మేం చెప్పిందే నిజమైంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మేం చెప్పిందే నిజమైంది

మేం చెప్పిందే నిజమైంది

Written By news on Wednesday, March 2, 2016 | 3/02/2016


మేం చెప్పిందే నిజమైంది: బొత్స

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని ముసుగులో జరిగిన భూ దందాల గురించి తాము చెప్పిందే నిజమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన బుధవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ...'స్వయంగా ముఖ్యమంత్రి, మంత్రులే భూ దందా చేస్తున్నారు. రాజధాని ప్రకటన కంటే ముందే ఎవరెవరు భూములు కొనుగోలు చేశారో పేపర్లో వార్తలు వచ్చాయి.
 
3129 ఎకరాలను నారా లోకేశ్, మంత్రులు నారాయణ, పత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్, దేవినేని ఉమమహేశ్వరరావు, సుజనా చౌదరి, మురళీ మోహన్ కొనుగోలు చేశారు. ఇప్పటివరకు కొన్ని పేర్లే బయటకు వచ్చాయి. ఇంకా ఈ భూ దందాలో చాలామంది ఉన్నారు. తక్కువ ధరకు వేల ఎకరాల భూములు కొని రైతులను ముంచారు. రాజధాని ప్రకటనకు ముందే అన్నివేల ఎకరాలు ఎందుకు కొన్నారు. తమ బినామీల భూములు ఉన్నాయనే. విజయవాడ వద్ద రాజధాని ప్రకటన వాస్తవం కాదా?

రాష్ట్రంలో 13 జిల్లాలు ఉంటే...విజయవాడలోనే భూములు ఎందుకు కొన్నారు. తమ వారికి మేలు చేయాలనే ఉద్దేశంతోనే శివరామకృష్ణ కమిటీ నివేదికను పక్కన పెట్టారు. హైదరాబాద్ లో హైటెక్ సిటీ నిర్మాణ సమయంలోను ఇలాగే చేసి బినామీలకు మేలు చేశారు. రాజధాని భూముల విషయంలో తప్పు చేయకంటే చంద్రబాబు నిజాయితీని నిరూపించుకోవాలి. భూ దందాపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలి. పట్టిసీమ ఒక అవినీతి ప్రాజెక్ట్...పోలవరంలో అంతర్భాగం కాదు. ఈ విషయాన్ని మేం మొదట్నుంచీ చెబుతూనే ఉన్నాం. మేం చెప్పిన విషయాన్నే బీజేపీ నేతలు చెబుతున్నారు. బాబు ధనదాహం కోసం రైతుల ప్రయోజనాలను పణంగా పెడుతున్నారు. ప్రాజెక్టుల్లో దోపిడీపై విచారణ జరిపించాలని బీజేపీ నేతలను కోరుతున్నాం.' అని అన్నారు.
Share this article :

0 comments: