ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారు: వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారు: వైఎస్ జగన్

ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారు: వైఎస్ జగన్

Written By news on Tuesday, March 17, 2015 | 3/17/2015


ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారు: వైఎస్ జగన్వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అధికార టీడీపీ వ్యవహరించిన వైఖరిని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖండించారు. మంగళవారం వైఎస్ ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..  ప్రజా సమస్యలు వినే ఓపిక, తీరిక అధికార టీడీపీకి లేదని విమర్శించారు.

సభలో అంగన్ వాడీ వర్కర్ల సమస్యల గురించి చర్చ జరగకుండా అధికార పక్ష నాయకులు అడ్డుకున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. పట్టుసీమ గురించి చర్చ జరగకుండా అడ్డుకున్నారని చెప్పారు. పట్టుసీమ వల్ల పోలవరం ప్రాజెక్టు భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుందని వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ వైఖరిని మీడియా ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నానని వైఎస్ జగన్ అన్నారు.

పట్టిసీమను ప్రతిపక్షం ఎందుకు వ్యతిరేకిస్తుందో వినే ఓపిక ప్రభుత్వానికి, అసెంబ్లీ స్పీకర్ కు లేదని జగన్ అన్నారు. పోలవరం ప్రాజెక్టుల వల్ల అందరికీ ఉపయోగపడుతుందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు వల్ల రాయలసీమకు నీళ్లు అందుతాయని తెలిపారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై రెండు రోజులు అయినా బడ్జెట్ పై చర్చించే అవకాశమే ఇవ్వలేదని విమర్శించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుతో తాను కుమ్మక్కయ్కానని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారని, కేసీఆర్ తో కుమ్ముక్కయ్యింది చంద్రబాబు నాయుడేనని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఏమి అడుగుతున్నారో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదే చేస్తున్నారని ఆరోపించారు. కృష్ణా నది సర్ ప్లస్ వాటర్ వాడుకునే హక్కు మనకుందని వైఎస్ జగన్ చెప్పారు.  అసెంబ్లీ సాక్షిగా టీడీపీ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని దుయ్యబట్టారు.
వైఎస్ జగన్ ఏం మాట్లాడారంటే...
 
 • పోలవరం ప్రాజెక్టుకు విఘాతం కలుగుతుందనేదే మా ఆందోళన
 • 80 టీఎంసీల నీళ్లను మళ్లాస్తూ ఒక జీవో జారీ చేశారు
 • పంపింగ్ కెపాసిటీ 8,500 క్యూసెక్కులు మాత్రమే
 • నాలుగున్న నెలలపాటు గోదావరి వరద ప్రవాహంతో పొంగుతుందని తప్పుడు సమాచారం ఇస్తున్నారు
 • కేంద్రం జల వనరుల సంఘం రికార్డులను పరిశీలిస్తే గోదావరి 60 రోజులకు అటుఇటూ ప్రవహిస్తుంది
 • కృష్ణానది కూడా కాస్త అటు ఇటుగా 40 రోజులు ప్రవహిస్తుంది
 • గోదావరి కృష్ణా జలాలు జూలై 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు పొంగుతాయి
 • పట్టి సీమ ఎత్తిపోతల ద్వారా నీటిని పోలవరం కుడికాల్వ ద్వారా పంపించాలని ప్రయత్నిస్తున్నారు
 • ఈ మధ్యలో ఎక్కడా నీటిని నిల్వచేసే అవకాశం ఉండదు
 • ప్రకాశం బ్యారేజీలో మూడు టీఎంసీలకు మించి నీటిని నిల్వ చేయలేమని ప్రభుత్వమే చెప్తోంది
 • నీటిని నిల్వ చేసుకునే అవకాశం లేకనే పోలవరం ప్రాజెక్టును డిజైన్ చేశారు
 • ప్రజా సమస్యలు వినే ఓపిక తీరిక పాలక పక్షానికి లేదు
 • ఈ రోజు సభలో అంగన్ వాడీ కార్యకర్తల సమస్యలపై చర్చజరగకుండా చూశారు
Share this article :

0 comments: