పక్కా పథకం ప్రకారమే జగన్ అరెస్టు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పక్కా పథకం ప్రకారమే జగన్ అరెస్టు

పక్కా పథకం ప్రకారమే జగన్ అరెస్టు

Written By news on Tuesday, May 29, 2012 | 5/29/2012

చంద్రబాబు కనుసన్నల్లో కిరణ్ పాలన
ఉప ఎన్నికల్లో కనీసం మెజారిటీ అయినా తగ్గించాలనే కుట్ర


హైదరాబాద్, న్యూస్‌లైన్: ప్రజల్లో జనాదరణ పెంచుకుం టున్న తమ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని కాం గ్రెస్, టీడీపీలు ఒక పక్కా పథకం ప్రకారమే అరెస్టు చేయిం చాయని వైఎస్సార్ కాంగ్రెస్ పేర్కొంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించింది. జగన్ కాంగ్రెస్‌ను వీడిన తరువాతనే ఆయనపై వేధింపులు ప్రారంభం అయ్యాయని, ఆయన ఓదార్పుయాత్ర చేస్తూ ప్రజాదరణను పెంచుకోవడాన్ని ఓర్చుకోలేక పోయిన టీడీపీ కూడా అందుకు తోడయ్యిందని పార్టీ అభిప్రాయపడింది. కుట్ర పూరితంగా జరిగిన ఈ అరెస్టును వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ముక్త కంఠంతో ఖండించారు. 

జగన్ అరెస్టు అనంతరం సోమవారం ఉదయం నగరంలో అందుబాటులో ఉన్న ముఖ్యనేతల అత్యవసర సమావేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. సమావేశం వివరాలను పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు వెల్లడించారు. రాష్ట్రంలో నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం పూర్తిగా చంద్రబాబు కనుసన్నల్లోనే నడుస్తోందని విమర్శించారు. జగన్‌ను అరెస్టు చేసిన రోజు ఒక చీకటి రోజు అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఒక మినీ ఎమర్జెన్సీ తరహాలో పాలన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ను అరెస్టు చేయడం ద్వారా ఆయనకు ప్రజల్లో ఉన్న ఆదరణను ఎంతో కొంత తగ్గించాలని, ఎలాగూ ఉప ఎన్నికల్లో ఓడిపోతున్నాం కనుక మెజారిటీనైనా తగ్గించాలనే దురుద్దేశంతోనే అరెస్టు చేశారన్నారు. 

జగన్‌ను ప్రజల్లో తిరక్కుండా అరెస్టు చేస్తే విధ్వం సాలు జరుగుతాయని, వాటిని సాకుగా చూపి ఎన్నికలు వాయిదా వేయాలనే కుట్రను రచించారని గట్టు తెలిపారు. అందుకే జగన్ జైలు నుంచి విడుదల అయ్యేవరకూ వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎలాంటి ఆవేశకావేశాలకు లోనుకాకుండా, రెచ్చిపోకుండా సంయమనం పాటిస్తూ శాంతియుతంగా నిరసనలు తెలుపుతూనే ఉండాలని పిలుపునిచ్చారు. మే 28వ తేదీన ఎప్పటిలాగే జరగాల్సిన టీడీపీ మహానాడును కూడా చంద్రబాబునాయుడు వాయిదా వేశారంటేనే అది కుట్రలో ఒక భాగమని స్పష్టమవుతోందని అన్నారు. అరెస్టు సంగతి బాబుకు ముందే తెలిసి ఇలా చేశారని చెప్పారు. విధ్వంసాలు జరిగినట్లు చూపించాలని ప్రభుత్వం తాపత్రయపడుతోందనీ ఆయన అన్నారు. తమ పార్టీ కార్యకర్తలు శాంతియుతంగా ఉన్నా వెల్లాల రామ్మోహన్‌తో పాటు పలువురిని అరెస్టు చేసి.. వారితో బలవంతంగా విధ్వంసాలకు పాల్పడాలనే కుట్ర జరిగినట్లుగా పోలీసులు చెప్పించారని గట్టు పేర్కొన్నారు. 

రాష్ట్రంలో పార్టీ కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టు చేసి వేధిస్తున్నారని తెలిపారు ఆరోగ్య పరీక్షలకు ఆసుపత్రికి వెళ్లిన తమ పార్టీ నాయకుడు జూపూడి ప్రభాకర్‌రావును కూడా అరెస్టు చేయడం దుర్మార్గం అనీ, ఇలాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయన్నారు. 28వ తేదీన మరో పది గంటల్లో సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉన్న జగన్‌ను.. సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ రాజ్యాంగ విరుద్ధంగా అరెస్టు చేశారని విమర్శించారు. సీబీఐ తీరును ప్రజలు గమనిస్తున్నారని గట్టు చెప్పారు. తన బిడ్డను ఎందుకు అన్యాయంగా అరెస్టు చేశారని ప్రశ్నించి విజయమ్మ దీక్షకు పూనుకుంటే.. ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య అని అయినా చూడకుండా ఆమెను నిర్దాక్షిణ్యంగా అక్కడినుంచి తరలించడం దారుణమని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుటుంబానికి ఇచ్చే విలువ ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దనీ పోరాడి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందామని గట్టు అన్నారు. ముఖ్య నేతల సమావేశంలో భూమా శోభానాగిరెడ్డి, ఎం.వి.మైసూరారెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ మంత్రి ఎస్.సంతోష్‌రెడ్డి, డి.ఏ.సోమయాజులు, వాసిరెడ్డి పద్మ, పి.ఎన్.వి.ప్రసాద్, ఎమ్మెల్సీ సి.నారాయణరెడ్డి, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు, కడప జిల్లా నాయకుడు రఘురామిరెడ్డి పాల్గొన్నారు. 
Share this article :

0 comments: