ఈ కుట్రలకు రెండున్నరేళ్లు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఈ కుట్రలకు రెండున్నరేళ్లు

ఈ కుట్రలకు రెండున్నరేళ్లు

Written By news on Monday, May 28, 2012 | 5/28/2012

* నల్లకాలువ నుంచి దిల్‌కుశ దాకా.. అడుగడుగునా వేధింపులే
* రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ ఇచ్చిన గౌరవమిది
* మాటపై నిలబడినందుకు జగన్‌ను వెంటాడి వేధిస్తున్న వైనం
* వైఎస్ మృతిని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను ఓదార్చేందుకు ససేమిరా
* అడుగడుగునా అడ్డంకులు.. నెల రోజులు అపాయింట్‌మెంటే ఇవ్వని సోనియా
* జగన్ కాంగ్రెస్‌ను వీడాక మొత్తం కుటుంబాన్నే వెంటాడిన అధిష్టానం 
* రాజకీయ మనుగడపై భయంతో టీడీపీతో సైతం కలిసిన కాంగ్రెస్ 

హైదరాబాద్, న్యూస్‌లైన్: కుట్రలు... కుతంత్రాలు... వేధింపులు... మహా నేత కుమారునిపై రెండున్నరేళ్లుగా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తూ వస్తున్న సింగిల్ పాయింట్ ఎజెండా ఇదే! డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మహాభినిష్ర్కమణం తర్వాత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అణగదొక్కడానికి చేస్తున్న ప్రయత్నాలకు పరాకాష్టగా చివరికి ఆయనను జైలుపాలు చేశారు. అంపశయ్యపై కునారిల్లుతున్న రాష్ట్ర కాంగ్రెస్‌ను ఒంటిచేత్తో రెండుసార్లు అధికారంలో తెచ్చిన వైఎస్‌కు పార్టీ చివరికి ఈ విధంగా ప్రతిఫలం చెల్లించిందన్న వ్యాఖ్యలు పీసీసీ వర్గాల నుంచే విన్పిస్తున్నాయి.

తండ్రి మరణాన్ని తట్టుకోలేక అసువులు బాసిన వారి కుటుంబాలను ఓదారుస్తానని నల్లకాల్వ వద్ద ఇచ్చిన మాటకు మాటపై నిలబడ్డందుకు జగన్‌పై మొదలైన వేధింపులు, కాలక్రమంలో తీవ్రతరం అవుతూ వచ్చాయి. అందులో భాగంగా తిరుగులేని మహా నేత అంటూ కొనియాడిన నోటితోనే వైఎస్‌పై కాంగ్రెస్ నేతలు అవినీతి బురద చల్లేందుకు తెగించారు! కొంతకాలం పరోక్షంగా ఒత్తిళ్లు.. ఆ తర్వాత మానసిక వేధింపులతో రాజకీయ క్రీడకు కాంగ్రెస్ తెర తీసింది. ఈ ప్రయత్నంలో విపక్ష టీడీపీతో కూడా జతకట్టింది. చెప్పినట్టు వినలేదన్న కోపంతో జగన్‌ను రాజకీయంగా అంతమొందించేందుకు ఒకటి కాదు.. ఏకంగా రెండున్నరేళ్లుగా వెంటపడి వేధిస్తున్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు లేఖ, టీడీపీ నేతల పిటిషన్‌పై దర్యాప్తు పేరుతో తొమ్మిది నెలలుగా జగన్‌ను సీబీఐ అనేక రకాలుగా వేధింపులకు గురి చేస్తోందన్న మాటే రాష్ట్రవ్యాప్తంగా అందరి నోటా వినిపిస్తోంది. ఒక లోక్‌సభ, 18 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో మట్టికరవడం, తన ఉనికే ప్రమాదంలో పడటం ఖాయమనే అంచనాల కారణంగానే.. చివరి ప్రయత్నాల్లో భాగంగా జగన్‌ను అరెస్టు చేయించిదంటూ మండిపడుతున్నారు.

ఓదార్పుపై ఆంక్షలు
నల్లకాల్వలో ఇచ్చిన మాట మేరకు 2010 ఏప్రిల్ 9న పశ్చిమ గోదావరి జిల్లా నుంచి జగన్ ఓదార్పు యాత్రను మొదలు పెట్టారు. తర్వాత ఖమ్మం, వైఎస్సార్ జిల్లాల్లో యాత్ర కొనసాగింది. ఆ ఏడాది మే 28 నుంచి వరంగల్‌లో జగన్ తలపెట్టిన ఓదార్పు యాత్రకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో పాటు అధిష్టానం పెద్దలూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో చిరంజీవిని తమ వైపుకు తిప్పుకునే యోచనకు కాంగ్రెస్ తెర తీసింది. రాజ్యసభ ఎన్నికల్లో మద్దతు కోరే సాకుతో సోనియాగాంధీ స్వయంగా చిరును ఢిల్లీకి ఆహ్వానించారు. 

అధిష్టానం సూచనల మేరకు ఓదార్పును తాత్కాలికంగా వాయిదా వేసుకున్న జగన్.. తల్లి విజయమ్మ, సోదరి షర్మిల వెంట రాగా ఢిల్లీ వెళ్లి సోనియాను ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకే నెల పాటు నాన్చిన సోనియా, తర్వాత కూడా.. ఓదార్పును జిల్లాకో సభకు పరిమితం చేసుకోవాలంటూ ఆంక్షలు పెట్టారు. ప్రజలకిచ్చిన మాట మేరకు జూలై 8 నుంచి శ్రీకాకుళం జిల్లాలోఓదార్పు యాత్రకు జగన్ సిద్ధపడటంతో అధిష్టానం తన వ్యూహాలకు పదును పెట్టింది. యాత్రకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యేలను ఆదేశించింది. పార్టీ నేతలెవరూ పాల్గొనకూడదని నాటి సీఎం రోశయ్య ప్రకటన కూడా చేశారు!

పొమ్మనకుండా పొగ
జగన్‌ను పార్టీలోనే ఒంటరిని చేసేలా కాంగ్రెస్ పెద్దలు పథక రచన చేశారు. ‘జగన్‌పై వేటా? లేటా?’ అంటూ పూటకో కథనంతో ఎల్లో పత్రికలు కూడా తమ వంతు పాత్ర పోషించాయి. జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిని తమవైపు తిప్పుకుని వైఎస్ కుటుంబాన్ని చీల్చేందుకు కూడా సీఎం కిరణ్‌తో కలిసి అధిష్టానం ప్రయత్నించింది. దాంతో కాంగ్రెస్‌కు జగన్ రాజీనామా చేశారు. కడప లోక్‌సభ స్థానానికి ఆయన, పులివెందుల అసెంబ్లీ స్థానానికి విజయమ్మ రాజీనామా చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు.

కాంగ్రెస్‌కు టీడీపీ దన్ను 
సరిగ్గా ఈ సమయంలోనే సాక్షి పత్రిక పెట్టుబడులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు హైకోర్టుకు రాసిన లేఖపై చర్యలు మొదలయ్యాయి. శంకర్రావు కేసులో టీడీపీ ఇంప్లీడైంది. జగన్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో చేతులు కలిపింది. 2011 మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్రులుగా పోటీ చేసిన జగన్ మద్దతుదారులను నిలువరించేందుకు పలుచోట్ల కాంగ్రెస్, టీడీపీ నేతలు కుమ్మక్కయ్యారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో పలువురు జగన్‌కు బాసటగా నిలవడంతో, కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనమయ్యే దాకా అవిశ్వాస తీర్మానాన్ని వ్యూహాత్మకంగా ఆలస్యం చేయడం ద్వారా.. మైనారిటీలో పడ్డ ప్రభుత్వాన్ని టీడీపీ ఆదుకున్న వైనమూ బట్టబయలైంది. నిజానికి జగన్ అనుకూల కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత ఓటే లక్ష్యంగా అవిశ్వాస ప్రహసనం కొనసాగిందని అనంతర రాజకీయ పరిణామాలు నిరూపించాయి.

ఎన్నికల వేళ జగన్‌ను దూరం చేసేందుకే..
సొంత పార్టీ ఎమ్మెల్యేలు విప్‌ను ధిక్కరించినా, గెలుపుపై అనుమానంతో వారిపై వేటుకు కాంగ్రెస్ నెలల తరబడి వెనకాముందాడుతూ వచ్చింది.

చివరికి రాజ్యసభ ఎన్నికల్లో వారేం చేస్తారోననే భయంతో, నాలుగు నెలల తరవాత మార్చి 2న వేటు వేసింది. కానీ ఆ స్థానాల్లో సెప్టెంబర్ దాకా ఉప ఎన్నికలు జరగకుండా చూసేందుకు చివరిదాకా విఫలయత్నం చేసింది. రాష్ట్రపతి ఎన్నికల కారణంగా జూన్‌లోనే ఉప ఎన్నికలకు ఈసీ తెర తీయడంతో.. వాటి ఫలితాలు సర్కారు పుట్టి ముంచుతాయని కాంగ్రెస్ భయపడింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని ఎలాగోలా అడ్డుకోవాలన్న దుష్ట తలంపులో భాగంగానే.. ప్రచారంలో ఉన్న జగన్‌ను సీబీఐ విచారణకంటూ పిలిపించి అరెస్టు చేసింది!
Share this article :

0 comments: