పోలీస్ స్టేషన్ ఎదుట వైఎస్సార్‌సీపీ ధర్నా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పోలీస్ స్టేషన్ ఎదుట వైఎస్సార్‌సీపీ ధర్నా

పోలీస్ స్టేషన్ ఎదుట వైఎస్సార్‌సీపీ ధర్నా

Written By news on Tuesday, February 23, 2016 | 2/23/2016


పోలీస్ స్టేషన్ ఎదుట వైఎస్సార్‌సీపీ ధర్నా
దాడి చేసినవారిపై
 కేసు నమోదు చేయాలని డిమాండ్


తాడిపత్రిరూరల్: ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పోలీసులు దాడి చేయడాన్ని నిరసిస్తూ   వైఎస్సార్‌సీపీ తాడిపత్రి నియోజకవర్గం సమన్వయకర్త వీఆర్ రామిరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు సోమవారం పట్టణ పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నాచేశారు.  కార్యకర్త శంకర్‌పై  ముగ్గురు వ్యక్తులు ఆదివారం రాత్రి దాడిచేసి గాయపరచారు. దీనిపై బాధితుడు శంకర్ మిత్రులు సుధాకర్‌రెడ్డి, రంగస్వామితో కలిసి ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. న్యాయం చేయాల్సిన ఎస్‌ఐ ఫిర్యాదిదారులపైనే దాడి చేయడం అమానుషమని వీఆర్ రామిరెడ్డి అన్నారు. 
పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహారిస్తున్నారని ఆరోపించారు.  కార్యకర్తలపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి, వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. గంటపాటు పోలీస్‌స్టేషన్ ఎదుట  బైఠాయించి నిరసన తెలిపారు.  దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసేంతవరకు ఇక్కడి నుంచి కదిలేదిలేరని భీష్మించారు. దీంతో సీఐ రామక్రిష్ణారెడ్డి వారికి సర్దిచెప్పారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేస్తామన్నారు. అలాగే కౌన్సిలింగ్ కూడా ఇస్తామని హామీ ఇవ్వడంతో వీఆర్ రామిరెడ్డి, పార్టీ యువజన రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భాస్కర్‌రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు బా లరాజు, పట్టణ కన్వీనర్ కంచెంరామ్మోహన్‌రెడ్డి, నియోజవర్గం యువజన అధ్యక్షుడు నాగేశ్వరరెడ్డి, పెద్దపప్పూరు మండల కన్వీనర్ రఘునాథరెడ్డి, సేవదళ్ అధ్యక్షుడు సంపత్, పట్టణ యుత్ కన్వీనర్ ప్రదీప్‌రెడ్డి, తదితర నాయకులు,. కార్యకర్తలు ఆందోళన విరమించారు.
Share this article :

0 comments: