సిబిఐ వితండవాదం:జగన్ తరపు న్యాయవాదులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సిబిఐ వితండవాదం:జగన్ తరపు న్యాయవాదులు

సిబిఐ వితండవాదం:జగన్ తరపు న్యాయవాదులు

Written By news on Monday, May 28, 2012 | 5/28/2012

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆస్తుల కేసులో సిబిఐ వితండవాదం చేస్తోందని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. నిన్న అరెస్ట్ చేసిన సిబిఐ జగన్ ని ఈరోజు నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన విషయం తెలిసిందే. కోర్టులో జగన్ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. 

'జగన్‌పై ఎవరూ ఫిర్యాదు చేయలేదు. జగన్ వల్ల నష్టపోయినవారెవరూ లేరు. ఫిర్యాదు లేకున్నా ఆయనను అరెస్ట్ చేశారు. విచారణకు ఇన్ని రోజులుగా పిలవకుండా ఉన్నట్టుండి ఆయనని అరెస్ట్ చేశారు. ఇది అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇవాళ కోర్టు ముందు హాజరుకావాల్సి ఉన్నా నిన్ననే అరెస్ట్ చేయడం చట్ట వ్యతిరేకం. 9 నెలలుగా జగన్‌ను విచారించేందుకు పిలవని సీబీఐ ఇవాళ వితండవాదం చేస్తోంది. సాక్షులను జగన్ బెదిరిస్తారని అంటోంది. ఈ 9 నెలల్లో అటువంటిదేమైనా జరిగిందా? సాక్ష్యాధారాలను తారుమారు చేసే ప్రయత్నం చేశారా? ఊహాగానాలతో జగన్ ఏదో చేస్తారని అనడం అర్థరహితం' అని న్యాయమూర్తికి జగన్ తరపు న్యాయవాదులు విన్నవించారు. 

'జగన్ అరెస్ట్ రాజకీయ అజెండాలో భాగమే. ఇది అధికార దుర్వినియోగం. జగన్ బాధ్యతాయుత ఎంపి. విచారణకు సహకరించలేదనడం నమ్మేవిధంగా లేదు. సాక్షులను జగన్ ప్రభావితం చేస్తాడనేది సిబిఐ ఊహాగానమే. కేసు నమోదైన 9 నెలల్లో చేయనిది ఇప్పుడు చేస్తారనడం దురుద్దేశ పూరితం. ఈ కేసే ఓ కట్టుకథ. విచారణకు పూర్తిస్థాయిలో జగన్ సహకరించారు. 30 గంటలకు పైగా సీబీఐ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అరెస్ట్ చేయాలన్న ఆతృతను సిబిఐ ప్రదర్శించింది' అని జగన్ తరఫు న్యాయవాదులు న్యాయమూర్తికి తెలిపారు.
Share this article :

0 comments: