ఆత్మహత్యలకు ప్రేరేపించవద్దు: విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆత్మహత్యలకు ప్రేరేపించవద్దు: విజయమ్మ

ఆత్మహత్యలకు ప్రేరేపించవద్దు: విజయమ్మ

Written By news on Monday, December 19, 2011 | 12/19/2011

పులివెందుల ప్రాంత రైతులను ఆత్మహత్యలు చేసుకునేలా ప్రోత్సహించవద్దని నీటిపారుదల శాఖ అధికారులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, ఎమ్మెల్యే విజయమ్మ కోరారు. చిత్రావతి రిజర్వాయర్‌ను ఆమె రైతులతో కలిసి సందర్శించారు. నీటి లభ్యతకు సంబంధించిన వివరాలను ప్రాజెక్ట్‌ ఎస్‌ఈ, డీఈని అడిగి తెలుసుకున్నారు. రైతుల సమస్యలను ఆమె అధికారులకు వివరించారు. చిత్రావతి రిజర్వాయర్‌కు తుంగభద్ర హై లెవల్‌ కెనాల్ నుంచి న్యాయబద్ధంగా రావాల్సిన సాగు, తాగునీటిని విడుదల చేయాలని ఆమె కోరారు. డ్యాంలో తగినంత నీరు లేనందున ఇబ్బంది అవుతోందని అధికారులు విజయమ్మకు తెలిపారు.

పులివెందుల ప్రాంత ప్రజలకు తాగునీటికి సైతం ఇబ్బంది ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోందని, పంటలన్నీ ఎండిపోయేలా ఉన్నాయని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి బతికి ఉంటే సాగునీటి సమస్య వచ్చి ఉండేది కాదన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని ఆమె విమర్శించారు. ఎన్ని లేఖలు రాసినా స్పందించడంలేదన్నారు.

జనవరి 1వ తేదీ లోపల చిత్రావతికి 0.5 టిఎంసి నీరు ఇవ్వడానికి అధికారులు హామీ ఇచ్చారు. అయితే లిఖితపూర్వక హామీ కోసం ఆమె అనంతపురం బయలుదేరి వెళ్లారు.

30నుంచి పులివెందులకు సాగునీరు: ఎస్ ఇ హామీ
అనంతపురం: ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు చిత్రావతి రిజర్వాయర్ నుంచి పులివెందులకు సాగు నీరు ఇస్తామని ఎస్ ఇ రవి హామీ ఇచ్చారు. ఈ మేరకు లిఖితపూర్వక హామీ పత్రాన్ని ఆయన వైఎస్ అవినాష్ రెడ్డికి అందజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే విజయమ్మ ఈ రోజు చిత్రావతి రిజర్వాయర్‌ను సందర్శించి, సాగునీరు, తాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
Share this article :

0 comments: