రైతు కుటుంబాలకూ షర్మిల పరామర్శ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రైతు కుటుంబాలకూ షర్మిల పరామర్శ

రైతు కుటుంబాలకూ షర్మిల పరామర్శ

Written By news on Monday, December 1, 2014 | 12/01/2014

మహబూబ్ నగర్: వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల 5 రోజుల పాటు మహబూబ్‌నగర్ జిల్లాలో పరామర్శ యాత్ర చేపట్టనున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి తెలిపారు. ఈ నెల 8 నుంచి 12 వరకు 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర సాగుతుందని చెప్పారు.

పరామర్శ యాత్ర పోస్టర్ ను మహబూబ్ నగర్ లో సోమవారం కిష్టారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 921 కిలోమీటర్ల మేర షర్మిల యాత్ర చేయనున్నారని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను కూడా షర్మిల పరామర్శిస్తారని చెప్పారు. కల్వకుర్తి నుంచి పరామర్శ యాత్ర ప్రారంభం కానుంది.
Share this article :

0 comments: