కుప్పంలో రైతుకు అన్యాయo - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కుప్పంలో రైతుకు అన్యాయo

కుప్పంలో రైతుకు అన్యాయo

Written By news on Saturday, March 21, 2015 | 3/21/2015


మాఫీ అన్నారు.. మాయ చేశారు!
మార్చి 28న వేలం వేస్తామని నోటీసు
16న నగలు వేలం వేసేశారు
కుప్పంలో రైతుకు అన్యాయుం

 
కుప్పం: కష్టాల నుంచి బయుటపడేందుకు ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన రుణవూఫీ హామీతో తాకట్టుపెట్టిన బంగారు నగలు ఇంటికొస్తాయని ఎంతో ఆశపడ్డారు. రుణవూఫీ జాబితాలో ఉన్నా.. బ్యాంకర్ల నిర్లక్ష్యం కారణంగా చివరకు బంగారు నగలను వేలం వేసేశారు.. బాధితుల కథనం మేరకు..

కుప్పం పట్టణం జైప్రకాష్‌రోడ్డులో నివాసవుుంటున్న రమేష్ 2012 సంవత్సరంలో చిన్నకురబలపల్లె రెవెన్యూకు సంబంధించిన సర్వేనెంబరు 99/1బీ లోని 23 సెంట్ల భూమితో పాటు నగలను స్థానికంగా ఉన్న ఇండియున్ బ్యాంకులో తాకట్టు పెట్టారు. 25 గ్రావుుల బంగారు నగలపై రుణ ఖాతానెంబర్లు 6066566534, 6062539195 కింద మొత్తం రూ.44 వేల రుణం పొందారు. దీనికి సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి 12వ తేదీ బ్యాంకు నుంచి నోటీసులు అందారుు. రుణ వ్యవధి కాలం వుుగిసిందని, వెంటనే తీసుకున్న రుణం చెల్లించకుంటే నగలను వేలం వేస్తావుని నోటీసులో పేర్కొన్నారు. దీంతో సంబంధిత ఖాతాదారుడు ఫిబ్రవరి 24న బ్యాంకు అధికారులను సంప్రదించి తీసుకున్న రుణాన్ని రెన్యూవల్ చేసేందుకు నగదు చెల్లించారు.

ఇలా ఉండగా.. వూర్చి 8వ తేదీ వురో నోటీసు అందింది. ఈనెల 28వ తేదీ లోపు రుణం చెల్లించి నగలు విడిపించుకోవాలని, లేకుంటే నగలను వేలం వేస్తావుని పేర్కొన్నారు. కాగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన రుణవూఫీ ద్వారా లబ్ధిదారుడికి రెండు రుణాల కింద  రూ.15 వేలు వూఫీ అరుు్యంది. మిగిలిన రూ.25,599 రుణాలు చెల్లించాలని నోటీసు పంపారు. రెండు రోజుల క్రితం బ్యాంక్ అధికారులను సంప్రదిస్తే ఈనెల 16వ తేదీనే వేలం వేసేశామని నిర్లక్ష్యంగా సవూధానం చెపుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బ్యాంకు అధికారులు పంపిన నోటీసుల్లో వూర్చి 28వ తేదీ గడువుగా పేరొన్నారు. తీరా 16వ తేదీనే వేలం వేశారు. 25 గ్రావుులకు గాను బ్యాంక్ ద్వారా రూ.14 వేలు ఒకటి, రూ. 30 వేలు ఒకటిగా రెండు రుణాలు తీసుకున్నారు. మొత్తానికి రుణవూఫీ జాబితాలో రూ.15 వేల వూఫీ అరుు్యంది. కాగా రెన్యూవల్ కోసం వినియోగదారుడు వడ్డీతో సహా 15 వేలను ఒక రుణానికి చెల్లించారు. అయితే బ్యాంకు అధికారులు నగలను వేలం వేశారు. ఇప్పుడు రుణవూఫీ ద్వారా ఇచ్చిన నగదు, రెన్యూవల్ కోసం కట్టిన డబ్బులు ఏమైందో అధికారులకే తెలియూల్సి  ఉంది. వేలం వేస్తున్నట్టు పత్రికలో ఇచ్చిన ప్రకటనలోనూ తప్పుగా వుుద్రించారు.

రమేష్ పేరిట 60 గ్రావుుల నగలను వేలం వేస్తున్నట్టు అందులో ఉంది. ఇప్పుడు నగలు చేతికందక, రెన్యూవల్ చేసేందుకు అప్పులు చేసిన డబ్బులతో తీవ్రంగా నష్టపోయూవుంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నతాధికారులు కలుగుజేసుకుని న్యాయుం చేయూలని బాధితులు కోరుతున్నారు.

ఈ విషయుమై బ్యాంకు మేనేజర్ సంపత్‌ను వివరణ కోరగా ‘‘2012లో  ఆయన నగలు పెట్టి రుణం తీసుకున్నారు.. 2013లోనే నగలు వేలం వేయూల్సి  ఉంది.. ఇప్పుడు వేశాం.. రుణవూఫీ ద్వారా వచ్చే నగదును వారి ఖాతాలోనే జవు చేస్తాం.’’ అన్నారు. 
Share this article :

0 comments: