ఇద్దరు ప్రతినిధులు వెళ్తున్నప్పటికీ ఒకే అభిప్రాయం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇద్దరు ప్రతినిధులు వెళ్తున్నప్పటికీ ఒకే అభిప్రాయం

ఇద్దరు ప్రతినిధులు వెళ్తున్నప్పటికీ ఒకే అభిప్రాయం

Written By news on Friday, December 28, 2012 | 12/28/2012



 తెలంగాణ అంశంపై కేంద్ర హోంశాఖ నిర్వహించతలపెట్టిన అఖిలపక్ష సమావేశంలో మొట్టమొదటగా కాంగ్రెస్ పార్టీ తన వైఖరి వెల్లడించాల్సిందేనని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అఖిలపక్షం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నందున ప్రధాన పార్టీగా కాంగ్రెస్ తన అభిప్రాయం చెప్పాలన్నారు. తెలంగాణ ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే అని చెబుతున్న కాంగ్రెస్ నేతలు ఆ విషయమేదో అధికారికంగా ప్రకటిస్తే ఈ గొడవే ఉండదన్నారు. శ్రీకృష్ణ కమిటీ చేసిన సిఫారసులపై ఇంతకాలం గడిచినా ఎలాంటి నిర్ణయం ప్రకటించడంలేదంటే వారి చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. హోంమంత్రి షిండే చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే ఆ పదవికి తగిన వ్యక్తిలా క నబడటంలేదని విమర్శించారు. ఒక కేంద్ర మంత్రిగా ఆయన వద్ద సమగ్ర సమాచారం ఉన్నప్పటికీ ఎలాంటి విధాన నిర్ణయం ప్రకటించకపోగా... అవగాహన కోసం రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తున్నట్లు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తమ పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధులు వెళ్తున్నప్పటికీ ఒకే అభిప్రాయం చెప్తామని మైసూరా స్పష్టం చేశారు.

సాక్షి
Share this article :

0 comments: