మొదటి సంతకం ఒక బూటకo - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మొదటి సంతకం ఒక బూటకo

మొదటి సంతకం ఒక బూటకo

Written By news on Tuesday, December 2, 2014 | 12/02/2014

చంద్రబాబు మాటలన్నీ బూటకం
  • వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్ ధ్వజం
అక్కిరెడ్డిపాలెం : తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. మిందిలోని తన నివాసంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రుణమాఫీ విషయంలో ప్రభుత్వం రైతులను ఘోరంగా మోసం చేసిందన్నారు. దీంతో పలువురు రైతులు అప్పుల ఊబిలో చిక్కుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు.

డ్వాక్రా రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అని చెప్పిన బాబు తరువాత వాటిని విస్మరించారన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని, విశాఖ కలెక్టరెట్ వద్ద జరిగే కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారని తెలిపారు. పార్టీ గాజువాక సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ మెనిఫెస్టోలో ఒక్క హామీని ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు.

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం సమయంలో రైతు రుణమాఫీ అని చంద్రబాబు పెట్టిన మొదటి సంతకం ఒక బూటకమన్నారు. హుద్‌హుద్ తుపాను సమయంలో ప్రభుత్వం సరిగా స్పందించలేదని ఆరోపించారు. త్వరలో జీవీఎంసీ ఎన్నికలు ఉండడంతో నగరంలో 25 కిలోలు బియ్యం పంపిణీ చేశారని, గ్రామీణ ప్రాంతాల్లో తుపాను బాధితులకు 8 నుంచి 10 కేజీల బియ్యం మాత్రమే ఇచ్చారన్నారు. కొన్ని గ్రామాల్లో బియ్యం కూడా ఇవ్వలేదని విమర్శించారు.

పార్టీ రాష్ట్ర కార్యదర్శి తిప్పల గురుమూర్తిరెడ్డి మాట్లాడుతూ తుపాను తర్వాత ఇతర రాష్ట్రాలు పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం చేశాయి తప్పా రాష్ట్ర ప్రభుత్వం ఏమిచేయలేదన్నారు. వచ్చిన మొత్తాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేస్తున్నారని, అందుకు సంబంధించిన లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు గుడివాడ అప్పలరామ్మూర్తి, ఈటి రంగారావు, సండ్రాన నూకరాజు, ఈతలపాక యువశ్రీ, గొంతిన సత్యవతి, ఈటి అన్నపూర్ణ, పోలవరపు రాజకుమారి, బత్తిన శ్రీదేవి, సత్యవతి, వెంకటలక్ష్మి పాల్గొన్నారు.
Share this article :

0 comments: