సీబీఐ జేడీతో టీడీపీ నేత భేటీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » సీబీఐ జేడీతో టీడీపీ నేత భేటీ

సీబీఐ జేడీతో టీడీపీ నేత భేటీ

Written By news on Thursday, May 31, 2012 | 5/31/2012

సీబీఐ డెరైక్టర్‌గా పదవీ విరమణ చేసి, టీడీపీలో చిరకాలంగా క్రియాశీలక పాత్ర పోషిస్తున్న మాజీ మంత్రి ఒకరు బుధవారం ఓ ప్రముఖ హోటల్‌లో సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ, ఆ సంస్థ న్యాయవాదులతో సమావేశమైనట్టు విశ్వసనీయ సమాచారం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తులపై విచారణ జరిపించాలంటూ కాంగ్రెస్, టీడీపీ సంయుక్తంగా హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ భేటీ అనేక అనుమానాలకు తావిస్తోంది. 

జగన్‌ను లక్ష్యంగా చేసుకుని దుష్ర్పచారం చేస్తున్న ఒక ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన సీనియర్ నేత ఇలా సీబీఐ జేడీతో, ఆ సంస్థ న్యాయవాదులతో సమావేశమవడం ఆశ్చర్యం కలిగిస్తోందని సీనియర్ న్యాయవాది ఒకరు వ్యాఖ్యానించారు. జరుగుతున్న పరిణామాలకు ఇది అద్దం పడుతుందని అభిప్రాయపడ్డారు. సదరు నేత బుధవారం సాయంత్రం ఇక్కడి ఓ ఐదు నక్షత్రాల హోటల్‌లో సీబీఐ భేటీలో పాల్గొన్నట్లు ఆ సంస్థ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. 

కేసుల పరిశోధనలో సహకారం కోసమే ఆయనను ఆహ్వానించినట్టు చెప్పుకొచ్చాయి. జగన్ కేసుతో ప్రత్యక్ష సంబంధమున్న రాజకీయ పార్టీ నేత నుంచి సహకారం తీసుకోవడం సీబీఐ వ్యవహార శైలికి అద్దం పట్టేలా ఉందని న్యాయవర్గాలు వ్యాఖ్యానించాయి. నిజానికి ఈ కేసులో సీబీఐ దర్యాప్తు తొలినుంచీ సదరు నేత సలహాలు, సూచనల మేరకే జరగుతున్న వైనాన్ని సాక్షి ఇదివరకే వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే.
Share this article :

0 comments: