
కచ్చితంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ మరి కొన్ని గంటల్లో ధర్నాలకు, రాస్తారోకోలకు సిద్ధం అవుతుండగా.. అధికార పార్టీ రుణమాఫీ గురించి ప్రకటన చేసింది.
మరి మామూలుగా ఎప్పుడైనా బాబు గారు తన విదేశీ పర్యటనల మధ్య కొంచెం సేపు తీరిక చేసుకొని ఇలాంటి ప్రకటన ఏదైనా చేసి ఉంటే ఆ కథ వేరుగా ఉండేది. అయితే ప్రత్యేకించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ రుణమాఫీ విషయంలో ధర్నాలకు రెడీ అవుతుండగా... భారీ స్థాయిలో ఈ కార్యక్రమం చేపట్టనున్నామని ప్రకటించిన నేపథ్యంలో అధికార పార్టీ స్పందించింది. ఏ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డో.. వర్ల రామయ్యో... యనమలో... మీడియా ముందకు వస్తే ప్రయోజనం లేదని గ్రహించి చంద్రబాబే స్వయంగా ముందుకొచ్చారు!
దీన్ని బట్టి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వ్యూహం బరిలోకి దిగకుండానే అధికార పక్షాన్ని ఆత్మరక్షణలో పడేసిందని చెప్పవచ్చు. రుణమాఫీ చాలా విస్తృతమైన అంశం. ఈ మ్యాటర్ లో రైతులు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. వారి అసహనం కచ్చితంగా ప్రధాన ప్రతిపక్షానికి వరంగా మారుతుంది. ధర్నాలు విజయవంతం అయ్యే అవకాశం ఉందని గ్రహించి స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగాడు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ ధర్నాల వ్యూహాన్ని బ్రేక్ చేయడానికి అన్నట్టుగా ఆయన ప్రకటన చేశాడు.
మరి తాము ధర్నాల గురించి హెచ్చరించగానే.. ప్రభుత్వం తరపు నుంచి ఈ మాత్రం ప్రకటన రావడం వైకాపా సాధించిన విజయమేనని అనుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీని లెక్క చేయనట్టయితే వ్యవహారం వేరే రకంగా ఉండేది! మీకు ఇష్టం వచ్చిన ధర్నాలు మీరు చేసుకొండి.. ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు... వారికి మా మీద విశ్వాసం ఉంది... మీ ధర్నాలతో మాకు వచ్చే నష్టం ఏమీ లేదు... అని గంభీరం ఉండేది. కనీసం మేకపోతు గాంభీర్యం అయినా ప్రకటించేది.
అయితే ప్రధాన ప్రతిపక్ష పార్టీ దర్నాల నేపథ్యంలో ప్రకటన చేసేసి.. ప్రభుత్వం ఒక విధంగా తన బేల తనాన్ని బయటపెట్టేసుకొంది. తద్వారా ఒక విధంగా సెల్ఫ్ గోల్ చేసుకొంది.. వైకాపా ఖాతాలోకి గోల్ జత చేసింది!
- See more at: http://telugu.greatandhra.com/politics/gossip/cbn-prakatana-goal-ycp-57781.html#sthash.rZOHgZUN.dpuf
0 comments:
Post a Comment