ప్రజాదరణ కోల్పోతున్న టీడీపీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజాదరణ కోల్పోతున్న టీడీపీ

ప్రజాదరణ కోల్పోతున్న టీడీపీ

Written By news on Sunday, February 21, 2016 | 2/21/2016


ప్రజాదరణ కోల్పోతున్న టీడీపీ
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
అంబటి రాంబాబు

పిడుగురాళ్ళ : అవినీతి, అక్రమాలతో టీడీపీ రోజురోజుకూ ప్రజాదరణ కోల్పోతోందని ైవె ఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. పట్టణంలోని ఆర్‌అండ్‌బీ బంగళాలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.  ప్రజాబలంతోనే తమ పార్టీ అధినేత జగన్‌మోహనరెడ్డి వుుఖ్యవుంత్రి అవుతారని ఆయన తెలిపారు. పేద రాష్ట్రం అంటూనే ఎమ్మెల్యేలను కోటాను కోట్లు ఆఫర్లు ఇచ్చి కొనుగోలు చేస్తున్న వుుఖ్యవుంత్రి చంద్రబాబునాయుుడు ప్రజలకు సవూధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని ఆయన డిమాండ్ చేశారు. శాసన సభ్యులను మభ్యపెట్టి దొడ్డిదారిన టీడీపీలోకి ఆహ్వానించడం రాష్ట్ర రాజకీయూల్లోనే హీనవున్నారు. ఫ్యాన్ గుర్తుపై గెలుపొందిన శాసనసభ్యులు వంగా గీత, ఎస్‌పీవై రెడ్డిలను టీడీపీలోకి ఆహ్వానించడం సబబేనా అని అంబటి ప్రశ్నించారు.

చంద్రబాబుపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని, అది కప్పిపుచ్చుకునేందుకు వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహనరెడ్డి పనైపోరుుందని కట్టుకథలు సృష్టిస్తూ మైండ్ గేమ్ ఆడుతున్నారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వస్తే  బీసీల్లోకి చేరుస్తావుని హామీ ఇవ్వబట్టే కాపులు పోరాడుతున్నారని, వుుద్రగడ పద్మనాభం ఆందోళన తర్వాతే కాపులకు రూ.50 కోట్లు కేటారుుంచడం జరిగిందన్నారు. సంవత్సరానికి రూ.1000 కోట్లు ఇస్తానని చెప్పి తీరా చేయుకపోవడం వల్లే కాపుల ఆగ్రహానికి గురయ్యూరని అంబటి వివుర్శించారు.  సవూవేశంలో పిడుగురాళ్ళ జెడ్పీటీసీ సభ్యుడు వీరభద్రుని రామిరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు తాటికొండ చిన ఆంజనేయుులురెడ్డి, కౌన్సిలర్లు షేక్ జైలాబ్దిన్, శ్రీనివాసరెడ్డి, కొమెర వెంకటేశ్వర్లు, పట్టణ, వుండల అధ్యక్షులు చింతా వెంకట రావూరావు, చల్లా పిచ్చిరెడ్డి పాల్గొన్నారు.
Share this article :

0 comments: