ఆ విజయం మహానేత చలవే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆ విజయం మహానేత చలవే

ఆ విజయం మహానేత చలవే

Written By news on Friday, December 28, 2012 | 12/28/2012

 ‘నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గానికి ఇటీవల జరిగిన ఉపఎన్నికలలో నేను సాధించిన విజయం నాది కాదు. అది పూర్తిగా మహానేత వైఎస్సార్‌దే. నన్ను చూసి ప్రజలు ఓట్లు వేయలేదు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కుట్రలకు బలైపోయిన వైఎస్సార్ కుమారుడు ఎంపీ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా నిలబడినందుకే వేశారు. 2004లో కేవలం 50 వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన నేను ఈ ఉపఎన్నికలలో రెండున్నర లక్షల మెజార్టీతో గెలవగలిగాను’ అని ఎంపీ మేకపాటి రాజ మోహన్‌రెడ్డి చెప్పారు. ‘కదలిక ఇమామ్’ రాసిన ‘జనం చెక్కిన శిల్పం వైఎస్’ పుస్తకావిష్కరణ సభ గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. 

ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ మహానేత చేసిన అభివృద్ధి పనులు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల హృదయాలలో ఆయనను చిరస్థాయిగా నిలిపాయన్నారు. ‘వైఎస్సార్‌తో ఎందరో లబ్ధి పొందారు. కనీస అర్హత లేని వారు సైతం మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా ఎంపికయ్యారు. ఆయన అకాల మరణం తర్వాత జన హృదయాలలోంచి ఆయనను చెరిపేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. జగన్ ఎప్పటికైనా దేశం గర్వించదగ్గ నాయకుడవుతాడు’ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ సీఈసీ సభ్యురాలు విజయారెడ్డి, రచయిత భూమన్, ఐటీ సెల్ కన్వీనర్ చల్లా మధుసూదన్‌రెడ్డి, నాయకులు శ్రీనివాసులు నాయుడు, నాగిరెడ్డి, శరత్, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు సామాజిక వైద్యుడు కిరణ్‌కుమార్‌రెడ్డి మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు.

రాజ్యాంగేతర శక్తిగా సోనియా...
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ గొప్ప రాజకీయనాయకురాలు కాదు. ప్రజలుకు సేవచేసి ఆమె రాజకీయాల్లోకి రాలేదు. ఆమెకు ఆ అర్హత కూడా లేదు. రాజ్యాంగేతర శక్తిగా మారి దేశరాజకీయాలను తన గుప్పిట్లో పెట్టుకున్నారు. ప్రభుత్వ పరంగా ఆమెకు ఎలాంటి హోదా లేకపోయినా గవర్నర్ న రసింహన్ తరచూ ఆమెను కలుస్తున్నారు. వైఎస్సార్ రెక్కల కష్టం మీద ఏర్పడిన కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు ప్రస్తుతం ఆయన పేరు ఎత్తడానికి కూడా ఇష్టపడటం లేదు. 
- శివరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే

సత్యం నివురు గప్పిన నిప్పు...
సత్యం నివురు గప్పిన నిప్పులాంటిది. అబద్దాలతో దానిని ఎంతో కాలం దాచలేరు. జగన్ బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్న ప్రతిసారీ కాంగ్రెస్ పెద్దలు ఏదో ఒక అబద్ధం చెప్పుతూ ఆయనకు బెయిల్ రాకుండా అడ్డుపడుతున్నారు. ఏ తప్పూ చేయని జగన్‌ను ఎంతోకాలం నిర్భందించలేరు. త్వరలోనే ఆయనను విడుదల చేయక తప్పని పరిస్థితి వస్తుంది. 
- వాసిరెడ్డి పద్మ, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి

మనం కాదు జనమే అండగా ఉన్నారు
జగన్‌మోహన్ రెడ్డికి జనమే అండగా ఉన్నారు. ఆయన తరుపున వారే యుద్ధం చేస్తున్నారు. వైఎస్సార్ నీడ జగన్‌పై ఉన్నంత వరకు ఆయనను ఎవ్వరూ ఏమీ చేయలేరు. 
- గట్టు రామచంద్రారావు, వైఎస్సార్‌సీపీ అధికారప్రతినిధి

నెల జీతగాళ్లను వదలను...
వైఎస్సార్ సీఎంగా ఉన్నపుడు ఆయన వద్ద అనేక మంది పని చేశారు. వీరిలో కొంత మంది నెల జీతగాళ్లూ ఉన్నారు. వైఎస్సార్ పేరును అడ్డంపెట్టుకుని రూ. కోట్లు అక్రమంగా సంపాదించుకున్నారు. మరికొందరు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి పదవులు పొం దారు. ఆయన అకాల మరణం తర్వాత వీరంతా కలిసి మహానేతను నేరస్థుడిగా చిత్రీకరిస్తున్నారు. ఆయన కుమారుడిని జైలు పాలు చేశారు. ఇలాంటివారిని జగన్ క్షమించి వదిలేసినా.. నేను మాత్రం వదలబోను. ఇప్పటికే వైఎస్సార్ బయోగ్రఫీ కూడా రాస్తున్నా. త్వరలోనే అందుబాటులోకి తెస్తా. 
- ఇమామ్, రచయిత
Share this article :

0 comments: