జనవరిలో షర్మిల నల్లగొండ పరామర్శ యాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జనవరిలో షర్మిల నల్లగొండ పరామర్శ యాత్ర

జనవరిలో షర్మిల నల్లగొండ పరామర్శ యాత్ర

Written By news on Thursday, December 4, 2014 | 12/04/2014

నల్లగొండ : వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పరామర్శ యాత్ర జిల్లాలో చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధమవుతోంది. దివంగత సీఎం  వైఎస్.రాజశేఖరరెడ్డి మర ణాన్ని తట్టుకోలేక మృతి చెందినవారి కుటుంబాలను పరామర్శించేందుకు త్వరలో జిలాల్లో పర్యటించేందుకు పార్టీపరంగా ఏర్పాట్లు  జరుగుతున్నాయి. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లో పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డితో జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. షర్మిల పరామర్శ యాత్రతో పాటు, జిల్లా పార్టీ సంస్థాగత నిర్మాణం, కొత్తగా నియమించాల్సిన కమిటీల గురించి చర్చిం చారు. షర్మిల పరామర్శ యాత్ర మొదట ఈ నెలలో మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రారంభమవుతుంది.
 
 అక్కడ యాత్ర ము గిసిన అనంతరం జిల్లాలో కొనసాగించనున్నారు. పార్టీ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అన్ని సవ్యంగా సాగితే జనవరి నెలాఖరున లేదా ఫిబ్రవరి మొదటివారంలో షర్మిల పరామర్శ యాత్ర జిల్లాలో చేపట్టాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే పరామర్శయాత్ర కంటే ముందుగానే జిల్లాలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి జగన్‌తో కూలంకషంగా చర్చించారు. జిల్లా అధ్యక్షుడిగా శ్రీకాంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలన్నింటినీ బేరీజు వేసుకుని జిల్లాలో పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయనున్నారు.
 
 ముందుగా గ్రామ, మండల, నియోజకవర్గాల వారీగా కమిటీలు, ఆతర్వాత జిల్లా కమిటీ ఎన్నిక ఉంటుంది. త్వరలో దీనికి సంబంధించిన షెడ్యూల్.. పార్టీ తరఫున అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే పార్టీలో ఎలాంటి మార్పులు చేయాలి...? ఎలాంటి నాయకత్వానికి ప్రాధాన్యమివ్వాలి అనే అంశాలు, వివిధ నియోజవర్గాల్లో పార్టీ తాజా స్థితి గతుల పైనే జగన్‌కు శ్రీకాంత్‌రెడ్డి వివరించారు. పార్టీ ప్రక్షాళన, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించి పోరాటాల రూపకల్పన,  షర్మిల పరామర్శ యాత్ర విజయవంతం చే సే దిశగా పార్టీ యాక్షన్ ప్లాన్ ఉండబోతున్నట్లు పార్టీవర్గాలు తెలిపాయి.
Share this article :

0 comments: