పార్లమెంట్‌ను సమావేశపర్చాలి: వాసిరెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పార్లమెంట్‌ను సమావేశపర్చాలి: వాసిరెడ్డి

పార్లమెంట్‌ను సమావేశపర్చాలి: వాసిరెడ్డి

Written By news on Saturday, December 29, 2012 | 12/29/2012

దేశ రాజధానిలో సామూహిక అత్యాచారానికి గురైన యువతి నిర్భయ మృతి నేపథ్యంలో మహిళలకు రక్షణ కల్పించే చట్టాల సమీక్షకు తక్షణమే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. శనివారమిక్కడ ఆమె పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 13 రోజులపాటు మృత్యువుతో పోరాడి చనిపోయిన బాధితురాలి కుటుంబానికి తీవ్ర సంతాపాన్ని తెలిపారు. దేశంలో మహిళల రక్షణకు పెనుమార్పులు తేవాల్సిన ఆవశ్యకతను ఈ ఉదంతం చాటిచెబుతోందన్నారు. యువతిపై గ్యాంగ్ రేప్ జరిగిన తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించిన తీరు అత్యంత గర్హనీయమని మండిపడ్డారు.
Share this article :

0 comments: