రాజన్న రాజ్యం వచ్చేలా తీర్పు ఇవ్వండి: షర్మిల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » రాజన్న రాజ్యం వచ్చేలా తీర్పు ఇవ్వండి: షర్మిల

రాజన్న రాజ్యం వచ్చేలా తీర్పు ఇవ్వండి: షర్మిల

Written By news on Saturday, June 2, 2012 | 6/02/2012

టి. నరసాపురం: ఉప ఎన్నికల్లో విలువలు, విశ్వసనీయతకు ఓటు వేయాలని దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైఎస్ జగన్ సోదరి షర్మిల కోరారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలో తల్లి విజయమ్మతో కలిసి ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాజన్న రాజ్యం వచ్చేలా తీర్పు ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఉప ఎన్నికల తీర్పు గురించి దేశమంతా ఎదురుచూస్తోందని అన్నారు. సొంతమామకు వెన్నుపోటు పొడిచిన వారికి ఓటు వేయొద్దన్నారు. కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలన్నారు. 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలరాజుకు ఓటు వేసి గెలిపించాలని షర్మిల కోరారు. రైతన్న కోసం బాలరాజు పదవిని వదులుకున్నారని, ఆయనకు ఓటు వేస్తే వైఎస్సార్ మీ గుండెల్లో ఇంకా బతికేవున్నారని నమ్మకం కలుగుతుందని అన్నారు. బాలరాజుకు ఓటేస్తే జగన్ నిర్దోషని అర్థమవుతుందన్నారు. బాలరాజుకు ఓటేస్తే జగన్ రాజన్న రాజ్యం తెస్తారన్న నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఏ సందర్భంలోనూ జగన్ సాక్షులను ప్రభావితం చేయలేదని తెలిపారు. వైఎస్సార్ ఇచ్చిన అధికారంతో ఆయన కుటుంబాన్ని కుళ్లబొడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.Share this article :

0 comments: