విజయమ్మ ప్రచారానికి జననీరాజనం:జూపూడి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విజయమ్మ ప్రచారానికి జననీరాజనం:జూపూడి

విజయమ్మ ప్రచారానికి జననీరాజనం:జూపూడి

Written By news on Wednesday, May 30, 2012 | 5/30/2012

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ప్రచారానికి నీరాజనాలు పలికిన శ్రీకాకుళం జిల్లా ప్రజలకు ఆ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. సంధికి పిలిచినట్లు విచారణకు పిలిచి జగన్మోహన రెడ్డిని అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. తమ పార్టీ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తుందన్నారు. వారు చేసిన చర్యలకు ఈ రోజు నరసన్నపేట సమాధానం అన్నారు. విజయమ్మ వస్తున్నారని తెలిసి జన సమూహం ఉప్పెనలా కదిలి వచ్చిందన్నారు. తమకు న్యాయం చేయమని కన్నీరు కారిస్తే సంతోషపడినటువంటి నాయకులు ఈ రాష్ట్రంలో ఉన్నారన్నారు. జగన్మోహన రెడ్డి స్థానంలో వెళ్లిన తల్లిని, చెల్లిని జనం అక్కున చేర్చుకున్నారు. రాష్ట్రంలో ప్రతి రాజకీయ నాయకుడికి కనువిప్పు కలిగేలా ప్రజలు వారిని ఆదరించారు. విజయమ్మకు నరసన్నపేట ప్రజల ఆదరణ ఒక నమూనా మాత్రమే అన్నారు. కాంగ్రెస్, టీడీపీలకు ఇదో హెచ్చరిక అన్నారు. ఆ రెండు పార్టీలకు రోజులు దగ్గర పడ్డాయనడానికి ఇదే నిదర్శనం అన్నారు. జంతువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్న పాలక ప్రతిపక్షాలను చూసి ప్రజలు చీదరించుకుంటున్నారని చెప్పారు. మానవత్వం లేని ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉందన్నారు.

 కుట్రలు, కుతంత్రాలు ప్రజాభిమానాన్ని అడ్డుకోలేవని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్ర రావు అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో విజయమ్మ ప్రచారానికి జనం ఉప్పెనలా తరలివచ్చారన్నారు. ఆ జనాన్ని చూసి కాంగ్రెస్, టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని ఎద్దేవా చేశారు. 

టీడీపీని కాంగ్రెస్ బ్రాంచ్ ఆఫీస్ గా మార్చింది చంద్రబాబే అని ఆయన అన్నారు. విజయమ్మ గురించి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని, అది మంచిపద్దతి కాదన్నారు. చంద్రబాబు భార్యే నిజమైన గాంధారీ అన్నారు. తండ్రిని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన భర్తను ప్రశ్నించలేని ఆమే అసలైన గాంధారీ అన్నారు. అవాకులు, చవాకులు మాని ఉపఎన్నికల్లో డిపాజిట్లు తెచ్చుకుని సత్తా చూపండని సవాల్ విసిరారు.
Share this article :

0 comments: