16 నుంచి గుంటూరులో మలివిడత ఓదార్పు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 16 నుంచి గుంటూరులో మలివిడత ఓదార్పు

16 నుంచి గుంటూరులో మలివిడత ఓదార్పు

Written By news on Sunday, November 13, 2011 | 11/13/2011

గుంటూరు, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మలి విడత ఓదార్పు యాత్ర ఈనెల 16న రేపల్లె పట్టణం నుంచి ప్రారంభం కానుంది. మొదటివిడత యాత్ర ఈనెల రెండో తేదీన రేపల్లె పట్టణంలో బహిరంగ సభతో ముగిసింది. మళ్ళీ అక్కడి నుంచే యాత్ర ప్రారంభమవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ తెలిపారు. గుంటూరు నగరంలోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఓదార్పు యాత్ర షెడ్యూల్ ప్రకటించారు. తొలుత రేపల్లె పట్టణంలోని వార్డుల్లో జగన్‌మోహన్‌రెడ్డి పర్యటిస్తారని పేర్కొన్నారు. ఈ విడతలో ఏడు నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగుతుందని వివరించారు. 

ఓదార్పు కుటుంబం నుంచి నేరుగా మరో ఓదార్పు కుటుంబానికే వెళతారని, మార్గంమధ్యలో మహానేత వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరిస్తారని తెలిపారు. జిల్లాలో యాత్ర త్వరితగతిన పూర్తయ్యేలా ప్రజలు, పార్టీ శ్రేణులు సహకరించాలని కోరారు. జగన్‌మోహన్‌రెడ్డి తమ గ్రామానికి రావాలని దయచేసి ఎవరూ అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఆయన ఇంకా చాలా నియోజకవర్గాల్లో పర్యటించాల్సి ఉండటంతో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. రెండో విడతలో రేపల్లె, బాపట్ల, ప్రత్తిపాడు, పొన్నూరు, తాడికొండ, పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో పర్యటన కొనసాగేలా షెడ్యూల్‌ను ఖరారు చేశారని తెలిపారు.

పర్యటన ఇలా..
16వ తేదీ ఉదయం రేపల్లె పట్టణంలో యాత్ర ప్రారంభమవుతుంది. అన్ని వార్డుల్లో పర్యటించి అక్కడి నుంచి రేపల్లె మండలంలోని పేటేరు, అరవపల్లి, ఉల్లిపాలెం, నల్లూరివారిపాలెం, పోటుమెరక, వడ్డివారిపాలెం, బొందలగరువు, తుమ్మల, మోళ్ళగుంట తదితర గ్రామాల్లో పర్యటిస్తారు. అక్కడి నుంచి నిజాంపట్నం మండలంలోని ముక్తేశ్వరపురం, తాళ్ళతిప్ప, పాతూరు, కొత్తపాలెం, నక్షత్రనగర్, సంజీవనగర్, అడవులదీవి, కూచినపూడి, పుల్లమెరక, యడ్లపాలెం, ముత్తుపల్లి, నగరం, గాలివారిపాలెం, బోరమాదిగపల్లి, బెల్లంవారిపాలెం, ఏలేటిపాలెం, వెనిగండ్లవారిపాలెం, ధూళిపూడి, జిల్లేపల్లి, పెదవరం, తాళ్ళావారిపాలెం, కనగాల, గూడవల్లి, నడింపల్లి, పొన్నపల్లి, చెరుకుపల్లితో రేపల్లె నియోజకవర్గంలో యాత్ర పూర్తవుతుంది. అనంతరం బాపట్ల నియోజవకర్గ పరిధిలోని పిట్టలవానిపాలెంలోకి యాత్ర ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి కర్లపాలెం, బాపట్ల పట్టణం, బాపట్ల రూరల్‌తో నియోజకవర్గంలో యాత్ర ముగుస్తుంది. ఆ తర్వాత ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కాకుమాను, పెదనందిపాడు మండలాల్లో యాత్ర జరుగుతుంది. పొన్నూరు నియోజకవర్గ పరిధిలోని పొన్నూరు పట్టణం, రూరల్, చేబ్రోలు జగన్ పర్యటిస్తారు. అనంతరం మళ్లీ ప్రత్తిపాడు నియోజకవర్గంలోని వట్టిచెరుకూరు, ప్రత్తిపాడు, గుంటూరు రూరల్ మండలాల్లో యాత్ర జరుగుతుంది.
ఆ తర్వాత పొన్నూరు నియోజకవర్గంలోని పెదకాకానిలో ఓదార్పు కొనసాగుతుంది. అక్కడి నుంచి తాడికొండ నియోజకవర్గంలోకి యాత్ర ప్రవేశిస్తుంది. తుళ్ళూరు, తాడికొండ మండలాల్లో యాత్ర సాగుతుంది. అనంతరం పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఈ మేరకు పార్టీ నేతలతో చర్చించి షెడ్యూల్‌ను ఖరారు చేసినట్టు కన్వీనర్ రాజశేఖర్ తెలిపారు. విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు చిట్టా విజయభాస్కరరెడ్డి, కట్టా సాంబయ్య, నసీర్ అహ్మద్, మందపాటి శేషగిరిరావు, మేరుగ విజయలక్ష్మి, జంగా ప్రభాకరరెడ్డి, ఎం.డి.ఉస్మాన్, మౌలాలి, సాంబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: