ఆదుకుంటామని మోసం చేస్తారా..? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆదుకుంటామని మోసం చేస్తారా..?

ఆదుకుంటామని మోసం చేస్తారా..?

Written By news on Saturday, March 21, 2015 | 3/21/2015


రైతన్న దయనీయ స్థితికి బాబే కారణం
‘‘రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని 2014-15 సామాజిక ఆర్థిక సర్వే తెలియజెబుతోంది. దీనికి కారణం చంద్రబాబే’’ అని జగన్ మండిపడ్డారు. ‘‘ఎన్నికలకు ముందు చంద్ర బాబు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు వేర్వేరుగా టీడీపీ మేనిఫెస్టోలను ప్రకటించారు. వ్యవసాయ రుణాలను పూర్తిగా రద్దు చేస్తామని.. డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని.. జాబు రావాలంటే బాబు రావాలని.. ఒక్కొక్కరికి నిరుద్యోగ భృతిగా నెలకు రూ. 2 వేల చొప్పున పంపిణీ చేస్తామని హామీలిచ్చారు. కానీ.. ఎన్నికల తర్వాత ఆ హామీలను అమలు చేయకుండా రైతులను అప్పుల ఊబిలోకి నెట్టారు’’ అంటూ ఎండగట్టారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...

‘‘చంద్రబాబు సంతకంతో కూడిన ఒక లేఖను టీడీపీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి, అందించారు. ‘దేశం బాగుండాలంటే రైతులు బాగుండాలి. అందుకే వ్యవసాయ రుణాల రద్దుపై తొలి సంతకం చేస్తాను. ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలంటే అక్కాచెల్లెమ్మలు సంతోషంగా ఉండాలి. అందుకే డ్వాక్రా రుణాలను పూర్తిగా రద్దు చేస్తాను. జాబు రావాలంటే బాబు రావాలన్న కాంక్షిస్తోన్న కలలను సాకారం చేయడానికి ఇంటికో ఉద్యోగం - ఉపాధి కల్పిస్తాను. అలా చేయకపోతే నిరుద్యోగ భృతి కింది ఇంటికి నెలకు రూ. రెండు వేలు ఇస్తాం’ అని రాశారు. చంద్రబాబు ఈ లేఖపై సంతకం చేసి ఇచ్చారని, స్వయంగా అందజేయమని మీ ఇంటికి మమ్మల్ని పంపారని టీడీపీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఆ లేఖలు ఇచ్చి చెప్పారు. ఆ మాటలను ప్రజలు నమ్మి చంద్రబాబును సీఎంను చేశారు. అధికారం వచ్చాక.. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే రోజునే.. చంద్రబాబు అఫిషియల్ గెజిట్ ఈనాడు పేపరుకు.. ప్రభుత్వమే ఒక అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చింది. దాంట్లో వ్యవసాయ రుణాల రద్దు, డ్వాక్రా రుణాల రద్దు, ఇంటికో ఉద్యోగం హామీలను ప్రముఖంగా చూపారు.

అపరాధ వడ్డీ భారం
చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక ఆయన అధ్యక్షతన 2014 జూన్ 30న తొలి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సంఘం సమావేశం జరిగింది. అది 184వ ఎస్‌ఎల్‌బీసీ సమావేశం. ఇందులో.. 2014 మార్చి 31 నాటికి రాష్ట్రంలో వ్యవసాయ రుణాలు మొత్తం రూ. 87,612 కోట్లు, డ్వాక్రా రుణాలు రూ. 14,204 కోట్లు ఉన్నట్లు చంద్రబాబుకు బ్యాంకర్లు వివరించారు. అలాగే.. వ్యవసాయ రుణాలను రద్దు చేస్తామని మీరు ఇచ్చిన హామీని అమలు చేస్తారనే ఆలోచనతో రైతులు రుణాలు చెల్లించడానికి, రెన్యువల్ చేయించుకోవడానికి సుముఖంగా లేరని చెప్పారు. రుణాలు చెల్లించకపోవడం వల్ల వారికి పంటల బీమా అందదనీ, సున్నా వడ్డీ, పావలా వడ్డీ రుణాలకు సంబంధించిన వడ్డీ రాయితీలు కూడా అందవని వివరించారు. మళ్లీ ఆర్నెల్ల తర్వాత చంద్రబాబు అధ్యక్షతన 188వ ఎస్‌ఎల్‌బీసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2014 మార్చి 31 నాటికి రూ. 87,612 కోట్లుగా ఉన్న వ్యవసాయ రుణాలు 2014 సెప్టెంబరు 30 నాటికి తడిసి మోపెడై రూ. 99,555 కోట్లకు చేరుకున్నాయని బాబుకు తెలిపారు. ఇందుకు కారణం ఆ రుణాలపై అపరాధ వడ్డీ భారమే.

రుణ లక్ష్యంలో సగం కూడా ఇవ్వలేదు...
188వ ఎస్‌ఎల్‌బీసీ భేటీలోనే.. అప్పటివవరకూ ప్రతి ఏటా లక్ష్యానికి మించి రుణాలు పంపిణీ చేశామని చంద్రబాబుకు బ్యాంకర్లు గొప్పగా వివరించారు. కానీ.. 2014-15 పరిస్థితి ఏంటంటే.. రూ. 56,019 కోట్లు వ్యవసాయ రుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంటే 2014 సెప్టెంబరు  30 నాటికి కేవలం రూ. 13,789 కోట్లు మాత్రమే పంపిణీ చేశామని తెలియజేశారు. అంటే.. రైతులు రుణాల కోసం బ్యాంకుల గడప తొక్కే పరిస్థితి కూడా లేకపోవటంతో.. రైతులు తక్కిన రూ. 46,000 కోట్లను ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద రూ. 2 నుంచి రూ. 3 చొప్పున వడ్డీకి తెచ్చుకున్నారు. సెప్టెంబరు నుంచి ఇప్పటిదాకా ఇచ్చిన రుణాలను కూడా కలుపుకుంటే 2014-15లో ఇచ్చిన వ్యవసాయ రుణాలు రూ. 20 వేల కోట్లకు మించవు.

వడ్డీలకు ఇచ్చింది రూ. 172 కోట్లే!
188వ ఎస్‌ఎల్‌బీసీ సమావేశం పూర్తయిన తర్వాత.. వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ పథకాలపై ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలపాలని కోరుతూ చంద్రబాబుకు బ్యాంకర్లు ఓ లేఖ రాశారు. చంద్రబాబు అధికారంలోకి రాకమునుపు రూ. లక్ష వరకూ వడ్డీ లేని రుణం, రూ. మూడు లక్షల లోపు రుణాన్ని పావలా వడ్డీకే రైతులకు పంపిణీ చేసేవారు. 2014-15లో రూ. 20 వేల కోట్లను వ్యవసాయ రుణాలుగా పంపిణీ చేశారని అనుకుంటే.. నాలుగు శాతం వడ్డీ రాయితీ కింద రైతులకు రూ. 800 కోట్లు ప్రభుత్వం చెల్లించాలి. పాత రుణాల్లో రెన్యువల్ చేసుకున్న రుణాలు పోను మిగిలిన రూ. 80 వేల కోట్ల వ్యవసాయ రుణానికి 14 శాతం అపరాధ వడ్డీ లెక్క వేస్తే రూ. 11,200 కోట్లు అవుతుంది. అంటే.. రైతులకు రూ. 12,000 కోట్ల మేర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. కానీ.. 2015-16 బడ్జెట్‌లో వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ పథకాలకు రుణ రాయితీ ఇవ్వడానికి ప్రభుత్వం కేవలం రూ. 172 కోట్లు మాత్రమే కేటాయించింది.

ఎక్కడ రూ. 12,000 కోట్లు? ఎక్కడ రూ. 172 కోట్లు? రాష్ట్రంలో 1.17 కోట్ల మంది రైతులు రూ. 99,555 కోట్లను వ్యవసాయ రుణాల రూపంలో బకాయిపడ్డారని.. ఇందులో 49.44 లక్షల ఖాతాల్లోని రూ. 36,000 కోట్ల రుణాల పరిస్థితి చేతులు దాటిపోయిందని చంద్రబాబుకు బ్యాంకర్లు నివేదించారు. రైతులు దయనీయమైన పరిస్థితిలో ఉన్నారనడానికి ఇంత కంటే ఏం నిదర్శనం కావాలి? ఏ పత్రికలో చూసినా.. ఏ రోజు చూసినా.. బంగారం వేలం నోటీసులు, ప్రకటనలే కనిపిస్తున్నాయి. ప్రతి జిల్లాలోనూ ఇదే పరిస్థితి. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోనూ అదే పరిస్థితి. బంగారం తులం రూ. 27 వేలు ఉంది. తులం బంగారంపై.. దాని విలువలో 40 నుంచి 45 శాతం అంటే రూ. 10,000 నుంచి రూ. 13,000 వరకూ బ్యాంకర్లు రుణం ఇస్తారు. రుణం చెల్లించకపోవడం వల్ల అపరాధ వడ్డీ పడుతుండటంతో తడిసిమోపెడవుతోంది. రుణాలు చెల్లించకపోతే బంగారం వేలం వేస్తామని బ్యాంకర్లు నోటీసులు జారీ చేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బంగారాన్ని వదులుకోలేక అధిక వడ్డీ అప్పులు చేసి విడిపించుకునే దుస్థితి రైతులది.’’

ముందు ఈ షరతులు, పరిమితులు చెప్పారా?

ఎన్నికల్లో చంద్రబాబు చెప్పిందేమిటి? ఇప్పుడు చేస్తోందేమిటి? ఎన్నికప్పుడు ఎక్కడైనా పరిమితులు, షరతులు చెప్పారా? కొంత మందికే మాఫీ చేస్తామని గానీ.. కుటుంబంలో ఒకరికే రుణ మాఫీ వర్తింపజేస్తామని గానీ.. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను పాటిస్తామని గానీ.. ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు ఉన్న వాళ్లకే మాఫీ చేస్తామని గానీ.. ఉద్యానవన పంటలకు వర్తింపజేయమని గానీ.. హైదరాబాద్‌లో రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్న వాళ్ల రుణాలను మాఫీ చేయమని గానీ.. ఐదేళ్లలో మాఫీ చేస్తామనిగానీ ఎక్కడైనా చెప్పారా? హైదరాబాద్‌లోనే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు ఉన్న చంద్రబాబునాయుడు సీమాంధ్రకు ముఖ్యమంత్రి కావాలని మాత్రం అంటారు.. అదే హైదరాబాద్‌లో రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్న వాళ్ల రుణాలను మాత్రం మాఫీ చేయరట. ఇదెక్కడి న్యాయం?

ఆదుకుంటామని మోసం చేస్తారా..?
2013లో మూడు తుపాన్లు.. పైలాన్, హెలెన్, లెహర్ తుపాన్లు వచ్చాయి. ఓ కరవు వచ్చింది. కరవు దెబ్బకు ఖరీఫ్ పంట మొత్తం పోయింది. ఎన్నికల నేపథ్యంలో రైతుల వద్దకు వెళ్లిన ప్రతి రాజకీయ పార్టీ నాయకుడు.. ఆదుకుంటాం.. తోడుగా ఉంటాం.. అని హామీ ఇచ్చారు. చంద్రబాబు సైతం ఇదే రీతిలో హామీ ఇచ్చారు. వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టేటప్పుడు మంత్రి ప్రత్తిపాటి పుల్లరావును 2013 ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు చేయాలని మా విశ్వేశ్వరరెడ్డన్న (ఉరవకొండ ఎమ్మెల్యే) అడిగితే.. ఆయన ‘మాకేం సంబంధం.. మేం ఇవ్వం’ అని చెప్పారు. వేరుశనగ, వరి రైతులకు ఇచ్చే ఇన్‌పుట్ సబ్సిడీలో కేంద్రం వాటాగా 45 శాతం ఇస్తే.. రాష్ట్రం వాటాగా 55 శాతం ఇవ్వాలి. అనంతపురం జిల్లాలో రైతులకు 2010 ఖరీఫ్‌కు రూ. 245 కోట్లు, 2011 ఖరీఫ్‌కు రూ. 398 కోట్లు, 2012 ఖరీఫ్ పంటలకు రూ. 648 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని పంపిణీ చేశారు. 2013 ఖరీఫ్ పంటలకు సంబంధించి అనంతపురం జిల్లా రైతులకే రూ. 643 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు చేయాల్సి ఉంది. తన వాటా నిధులను మిగిలించుకోవాలనే కుయుక్తితోనే ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీని మంజూరు చేసేది లేదని చెబుతోంది.

చంద్రబాబు అబద్ధాలపై కేస్ స్టడీస్ ఇవీ...

రుణ మాఫీపై చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు. రూ. 50 వేల లోపు రుణాలను ఒకేసారి పూర్తిగా మాఫీ చేశామని చెప్పారు. ఎస్‌ఎల్‌బీసీలో బ్యాంకర్లు చెప్పిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో రూ. 50 వేల లోపు తీసుకున్న వ్యవసాయ రుణాలు ఎన్ని ఉన్నాయో తెలుసా.. సార్ (చంద్రబాబూ)? రూ. 13,280 కోట్లు ఉన్నాయి. రుణ మాఫీకి రైతు సాధికార సంస్థకు 2014-15లో కేటాయించిందే రూ. 5,000 కోట్లు మాత్రమే. ఇవన్నీ తెలిసి కూడా చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు. చంద్రబాబు చెబుతోన్న అబద్ధాలకు సంబంధించిన కొన్ని కేస్ స్టడీస్ ఇవీ..
 
  • అనంతపురం జిల్లా అగళి మండలం ఇనగలూరుకు చెందిన రామన్న రెండెకరాల్లో వేరుశనగ సాగుచేసేందుకు రూ. 15 వేలు అప్పు తీసుకున్నారు. వడ్డీతో కలిపి రూ. 15,788 అయ్యింది. రుణ మాఫీ కింద చంద్రబాబు ఆ రైతుకు ఇచ్చింది రూ. 3,157 మాత్రమే. రూ. 50 వేల లోపు రుణాలు ఒకేసారి ఎక్కడ మాఫీ చేశారో చంద్రబాబు చెప్పాలి.
  • మైలవరం నియోజకవర్గానికి చెందిన సామ్రాజ్యమ్మ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పట్టాదారు పాసుపుస్తకంతో పాటు బంగారు నగలు తాకట్టు పెట్టి రుణం తీసుకున్నారు. కానీ.. రుణ మాఫీకి ఆమెను అనర్హురాలుగా తేల్చారు.
  • రైతుల ఆత్మహత్యల పరంపర...
  • రైతుల ఆత్మహత్యల విషయమై శాసనసభలో ప్రభుత్వాన్ని మేం నిలదీస్తే.. రైతులు అందరూ సుఖసంతోషాలతో ఉన్నట్లు చంద్రబాబు చెప్పారు. రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోలేదని బుకాయించారు. అదే సభలో మేం చెప్పాం.. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శిస్తాం.. ఆ కుటుంబాలకు భరోసా కల్పిస్తాం.. అని చెప్పాం. అసెంబ్లీలో ఇచ్చిన మాట మేరకు అనంతపురం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను మేం పరామర్శించాం.
  • అనంతపురం జిల్లా కూడేరు మండలం ఇప్పేరుకు చెందిన వన్నూరప్ప అనే రైతు రూ. 1,02,221 వ్యవసాయ రుణంగా తీసుకున్నారు. వ్యవసాయ రుణాన్ని రద్దు చేస్తానని చంద్రబాబు చెప్పిన మాటలను నమ్మి.. ఆ రైతు రెన్యువల్ చేసుకోలేదు. దాంతో అపరాధ వడ్డీ 14 శాతం పడింది. అప్పుపై వడ్డీ రూ. 14,310 అయ్యింది. రుణ మాఫీ కింద చంద్రబాబు ఆ రైతుకు కేవలం రూ. 8,736 మాత్రమే ఇచ్చారు. అంటే.. వడ్డీ కన్నా రూ. 5,574 తక్కువగా మాఫీ మొత్తం ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. దాంతో అప్పు తీర్చే దారితెలియక.. కుటుంబాన్ని పోషించుకోలేక వన్నూరప్ప ఆత్మహత్య చేసుకున్నారు.
  • అనంతపురం జిల్లా కొత్తచెరువు మండలం మరుకుంటపల్లికి చెందిన నాగప్ప రూ. 58,964 బ్యాంకు నుంచి వ్యవసాయ రుణం కింద అప్పు తీసుకున్నారు. చంద్రబాబు హామీని నమ్మి ఆ రైతు రెన్యువల్ చేసుకోలేదు. దాంతో.. ఆ రైతుపై 14 శాతం వడ్డీ పడింది. వడ్డీ రూ. 8,255 అయ్యింది. రుణ మాఫీ కింద చంద్రబాబు ఆ రైతుకు కేవలం రూ. 10,242 ఇచ్చారు. అంటే.. వడ్డీ కన్నా కేవలం రూ. రెండు వేలు మాత్రమే ఎక్కువ. అప్పు తీర్చే మార్గం లేక.. కుటుంబాన్ని పోషించుకోలేక నాగప్ప ఆత్మహత్య చేసుకున్నారు.
  • అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం లోలూరుకు చెందిన గోవిందరెడ్డి రూ. 3,15,034 వ్యవసాయ రుణంగా బ్యాంకులో తీసుకున్నారు. చంద్రబాబు మాటలు నమ్మి ఆ రైతు రెన్యువల్ చేసుకోలేదు. దాంతో.. 14 శాతం అపరాధ వడ్డీ పడింది. వడ్డీ రూ. 44,104 అయ్యింది. రుణ మాఫీ కింద చంద్రబాబు కేవలం రూ. 20,127 ఇచ్చారు. అంటే.. వడ్డీ కన్నా రూ. 23,977 తక్కువగా ఇచ్చినట్లు వెల్లడవుతోంది.
  • అనంతపురం జిల్లాలో గురువారం అప్పుల ఊబిలో కూరుకుపోయి.. కుటుంబాన్ని పోషించుకోలేని దుస్థితిలో నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చంద్రబాబూ.. టీడీపీ అఫిషియల్ గెజిట్ ‘ఈనాడు’ పత్రికలోనే శుక్రవారం ఈ వార్త ప్రచురితమైంది సార్!

డ్వాక్రా మహిళలకూ టోపీ పెట్టారు
రాష్ట్రంలో డ్వాక్రా అక్కచెల్లెమ్మల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందన్నది సామాజిక ఆర్థిక సర్వే నివేదికను పరిశీలిస్తే స్పష్టమవుతుందని జగన్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘2014 మార్చి 31 నాటికి డ్వాక్రా మహిళలు రూ. 14,204 కోట్లు బ్యాంకులకు బకాయిపడ్డారు. డ్వాక్రా రుణాలను రద్దు చేస్తానని చంద్రబాబు చెప్పిన మాటలను నమ్మి అక్కచెల్లెమ్మలు మోసపోయారు. రాష్ట్రంలో డ్వాక్రా మహిళల రుణాల్లో రూ. 3,542 కోట్లు నిరర్ధక ఆస్తులు (నాన్ పెర్‌ఫార్మింగ్ అసెట్స్)గా మిగిలిపోయాయంటే పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. 2014-15లో డ్వాక్రా మహిళలకు రూ. 13,791 కోట్ల రుణాలను పంపిణీ చేస్తామని 184వ ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో బ్యాంకర్లు చంద్రబాబుకు వివరించారు. కానీ.. 2014 సెప్టెంబరు 30 నాటికి డ్వాక్రా మహిళలకు రూ. 2,028 కోట్లు మాత్రమే రుణాలుగా పంపిణీ చేశారంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో తెలుస్తోంది.

రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించిన దాఖలాలు ఎక్కడా కనిపించ లేదు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం కోసం.. ఈ ఏడాది రుణంగా పంపిణీ చేసిన రూ. 2,000 కోట్లకు ఏడు శాతం వడ్డీపై రూ. 140 కోట్లు; రూ. 12,000 కోట్ల పాత రుణాలపై 14 శాతం వడ్డీ లెక్క వేస్తే రూ. 1,680 కోట్లు వెరసి కనీసం రూ. 1,820 కోట్లు కేటాయించాలి. కానీ.. వడ్డీ లేని రుణాల కోసం ఒక్క పైసా కూడా బడ్జెట్‌లో కేటాయించలేదు. ఎన్నికల్లో డ్వాక్రా రుణాలను రద్దు చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఆ హామీని అమలు చేయకపోగా కొత్తగా ఆంధ్రప్రదేశ్ మహిళా సాధికార సంస్థ (ఏపీఎంఎస్‌ఎస్)ను ఏర్పాటు చేస్తూ జీవో 18ను జారీచేశారు. ఈ జీవోను లోతుగా పరిశీలిస్తే.. లావాదేవీల్లో ఒక శాతం ఏపీఎంఎస్‌ఎస్ తీసుకోవచ్చుననే నిబంధన పెట్టారు. అంటే.. ఏపీఎంఎస్‌ఎస్ ద్వారా డ్వాక్రా మహిళలకు రుణాలు ఇస్తారా? డ్వాక్రా మహిళలకు రుణాలు ఇచ్చేందుకు ఇప్పటికే బ్యాంకులు ఉన్నాయి కదా? మరో కొత్త సంస్థ ఎందుకు? ఒక శాతం కమిషన్ వసూలు చేసుకోవడానికా? డ్వాక్రా మహిళలను అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసిన చంద్రబాబుకు.. అక్కచెల్లెమ్మల ఉసురు తగలకుండా పోదు’’ అని ఆయన హెచ్చరించారు.

అది చంద్రన్న కానుకా.. చంద్రన్నకు కానుకా?
సంక్రాంతి సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటించింది చంద్రన్న కానుకా? చంద్రన్నకు ఇచ్చిన కానుకా? నిజంగానే సంక్రాంతికి ప్రజలకు కానుక ఇవ్వాలనుకుంటే నిత్యావసర వస్తువులకు టెండర్లు పిలిచి తక్కువ మొత్తం టెండర్లు వేసిన వారికి ఇవ్వాలి. కానీ అధిక ధరలకు నామినేషన్లపై టెండర్లు ఇచ్చారు. కిలో కందిపప్పు అప్పట్లో మార్కెట్‌లో కేజీ ధర రూ. 68 నుంచి రూ. 70 ఉంటే చంద్రన్న కానుకకు రూ. 79.60 ధరకు కొనుగోలు చేశారు. కిలో నెయ్యి ధర అప్పుడు విజయా, ఇతర డైరీల్లో రూ. 325 నుంచి రూ. 375 ఉంటే చంద్రన్న ధర రూ. 499 నుంచి రూ. 575 పెట్టి కొనుగోలు చేశారు. నెయ్యి కొనుగోలుకు సంబంధించి తన కుమారుడు, తన భార్య కంపెనీ హెరిటేజ్‌కే ఏకంగా చెక్కు ఇచ్చేశారు. బెల్లం ధర మార్కెట్‌లో రు. 30 ఉంటే చంద్రన్న ధర రూ. 39! ఈ కానుక అందజేసే సంచుల విషయంలో కూడా అధిక ధరలే చెల్లించారు.
Share this article :

0 comments: