యువజన విభాగం ఆధ్వర్యంలో 600 మంది రక్తదానం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » యువజన విభాగం ఆధ్వర్యంలో 600 మంది రక్తదానం

యువజన విభాగం ఆధ్వర్యంలో 600 మంది రక్తదానం

Written By ysrcongress on Thursday, December 22, 2011 | 12/22/2011


యువజన విభాగం ఆధ్వర్యంలో 600 మంది రక్తదానం
కార్యకర్తలతోపాటు రక్తాన్నిచ్చిన పార్టీ ముఖ్యనేతలు
యువజన విభాగం ఆధ్వర్యంలో 39 కిలోల కేకు కోసిన
ఎమ్మెల్యేలు బాబూరావు, శోభానాగిరెడ్డి, గురునాథ్‌రెడ్డి
సేవాదళ్ విభాగం ఆధ్వర్యంలో 7200 మందికి వైద్య పరీక్షలు
500 మందికి చీరలు పంచిన మహిళా విభాగం
రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా కేకులు కోసిన కార్యకర్తలు


హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 39వ జన్మదిన వేడుకలు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ సందర్భంగా పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనేక చోట్ల భారీ ఎత్తున రక్తదాన శిబిరాలు నిర్వహించారు. పెద్ద సం ఖ్యలో యువకులు, పార్టీ నాయకులు పాల్గొని రక్తాన్నిచ్చారు. రోగులకు పాలు, పండ్లు, రొట్టెలు పంచి పెట్టారు. చాలా చోట్ల నేతలు.. జగ న్ జన్మదిన వేడుకలను అనాథలు, వికలాంగులు, వృద్ధుల మధ్య జరుపుకున్నారు. కార్యకర్తలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో కేక్‌లు కోసి సంబరాలు చేసుకున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర యువజన విభాగం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి సహా 600 మంది పాల్గొని రక్తాన్నిచ్చారు. 

పార్టీ సేవాదళం రాష్ట్ర విభాగం అధ్యక్షుడు కోటింరెడ్డి వినయ్‌రెడ్డి హైదరాబాద్ యూసుఫ్‌గూడలో నిర్వహించిన మెగా వైద్య శిబిరంలో 7200 మంది వైద్య పరీక్షలు చేయించుకుని ఉచి తంగా మందులు పొందారు. రోగులకు ఉచితంగా భోజన సదుపాయం కల్పిం చారు. 75 మంది డాక్టర్లు, 100 మంది నర్సులు వైద్య సేవలందించారు. ఎమ్మెల్యే టి.బాలరాజు నియోజకవర్గమైన బుట్టాయగూడెంలో పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి 500 మంది మహిళలకు చీరలు పంచి పెట్టారు.

రక్తం ఇచ్చిన ప్రముఖులు.. 


పార్టీ ముఖ్య నేతలు బాజిరెడ్డి గోవర్దన్, ఆర్.కె.రోజా, రాజ్‌సింగ్ ఠాకూర్, రంగారెడ్డి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు అమృతా సాగర్ సహా పలువురు కేంద్ర కార్యాలయంలోని శిబిరంలో రక్తదానం చేశారు. అంతకు ముందు నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన పార్టీ శ్రేణుల సమక్షంలో యువజన విభాగం ఏర్పాటు చేసిన 39 కేజీల కేకును ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, భూమా శోభానాగిరెడ్డి, బి.గురునాథ్‌రెడ్డి తదితరులు కట్ చేశారు. పార్టీ సాంస్కృతిక విభాగం కన్వీనర్ వంగపండు ఉష ఈ సందర్భంగా నిర్వహించిన ఆట-పాట కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పార్టీ ఆధ్వర్యంలో విశాఖపట్నం,గుంటూరుల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. కాకినాడలో రాష్ట్ర మహి ళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో వెయ్యి మంది వైఎస్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు నేత్రదాన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
Share this article :

0 comments: