ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల

Written By ysrcongress on Saturday, December 24, 2011 | 12/24/2011

ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం సాయంత్రం ప్రకటించింది. ఉత్తరాఖండ్, పంజాబ్‌లో వచ్చే ఏడాది జనవరి 30న, మణిపూర్‌లో జనవరి 28న, గోవాలో మార్చి 3న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఈసీ తెలిపింది. ఈ నాలుగు రాష్ట్రాల్లో ఒకే దఫాలో ఎన్నికలు జరపనుంది. 

ఉత్తరప్రదేశ్‌లో ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించనుంది. మొదటి విడత ఎన్నికలు ఫిబ్రవరి 4న ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 8, 11, 15, 19, 23, 28 తేదీల్లో మిగతా విడత ఎన్నికలుంటాయి. మార్చి 4న కౌంటింగ్ నిర్వహించనున్నట్టు ఈసీ తెలిపింది. ఐదు రాష్ట్రాల్లోనూ ఈవీఎంలతోనే ఎన్నికలు నిర్వహించనున్నట్టు ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్‌వై ఖురేషి తెలిపారు. నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని చెప్పారు.
Share this article :

0 comments: