Home »
» మేమంతా వైఎస్ జగన్ వెంటే నడుస్తాం
మేమంతా వైఎస్ జగన్ వెంటే నడుస్తాం
హైదరాబాద్ : తామంతా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంటే నడుస్తామని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. పార్టీ ఎమ్మెల్యేలతో సోమవారం వైఎస్ జగన్ సమావేశమయ్యారు. భేటీ అనంతరం నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ 'వైఎస్ జగన్ బీఫాం ఇవ్వడం వల్లే ఎమ్మెల్యేలుగా గెలిచాం. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే నీచులం కాదు. టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు దమ్ముంటే ఆ పార్టీ గుర్తుపై గెలవాలి. చంద్రబాబు...ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయొద్దు. సత్యహరిశ్చంద్రుడిలా నీతులు చెప్పడం మానుకో' అని ధ్వజమెత్తారు.ఈ సందర్భంగా రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఎమ్మెల్యేలతో బేరసారాలు మాని... ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి పెడితే బాగుటుందన్నారు. వైఎస్ జగన్ తో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలంతా సమావేశానికి హాజరయ్యారన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల హాజరుగానీ ఎమ్మెల్యేలపై దుష్ప్రచారం చేయవద్దని మీడియా ప్రతినిధులకు ఆయన విజ్ఞప్తి చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు.... పదవులకు రాజీనామా చేసి వెళ్లుంటే బాగుండేదన్నారు.
0 comments:
Post a Comment