చవకబారు కుట్ర - భారీ దౌర్జన్యం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చవకబారు కుట్ర - భారీ దౌర్జన్యం

చవకబారు కుట్ర - భారీ దౌర్జన్యం

Written By news on Wednesday, May 30, 2012 | 5/30/2012


ఇక నుంచి కాంగ్రెస్ ఏం చేసినా సరే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అరెస్ట్ చేయటాన్ని.. రాజకీయ చర్యగానే చూస్తారు తప్ప.. ఆయనపై ఉన్న ఆదాయానికి మించి ఆస్తుల కేసులో దర్యాప్తుకు తార్కిక ఫలితంగా కాదు. ఆ కేసు బలాబలాలతో సంబంధం లేకుండా.. ఈ అరెస్టును ఎదుగుతున్న రాజకీయ ప్రత్యర్థిని దెబ్బకొట్టేం దుకు తెగించిన కాంగ్రెస్ చేసిన మరో ప్రయత్నంగానే ప్రజానీకం భావించింది. 

జగన్ ఏమీ ఋషి కాదు. సీబీఐ తన రాజకీయ యజమానుల ఆదేశాలతో కక్ష సాధిం పులకు పాల్పడుతోందనటానికి ఆధారాలు లేవనుకున్నప్ప టికీ... ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, గత కొద్ది నెలలుగా జరుగుతున్న పరిణామాల తీరు... కాంగ్రెస్‌ను చవకబారు కుట్రలు పన్నే పెద్ద దౌర్జన్యకారిగా కనిపించేలా చేశాయి. 

అసలు సమస్య చాలా వరకూ ఆంధ్రప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉంది. తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచీ... ప్రభుత్వం దిశానిర్దేశం లేనట్లుగా వ్యవహరిస్తోంది. ఏ రోజు పరిస్థితులను బట్టి ఆ రోజు అన్నట్లు ఊగిసలాడుతోంది. ఉద్యమం నేపథ్యంలో ప్రభుత్వపాలనలో తలెత్తిన సంక్షోభానికి.. రాజకీయ నిర్వ హణలో సంక్షోభం కూడా తోడైంది. టి-చిక్కుముడి నుంచి ఎలా బయటపడాలో ఆలోచించలేకపోయిన కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వం... చివరికి ఆ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లోనూ విశ్వాసం నెలకొల్పలేదు. కాంగ్రెస్ చేయ గలిగిందల్లా... నటుడు చిరంజీవి నేతృత్వంలోని ప్రజా రాజ్యం పార్టీని ప్రలోభపెట్టటమే. వైఎస్సార్ కాంగ్రెస్ బలపడి, తన ఎమ్మెల్యేలు పలువురిని ఆకర్షించటం మొదలుపెట్టగానే.. ఈ వలసలను అరికట్టే విషయంలో కాంగ్రెస్ తీవ్రమైన ఒత్తిడికి లోనయింది. అది ఈ కేసులో క్రియాశీలంగా జోక్యం చేసుకున్నదా అన్నదానిపై భిన్నా భిప్రాయాలున్నాయి. అయితే.. జగన్ ఎదుర్కొంటున్న న్యాయపరమైన ఇబ్బందుల వల్ల తక్షణ ప్రయోజనం పొందగల సంస్థ కాంగ్రెస్సే అన్నది నిర్వివాదాంశం. 


జగన్ ఆస్తులపై సీబీఐ దర్యాప్తు చేయటం మొదలు పెట్టింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్దేశాల మేరకే అయినప్ప టికీ.. ఈ కేసు మూలాలు కాంగ్రెస్ ఎమ్మెల్యే పి.శంకర్రావు దాఖలు చేసిన పిటిషన్‌లో ఉన్నాయి. ఇందులో పేర్కొన్న అవకతవకల్లో జగన్ తండ్రి వైఎస్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయి. ఈ అవకతవ కలతో తనకు సంబంధం లేదంటూ కాంగ్రెస్ తనను తాను విశ్వసనీయంగా దూరం పెట్టుకునే అవకాశమే లేదు. నిజా నికి... వైఎస్సార్ హయాంలో వివాదాస్పద ప్రభుత్వ ఉత్త ర్వుల జారీలో పాత్రకు సంబంధించి ప్రస్తుతం కొనసాగు తున్న మంత్రులు కొందరిని ఇప్పటికే సీబీఐ ప్రశ్నించింది. అయినప్పటికీ.. తాను నిలువరించాల్సిన అవసరమున్న తక్షణ ముప్పు జగన్. ఈ భారీ క్రీడలో కొన్ని పావులను పణమొడ్డి నిద్రకు కరువైన రాత్రులు గడపాలని కాంగ్రెస్ కోరుకోదు. వచ్చే నెలలో ఒక లోక్‌సభ స్థానం, 18 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు సానుభూతిని వెల్లువెత్తించకుండా కాంగ్రెస్ అడ్డుకోగలదా అన్నది కీలకం. న్యాయపరమైన ఇబ్బందులు కొన్నిసార్లు రాజకీయ ప్రయోజనాలుగా రూపాంతరం చెందుతాయి. జగన్ సవాలును కాంగ్రెస్ సమర్థవంతంగా ఎదు ర్కోవా లంటే.. అది ఆ పనిని రాజకీయంగా చేయాలి కానీ... దర్యాప్తు సంస్థలను అక్రమంగా వినియోగించుకోవటం ద్వారా కాదు. 

(‘హిందూ’ సౌజన్యంతో...)
Share this article :

0 comments: