వైఎస్ విగ్రహానికి 50నదుల నీటితో అభిషేకం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ విగ్రహానికి 50నదుల నీటితో అభిషేకం

వైఎస్ విగ్రహానికి 50నదుల నీటితో అభిషేకం

Written By ysrcongress on Monday, December 26, 2011 | 12/26/2011

నెల్లూరు: ఉప్పుటూరులో మహానేత డాక్టర్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఈరోజు 50 నదుల నీటితో జలాభిషేకం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేపట్టిన 141రోజుల మహాపాదయాత్ర 50వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మహానేత విగ్రహానికి గంగ, కృష్ణ, పెన్నా, గోదావరి నదుల నీటితో అభిషేకం చేయాలని భావించారు. ఈ సంగతి తెలిసి పాబోలు హరికిషోర్, చీదెళ్ల నారాయణ అనే వ్యక్తులు శివుని పూజ కోసం తెప్పించుకున్న 50 నదుల నీటిని శ్రీధర్ రెడ్డికి అప్పగించారు. రెండేళ్లుగా కష్టపడి వారు ఈ నదీజలాలను శివపూజ కోసం సేకరించారు. జనం గుండెల్లో దేవుడిలా మారిన వైఎస్ఆర్ విగ్రహానికి అభిషేకం చేయడం కోసం వారు ఆ నీటిని ఇచ్చారు. పూజారుల మంత్రోచ్ఛారణల మధ్య 12 జీవ నదులతోపాటు మొత్తం 50 నదుల నీటితో వైఎస్ఆర్ విగ్రహానికి జలాభిషేకం చేశారు. క్రైస్తవ, ముస్లిం సోదరులు కూడా వచ్చి ప్రార్థనలు నిర్వహించారు.

జలాభిషేకం తర్వాత ధాన్యం, వేరుశనగ, పెసర, మినుము వంటి పంటలతో కూడా పూజలు చేశారు. ఆవు, మేకపాలతోనూ అభిషేకం చేశారు. రాజన్న రాజ్యంలో ప్రజలు సుఖసంతోషాలతో ఉంటే, ఇప్పుడు మాత్రం జనం పన్నుల భారం, అధికరేట్లతో ఆందోళన చెందుతున్నారని పార్టీ జిల్లా కన్వీనర్ కాకాని గోవర్థన్ రెడ్డి అన్నారు.
Share this article :

0 comments: