గెలిచిన కుటిల రాజకీయం.. ఓడిన రాష్ట్ర రైతన్న - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గెలిచిన కుటిల రాజకీయం.. ఓడిన రాష్ట్ర రైతన్న

గెలిచిన కుటిల రాజకీయం.. ఓడిన రాష్ట్ర రైతన్న

Written By ysrcongress on Thursday, December 22, 2011 | 12/22/2011

జగన్ వెళ్లి కలవగానే.. భేటీ ఏర్పాటు చేయడంపై ఇరుకునపడ్డ నేతలు
ఈ భేటీలో అన్నదాతల సమస్యల పరిష్కారానికి నిర్ణయాలు తీసుకుంటే క్రెడిట్ జగన్‌కే పోతుందనే దుగ్ధతో కుటిల పన్నాగం అమలు
రెండు వైపుల నుంచి పవార్‌పై ఒత్తిడి తేవాలని వ్యూహం
ఇటు లోక్‌సభలో రైతు సమస్యలపై టీడీపీ రగడ
అటు అధిష్టానంపై భేటీ రద్దుకు కాంగ్రెస్ ఎంపీల ఒత్తిడి
గెలిచిన కుటిల రాజకీయం.. ఓడిన రాష్ట్ర రైతన్న

న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: కుటిల రాజకీయం చివరకు రైతన్ననూ కాటేసింది. రాష్ట్రంలో కష్టాల సాగు చేస్తున్న రైతుల సమస్యల పరిష్కారానికి అడ్డుపడింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యంగా మొదట్నుంచి అంటకాగుతున్న కాంగ్రెస్, టీడీపీలు ఢిల్లీలో తమ దుష్టపన్నాగాన్ని అమలు చేశాయి. ఫలితం.. అన్నదాతల ఇక్కట్లపై చర్చించడానికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ బుధవారం సాయంత్రం పార్లమెంటులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన అత్యవసర భేటీ చివరి నిమిషంలో రద్దయింది. జగన్ హాజరయ్యే ఈ సమావేశంలో రాష్ట్ర రైతుల సమస్యల పరిష్కారానికి ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే.. ఘనత మొత్తం ఆయనకే పోతుందన్న దుగ్ధతో ఆ పార్టీలు అన్నదాత కు తీరని అన్యాయం చేశాయి. రాష్ట్రంలో అష్టకష్టాలు పడుతున్న అన్నదాతలకు భరోసా ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, సబ్బం హరి, పార్టీ రైతు విభాగం కన్వీనర్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి, రైతు విభాగం చిత్తూరు జిల్లా నేత కె.కేశవరెడ్డితో కలిసి మంగళవారం శరద్‌పవార్‌ను కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రైతుల వ్యధను జగన్ కళ్లకుకట్టినట్లు వివరించారు. అన్నదాతల బాగు కోసం తక్షణమే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తూ వినతిపత్రాన్నీ పవార్ కు అందజేశారు. 

రైతన్నల దుస్థితిపై స్పందించిన వ్యవసాయ మంత్రి వెంటనే అన్నదాతల వెతలు, గోదాముల కొరత సమస్యలపై ఆహార, వినియోగదారుల వ్యవహారాలు, ప్రజాపంపిణీ శాఖ సహాయ మంత్రి కె.వి.థామస్, ఎఫ్‌సీఐ చైర్మన్‌తో బుధవారం సాయంత్రం 5.30 గంటలకు అత్యవసర భేటీని ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొనాలని జగన్ బృందాన్నీ ఆహ్వానించారు. ఈ విషయం తెలిసిన కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు, నేతలు ఇరుకున పడ్డారని, జగన్ వెళ్లి కలవగానే.. అన్నదాతల సమస్యల పరిష్కారానికి పవార్ భేటీ ఎలా ఏర్పాటు చేస్తారంటూ మండిపడ్డారని తెలిసింది. ఈ సమావేశాన్ని ఎలాగైనా రద్దు చేయించాలని.. ఇందుకు చెరో వైపు నుంచి పవార్‌ను ఇరుకున పెట్టాలని రెండు పార్టీలు కలిసి వ్యూహ రచన చేసినట్లు తెలియవచ్చింది. 

అటు కాంగ్రెస్.. ఇటు టీడీపీ..

ముందుగా వేసిన పన్నాగం ప్రకారమే.. ఇటు కాంగ్రెస్ ఎంపీలు అధిష్టానంపై ఒత్తిడి తేగా.. అటు టీడీపీ ఎంపీలు పార్లమెంటు వేదికగా పవార్‌పై ఒత్తిడికి దిగినట్లు రెండు పార్టీల ఎంపీల సన్నిహిత వర్గాలు తెలిపాయి. బుధవారం ఉదయం కాంగ్రెస్ ఎంపీల్లో కొందరు పార్టీ అధిష్టానంలోని ముఖ్యులతో మాట్లాడి, సమావేశం జరగకుండా చూడమని గట్టిగా కోరినట్లు తెలిసింది. మరోవైపు మంగళవారం నాడు రైతు సమస్యలపై పార్లమెంటు ఆవరణలో నిరసనకే పరిమితమైన టీడీపీ ఎంపీలు బుధవారం సభలో గొడవకు దిగి, చర్చకు పట్టుబట్టారు. దీని వెనుకున్న అసలు కారణం.. జగన్‌తో పవార్ సమావేశం జరగకుండా అడ్డుకోవడమేనని రాజకీయ వర్గాల కథనం. జగన్ పాల్గొనే ఈ భేటీలో సమస్యల పరిష్కారంపై ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే.. క్రెడిట్ ఆయనకే పోతుందన్న ఉద్దేశంతో టీడీపీ రాత్రికి రాత్రి ఈ మేరకు వ్యూహరచన చేసి, లెఫ్ట్‌తో కలిసి అమలుచేసిందని విశ్లేషకులు చెబుతున్నారు.

చివరికి ఎన్నడూ లేని విధంగా లోక్‌సభలో స్పీకర్ మీరాకుమార్ ఆగ్రహించే స్థాయిలో టీడీపీ ఆందోళనకు దిగడం వెనక అసలు ఉద్దేశం ఇదేనని భావిస్తున్నారు. రైతన్నల ప్రయోజనాలను పణంగా పెడుతూ టీడీపీ, కాంగ్రెస్‌లు చేసిన కుటిల రాజకీయంతో చివరికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి పవార్‌పై ఒత్తిడి వచ్చిందని, తత్ఫలితంగానే ఆయనీ సమావేశాన్ని రద్దు చేశారని చెబుతున్నారు. 

రైతు సమస్యలే ముఖ్యమని తలిచి.. 

వాస్తవానికి మంగళవారం రాత్రే హైదరాబాద్ తిరిగి వెళ్లడానికి ప్రయాణ ఏర్పాట్లు చేసుకున్న జగన్‌మోహన్‌రెడ్డి పవార్ ఆహ్వానంతో ఆ యోచన విరమించుకుని ఢిల్లీలోనే ఉండిపోయారు. బుధవారం తన పుట్టినరోజునాడు కుటుంబసభ్యులతో గడపాలని అనుకున్న జగన్.. రైతు సమస్యలపై పవార్‌తో జరిగే సమావేశానికే ప్రాధాన్యమిచ్చి.. హస్తినలోనే ఉండిపోయారు. బుధవారం పార్లమెంట్ సమావేశాలకూ హాజరయ్యారు. పార్లమెంట్‌లో పలువురు ఎంపీ లు ఆయన్ను కలిసి.. జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, హైదరాబాద్‌కు వెళ్లడం లేదా అని అడిగినప్పుడు కూడా రైతు సమస్యలపై పవార్‌తో సమావేశం ఉన్నం దున ఉండిపోయినట్లు చెప్పారు. అలాగే.. పార్లమెంట్ సెంట్రల్ హాలులో తనను కలిసిన విలేకరులు పవార్‌తో భేటీ జరుగుతుందని భావిస్తున్నారా అని అడిగినప్పుడు కూడా తప్పకుండా జరుగుతుందనే విశ్వాసాన్ని ఆయన వెలిబుచ్చారు. మధ్యాహ్నం వరకూ ఈ భేటీ జరుగుతుందనే అందరూ భావించినా.. కాంగ్రెస్, టీడీపీ పన్నాగాలతో మొత్తం పరిస్థితి మారిపోయింది. చివరి నిమిషంలో సమావేశం రద్దవడంతో జగన్ హైదరాబాద్ బయల్దేరి వెళ్లారు.

అధికార, విపక్ష ఎంపీల రాజకీయం: నాగిరెడ్డి
శరద్‌పవార్‌తో తమ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి భేటీ రద్దు కావడం వెనుక కాంగ్రెస్, టీడీపీ ఎంపీల రాజకీయం ఉందంటూ ప్రచారం జరుగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం నాయకుడు నాగిరెడ్డి ఆరోపించారు. వీరు ఢిల్లీలో వ్యవహరిస్తున్న తీరువల్లే రాష్ర్ట రైతులను చుట్టుముట్టిన ఇక్కట్లన్నీ తీరటం లేదని ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మండిపడ్డారు.
Share this article :

0 comments: