిగి ఇచ్చేస్తాం.
 
జాతీయ మీడియాలో మాట్లాడరెందుకు?

విభజన జరిగి పది నెలలు గడిచినా కేంద్రం ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు కాలేదని తెలుగు మీడియాతో రెచ్చిపోయి మాట్లాడే చంద్రబాబు.. ఇంగ్లిష్ (జాతీయ) మీడియాతో మాట్లాడరు. పోనీ.. చంద్రబాబుకు ఇంగ్లిష్ రాదా అంటే బాగా వచ్చు. ఎందుకు మాట్లాడరంటే.. ఇంగ్లిష్ మీడియాలో మాట్లాడితే నరేంద్రమోదీకి తెలుస్తుంది.. తనకు నష్టం జరుగుతుందన్నది చంద్రబాబు భయం. అందుకే జాతీయ మీడియాతో చస్తే మాట్లాడనని చంద్రబాబు అంటారు. ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీల్లో ఆర్నెల్లలోగా అమలు చేయాల్సినవి కొన్ని ఉన్నాయి.. రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ఇచ్చిన హామీలు మరి కొన్ని ఉన్నాయి.

వైఎస్సార్ జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు దగ్గర నుంచీ గ్రీన్‌ఫీల్డ్ క్రూడాయిల్ రిఫైనరీ ఏర్పాటువరకూ ఎన్నో అమలు చేయాల్సిన హామీలు ఉన్నాయి. ఆ హామీల అమలుకు కలసికట్టుగా పోరాడదాం రండి. మేం చెబుతున్నాం.. ఢిల్లీ వెళ్దాం పదండి.. మీరు మేమూ ఇద్దరం కలిసి వెళ్దాం.. కేంద్రంపై ఒత్తిడి తెద్దాం. పది నెలల్లో ఇప్పటికే మూడు సార్లు మేం ఢిల్లీ వెళ్లాం. ప్రధాని, ఇతర మంత్రులతో అపాయింట్‌మెంట్లు తీసుకుని.. రాష్ట్రానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రాలు ఇచ్చాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం మా వంతు పోరాటం చేస్తాం’’ అని ఆయన చెప్పారు.
 
పెట్రోల్, డీజిల్‌పై ఎక్కడా లేని పన్నులా..?

మేం ఇటీవల అనంతపురం జిల్లాలో పర్యటించినప్పుడు పెట్రోల్ డీలర్ల సంఘం తరఫున ఓ వినతిపత్రం మాకు ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో మన రాష్ట్రంలో పెట్రోలు, డీజిలుపై అధికంగా పన్నులు వసూలు చేస్తున్నట్లు ఆ వినతిపత్రంలో ఉంది. మన రాష్ట్రంలో పెట్రోల్ లీటరుపై 31 శాతం పన్ను, రూ. 4 వ్యాట్, డీజిల్‌పై 22.25 శాతం పన్ను, రూ. 4 వ్యాట్ వసూలు చేస్తున్నారు. రాష్ట్రంలో వనరులు పెరుగుతున్నాయని చంద్రబాబు చెబుతున్న మాటల్లో వీసమెత్తు నిజం లేదని అనంతపురం జిల్లా పెట్రోల్ డీలర్ల సంఘం చెప్పింది. 2014 ఫిబ్రవరిలో 3,85,736 లీటర్ల డీజిల్ రాష్ట్రంలో అమ్ముడు పోతే.. 2015 ఫిబ్రవరిలో 2,53,729 లీటర్ల డీజిల్ అమ్ముడుపోవడమే అందుకు తార్కాణం.
Share this article :

0 comments: