జగన్‌ను అరెస్టు చేసి, అల్లర్లు సృష్టించేందుకు పక్కాగా ఎత్తుగడ అందుకు వైఎస్సార్‌సీపీ నేతలు, శ్రేణులనే బాధ్యులను చేసే కుట్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్‌ను అరెస్టు చేసి, అల్లర్లు సృష్టించేందుకు పక్కాగా ఎత్తుగడ అందుకు వైఎస్సార్‌సీపీ నేతలు, శ్రేణులనే బాధ్యులను చేసే కుట్ర

జగన్‌ను అరెస్టు చేసి, అల్లర్లు సృష్టించేందుకు పక్కాగా ఎత్తుగడ అందుకు వైఎస్సార్‌సీపీ నేతలు, శ్రేణులనే బాధ్యులను చేసే కుట్ర

Written By news on Sunday, May 27, 2012 | 5/27/2012

జగన్‌ను అరెస్టు చేసి, అల్లర్లు సృష్టించేందుకు పక్కాగా ఎత్తుగడ
అందుకు వైఎస్సార్‌సీపీ నేతలు, శ్రేణులనే బాధ్యులను చేసే కుట్ర
అరెస్టు, బైండోవర్లతో వారిని ఉప ఎన్నికల ప్రచారానికి దూరం చేసే ప్రయత్నం

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఉప ఎన్నికల వేళ రకరకాల కుట్రలకు కాంగ్రెస్ పదును పెడుతోంది. ఒక లోక్‌సభ, 18 అసెంబ్లీ స్థానాల్లో అంతటా ఓటమి తప్పదని తేలిపోవడంతో ఏకంగా ఉప ఎన్నికలనే వాయిదా వేయించేందుకు కొద్దిరోజులుగా ఎన్నో ఎత్తులు వేస్తున్న కాంగ్రెస్, ఒకవేళ అది సాధ్యం కాకుంటే మరో మార్గం నుంచి నరుక్కు రావాలని భావిస్తోంది. జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్టు చేయించి.. రాష్ట్రవ్యాప్తంగా, మరీ ముఖ్యంగా ఉప ఎన్నికలు జరిగే చోట్ల భారీగా అల్లర్లు సృష్టించి, అందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను బాధ్యులుగా చూపి, వారిని మూకుమ్మడిగా అరెస్టులు చేయించేలా పథక రచన చేసింది. 

ఎన్ని రకాలుగా గందరగోళ పరిస్థితులు సృష్టించినా ఉప ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేయకుంటే ఏం చేయాలా అంటూ తీవ్రంగా మల్లగుల్లాలు పడ్డ ప్రభుత్వ పెద్దలు, జగన్ అరెస్టు తర్వాతి పరిణామాల్లో వైఎస్సార్‌సీపీ కింది స్థాయి నేతలను కూడా వీలైనంత మందిని ‘కట్టడి చేయాలని’ చివరికి నిర్ణయించినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. అరెస్టు ద్వారా జగన్‌ను ఉప ఎన్నికలకు దూరం చేయగలిగినా, ఆయా చోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ ముఖ్యులను కూడా దూరం చేస్తే తప్ప లాభం లేదని కాంగ్రెస్ పెద్దలు నిశ్చయానికి వచ్చారు. వారిని దూరం చేసేందుకు జగన్ అరెస్టునే సాకుగా తీసుకోనున్నట్టు సమాచారం. అరెస్టు సందర్భంగా హింసకు, విధ్వంసానికి పాల్పడి.. అందుకు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలనే బాధ్యులుగా చూపుతూ ఉప ఎన్నికలు జరిగే చోట్ల పార్టీ ముఖ్యులను, శ్రేణులను వీలైనన్ని కేసుల్లో ఇరికించాలని, అరెస్టులు, బైండోవర్లతో ఎన్నికలకు దూరం చేయాలని నిర్ణయించారు. 

‘జగన్ అరెస్టుకు రంగం సిద్ధం చేశాం. ఇక ఉప ఎన్నికల విషయంలో మనం అనుకున్న పథకాన్ని అమలు చేయండి’ అంటూ కాంగ్రెస్ ముఖ్య నేత, ఒక పోలీసు ఉన్నతాధికారిని ఆదేశించినట్టు తెలిసింది. ఈ పథకం అమలు కూడా ఇప్పటికే మొదలైనట్టు జరుగుతున్న పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. జగన్‌ను అరెస్టు చేస్తే వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు విధ్వంసానికి పాల్పడుతారనే అనుమానాలను వ్యాప్తి చేయడంతో పాటు పార్టీకి చెందిన పలువురు నేతలను ఇప్పటికే పోలీసులు పలు కేసుల్లో ఇరికించారు. 

ఎన్నికలు జరుగుతున్న అన్నిచోట్లా ఇదే వ్యూహాన్ని అమలు చేసి, పార్టీ నాయకులను ఎన్నికలకు దూరం చేస్తారని తెలుస్తోంది. ఇలా అందుబాటులో ఉన్న అస్త్రశస్త్రాలన్నిటినీ ప్రయోగిస్తే కనీసం ఒకట్రెండు స్థానాలైనా దక్కి పరువు మిగులుతుందనే అంచనాకు వచ్చారంటున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఎవరెవరిని అదుపులోకి తీసుకోవాలో పోలీసులు ఇప్పటికే జాబితాలను రూపొందించారు. అందులో భాగంగా పలువురు నేతల ఇళ్ల పరిసరాలను కూడా వారు పరిశీలించినట్టు విశ్వసనీయంగా సమాచారం అందుతోంది. ఎన్నికలకు దూరంగా ఉండేలా కొందరు నేతలను నయానో భయానో బెదిరించైనా ఎన్నికలకు దూరం పెట్టాలంటూ పై నుంచి ఆదేశాలు అందినట్టు పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. మరోవైపు, చివరి వారం రోజుల్లో విచ్చలవిడిగా ‘అన్నింటినీ’ పంపిణీ చేయడానికి అధికార పార్టీ ఆధ్వర్యంలో ఇప్పటికే ఏర్పాటన్లీ పూర్తయ్యాయని కూడా తెలుస్తోంది!
Share this article :

0 comments: