ఆ పత్రిక కథనం అవాస్తవం: రంగారావు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆ పత్రిక కథనం అవాస్తవం: రంగారావు

ఆ పత్రిక కథనం అవాస్తవం: రంగారావు

Written By news on Tuesday, May 29, 2012 | 5/29/2012



హైదరాబాద్, న్యూస్‌లైన్: సీబీఐ విచారణ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి... నిమ్మగడ్డ ప్రసాద్‌ను దుర్భాషలాడారంటూ, ఆ విషయాన్ని తాను చెప్పానంటూ ఒక దినపత్రికలో వచ్చిన కథనంలో ఎలాంటి వాస్తవం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సోమవారం విజయమ్మ దీక్షకు సంఘీభావం ప్రకటించిన అనంతరం సుజయ్ కృష్ణ రంగారావు విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఇలాంటి కథనాలు రాసినందుకు ఆ పత్రిక సిగ్గుతో తలదించుకోవాలి. కనీస జర్నలిజం విలువలు కూడా వారికి పట్టవు. సీబీఐ దర్యాప్తు జరుగుతున్నప్పుడు మూడో వ్యక్తిని అనుమతించరన్న విషయం కూడా ఆ పత్రికకు తెలియదా? కనీస ఇంగిత జ్ఞానం లేకపోతే ఎలా?’ అని దుయ్యబట్టారు.

సీబీఐ విచారణకు జగన్‌తో పాటు తాను దిల్‌కుశ అతిథిగృహం వరకు వెళ్లిన మాట వాస్తవమే అయినప్పటికీ లోపలికి మాత్రం వెళ్లలేదన్నారు. సీబీఐ అధికారులు విచారణ గదిలోకి ఎవరినీ అనుమతించరన్న విషయం తెలిసి కూడా వార్తలు రాశారంటే వారి అజ్ఞానానికి ఇదే నిదర్శనమని ఎద్దేవా చేశారు. తనపై ఇలాంటి అవాస్తవ కథనాలు రాయడం దురదృష్టకరమన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఎప్పుడు చేరతారని ఈ సందర్భంగా ప్రశ్నించగా... ఇప్పటికే తమ క్యాడర్ మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారని, తాను కూడా ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నానని దాన్ని తర్వలో వెల్లడిస్తానని బదులిచ్చారు.
Share this article :

0 comments: