ప్రకాశం: తాను పార్టీ మారుతున్నట్టు వచ్చిన వార్తలను సంతనూతలపాడు వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేఆదిమూలపు సురేష్ తీవ్రంగా ఖండించారు. తాను పార్టీని మారడం లేదని పదేపదే చెబుతున్నా కూడా కొందరు దుష్ర్పచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆదివారం ఆయన ప్రకాశం జిల్లాలో విలేకరులతో మాట్లాడారు. పార్టీని వీడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.
వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ... నలుగురైదుగురు పార్టీ మారినా ప్రజాబలం మాత్రం వైఎస్‌ఆర్‌సీపీకే ఉంటుందని చెప్పారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని బ్రహ్మానందరెడ్డి డిమాండ్ చేశారు.

0 comments:
Post a Comment