టీడీపీ ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ నేత అంబటి మండిపాటు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలప్పుడు చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాన్ని 18 నెలల తరువాత కూడా అమలు చేయట్లేదని ముద్రగడ పద్మనాభం ప్రభుత్వాన్ని పదేపదే ప్రశ్నిస్తుంటే.. ఆయన వెనుక జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారంటూ టీడీపీ నేతలు ఆరోపణలు చేయడమేమిటని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఆయన శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏ ఒక్కటి జరిగినా దానివెనుక జగన్ ఉన్నారని ప్రచారం చేయడమే పాలసీగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. ల్యాండ్‌పూలింగ్ విధానంలో భూములివ్వని రైతులపంటను, పంట సామాగ్రిని దహనం చేసి, జగనే ఆ మంటలు పెట్టారని ఆరోపణలు చేశారని ఆయన గుర్తు చేశారు.

‘కాపు గర్జన సందర్భంగా టీడీపీకి చెందినవారే తునిలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను తగులపెట్టి, ఇది కూడా రాయలసీమ నుంచి వచ్చిన జగన్ మనుషులే చేశారని ఆరోపణలు చేశారు.. కానీ కేసులు మాత్రం కాపులపై పెట్టారు. మంద కృష్ణ తిరిగి ఉద్యమం ప్రారంభిస్తానని ప్రకటిస్తే.. దానివెనుకా జగన్ ఉన్నారని అంటున్నారు. రాష్ట్రంలో ఏం జరిగినా జగనే కారణమనడమేంటి’’ అని ఆయన ధ్వజమెత్తారు. ఎన్నికలప్పుడిచ్చిన హామీలనేగాక.. గత నెలలో తన నిరాహార దీక్ష సందర్భంగా ఇచ్చిన హామీల్నీ నెరవేర్చే సూచనలు కనిపించనందువల్లే ముద్రగడ.. సీఎంకు ఉత్తరం రాసి ఉంటారని, దానివెనుక జగన్ ఉన్నారని ఆరోపణలు చేయడమేంటన్నారు. పార్టీ నేతలతో ముద్రగడపై తీవ్రస్థాయి విమర్శలు చేయించి, ఆయన్ను రెచ్చగొడుతుంది చంద్రబాబు కాదా? అని అంబటి నిలదీశారు.
0 comments:
Post a Comment