వైఎస్ జగన్ ప్రెస్ మీట్ లో ముఖ్యాంశాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ జగన్ ప్రెస్ మీట్ లో ముఖ్యాంశాలు

వైఎస్ జగన్ ప్రెస్ మీట్ లో ముఖ్యాంశాలు

Written By news on Friday, March 20, 2015 | 3/20/2015


వైఎస్ జగన్ ప్రెస్ మీట్ లో ముఖ్యాంశాలు:

ప్రణాళికేతర వ్యయంలో ఏకంగా రూ.11వేల కోట్లు తగ్గించారు.  
బడ్జెట్ లో కేటాయింపుల పెరుగుదల కనిపించలేదు
బడ్జెట్ లో ఖర్చులు ఎట్టి పరిస్థితుల్లోనూ రూ.80 వేల కోట్లు మించి లేదు
కాదు కూడదు అంటే..90 వేల కోట్లు, కానీ లక్షా 12వేల కోట్లు ఎందుకు చూపించారో అర్థం కావటంలేదు
అకౌంట్లను పెంచి చూపించడం, మోసం చేయడం, అబద్దాలు చెప్పడం...
వెన్నుపోట్లు పొడవడం కాదు..భవిష్యత్ తరాలకు నేర్పించాల్సి ఉంది

బడ్జెట్ లో లెక్కలను పెంచి చూపిస్తే ఢిల్లీలో మన రాష్ట్ర పరువు ఏమవుతుంది
మన రాష్ట్రం గురించి, మన ప్రజల గురించి వాళ్లు ఏమనుకుంటారు
రైతుల రుణమాఫీ గురించి ప్రస్తావించగానే నేరుగా స్పీకరే పిక్చర్లోకి వచ్చారు
రైతుల టాపిక్ గురించి మాట్లాడకూదని స్పీకర్ చెప్పారు
ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదో స్పీకరే నిర్దేశించే పరిస్థితి

రైతుల రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు మేనిఫెస్టోలో పేర్కొన్నారు
ఎన్నికల సంఘానికి వీటిని నెరవేరుస్తామని లేఖలు కూడా రాశారు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పూర్తి అవగాహన ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు
ఎన్నికల సమయంలో ఎక్కడకు వెళ్లినా... ఇవే హామీలు ఇచ్చారు
బ్యాంకుల్లో బంగారం రావాలంటే..బాబే రావాలని ప్రతి టీవీల్లో ప్రకటనలు ఇచ్చారు
ఏ గోడమీద చూసినా..జాబు రావాలంటే..బాబు రావాలని చెప్పారు
ప్రతిమీటింగ్ లోనూ రైతు రుణమాఫీ చేస్తానని చెప్పారు

చంద్రబాబే సంతకం పెట్టిన లేఖను ప్రతి ఇంటికీ కార్యకర్తల చేత లేఖలు పంపించారు
చంద్రబాబు సంతకం చేసి లేఖ ఇది..స్వయంగా మీ ఇంటికి పంపించారంటూ ఇంటింటికీ పంచారు
రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానని కుటుంబాలకు రాసిన లేఖలో చెప్పారు
డ్వాక్రా సంఘాల రుణాలను రద్దు చేస్తామని చెప్పారు.

ఉద్యోగం, ఉపాధి కల్పించేంత వరకూ ప్రతి నిరుద్యోగస్తుడికీ రూ.2వేల భృతి ఇస్తామన్నారు
చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మారు, ఆయన్ని ముఖ్యమంత్రిని చేశారు
చంద్రబాబు ప్రమాణస్వీకారం సమయంలో సాక్షాత్తూ ప్రభుత్వమే ఈనాడు దినపత్రికలో ప్రకటన వేయించింది
వ్యవసాయ రుణాలు రద్దు, డ్వాక్రా రుణాలు రద్దు, ఇంటికో ఉద్యోగం అంటూ ప్రకటన వేశారు

సీఎం అయిన తర్వాత చంద్రబాబు బ్యాంకర్లతో సమావేశం అయ్యారు
జూన్ 30న 184వ రాష్ట్ర బ్యాంకర్ల సమావేశం జరిగింది
ఈ సమావేశంలో చంద్రబాబుకు బ్యాంకర్లు వివరాలు అందించారు
87 వేల 612 కోట్లకు పైగా వ్యవసాయ రుణాలు ఉన్నాయని బ్యాంకర్లు చంద్రబాబుకు చెప్పారు
డ్వాక్రా సంఘాల రుణాలు రూ.14204 కోట్లని చంద్రబాబుకు బ్యాంకర్లు చూపించారు
ఇవన్నీ 2014, మార్చి 31 నాటికి ఉన్న డేటాను చంద్రబాబుకు చూపించారు
ప్రతి ఏడాది ఉన్న రుణాల వివరాలను కూడా చూపించారు

రైతులు రుణాలు కట్టేందుకు సుముఖంగా లేరని కూడా చంద్రబాబుకు బ్యాంకర్లు చెప్పారు
రైతులు రుణాలు కట్టలేదు కాబట్టి పంటల బీమా కూడా అందదని చంద్రబాబుకు స్పష్టం చేశారు
రుణాలు కట్టలేనందున వడ్డీలేని రుణాలు, పావలా వడ్డీల్లాంటి ప్రయోజనాలు ఇకపై ఉండవని స్పష్టం చేశారు
సరిగ్గా 6 నెలల తర్వాత 188వ బ్యాంకర్ల సమావేశం జరిగింది. అది కూడా చంద్రబాబు అధ్యక్షతన జరిగింది
రాష్ట్రంలో వ్యవసాయ రుణాలు 30-09-2014 నాటికి తడిసి మోపిడై రూ.99,555 కోట్లు అయ్యాయని బాబుకు వివరించాయి
ఇంతకు ముందు రైతుకు సున్నా వడ్డీకి, పావలా వడ్డీకి వచ్చే రుణాలపై రైతులు ఇప్పుడు 14 శాతం వడ్డీ కడుతున్నారు

పంట రుణాల లక్ష్యాన్ని అనుకున్నదానికన్నా ఎక్కువ వచ్చిన విషయాన్ని గుర్తు చేశాయి
కాని రుణాలు కట్టలేనందువల్ల ఈసారి ఇవ్వలేకపోయాయని చెప్పాయి
రూ.56వేల కోట్ల రుణాలు రైతులకు ఇవ్వాలనుకున్న బ్యాంకులు కేవలం రూ.13781 కోట్లు మాత్రమే ఇవ్వగలిగాయి
మిగిలిన రూ.40వేల కోట్లకు పైగా రుణాలను బ్యాంకులు గడప తొక్కలేక రైతులు బయట అప్పులు తెచ్చుకుంటున్నారు
Share this article :

0 comments: