వైఎస్ మరణం వెనుక కుట్ర బయట పడుతుందనేనా..? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ మరణం వెనుక కుట్ర బయట పడుతుందనేనా..?

వైఎస్ మరణం వెనుక కుట్ర బయట పడుతుందనేనా..?

Written By news on Monday, May 28, 2012 | 5/28/2012


 దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడానికి.. ఉప ఎన్నికల సమయంలో రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డిని సీబీఐ దర్యాప్తు పేరుతో అరెస్టు చేయడానికి ఏమైనా లింకు ఉందా? ‘ఏం చేయదల్చుకున్నారు నా బిడ్డను? భర్తను పంపించారు. ఏం తప్పుచేశాడని ఇప్పుడు నా బిడ్డను ఇలా చేస్తున్నారు?’ అంటూ జగన్‌మోహన్‌రెడ్డి అరెస్టు తరువాత ఆయన తల్లి విజయమ్మ అన్న మాటలు వింటే.. ఆ రెండు సంఘటనలకు సంబంధం ఉన్నట్టుగా దివంగత ముఖ్యమంత్రి కుటుంబం అనుమానపడుతున్నట్టు అర్ధమవుతుంది. వాస్తవానికి వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంపై ప్రజల్లో ఇప్పటికీ అనేక అనుమానాలు ఉన్నాయి. తాజాగా విజయమ్మ మాటల తర్వాత అవి మరింతగా బలపడ్డాయి. జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయంగా బలపడితే రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంపై మరిన్ని కొత్త కోణాలు వెలుగులోకి వస్తాయన్న భయంతోనే ఆ కుటుంబానికి వ్యతిరేకంగా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారనే అనుమానాలు మరింతగా పెరిగిపోతున్నాయి. ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌లోని కీలకమైన కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్)లో.. ప్రమాదం జరగడానికి ముందు 33 నిమిషాల సేపు అందులో ఉన్న వారు ఏం మాట్లాడుకున్నారో రికార్డు అవుతుంది.

అయితే వైఎస్ ప్రయాణించిన హెలికాప్టర్‌లోని సీవీఆర్‌లో ఏడు నిమిషాల వాయిస్ మాత్రమే రికార్డయిందని దర్యాప్తు సంస్థలు తేల్చినట్టుగా ప్రకటించడం, ఆ తర్వాత ఆ సీవీఆర్‌ను బయట పెట్టకపోవడంపై తొలినుంచీ అనుమానాలున్నాయి. ఈ ప్రమాదం వెనుక కుట్ర దాగి ఉందని వైఎస్ కుటుంబ సభ్యులు తొలినుంచి అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అప్పట్లో రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంపై దర్యాప్తు పూర్తి చేసిన సీబీఐ కేవలం ఆరేడు నెలల వ్యవధిలోనే.. ‘ఆ ప్రమాదంలో ఎలాంటి కుట్ర కోణం లేదు’ అంటూ నివేదిక ఇవ్వడం తెలిసిందే. తాజాగా జగన్‌ను అరెస్టు చేసిన నేపథ్యం లో ‘నా భర్తను పంపించారు... నా కుమారుడిని ఏం చేయదలిచారు?’ అంటూ విజయమ్మ నేరుగా ప్రశ్నించడంతో రాష్ట్రవ్యాప్తంగా జగన్ అభిమానుల్లో ఆందోళన మొదలైంది.

ఎప్పుడు ఏం జరిగింది

2009 సెప్టెంబర్ 2: హెలికాప్టర్ ప్రమాదంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం.
2010 జనవరి 7: వైఎస్ మరణంలో కుట్రుందంటూ మీడియాలో కథనాలు.. అభిమానుల ఆగ్రహం, విధ్వంసం
జనవరి 20: వైఎస్ హెలికాప్టర్ ప్రమాదానికి పైలట్ తప్పిదమే కారణమంటూ డీజీసీఏ త్యాగి కమిటీ నిర్ధారణ. వాయిస్ రికార్డర్‌లో సంభాషణలు లభ్యం కాకపోవడంతో నివేదికపైనే అనుమానాలు.
ఫిబ్రవరి 11: వైఎస్ హెలికాప్టర్ ప్రమాదానికి వాతావరణం ఒక్కటే కారణం కాదని మరికొన్ని కారణాలున్నాయంటూ ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ద్విసభ్య కమిటీ నివేదిక.
మే 14 : వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో కుట్ర లేదంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సీబీఐ నివేదిక

Share this article :

0 comments: