కాకినాడ పోర్టును కాజేశారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాకినాడ పోర్టును కాజేశారు

కాకినాడ పోర్టును కాజేశారు

Written By news on Friday, November 18, 2011 | 11/18/2011

‘‘కాకినాడ సీ పోర్టును ప్రయివేటీకరించటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్లోబల్ కాంపిటీటివ్ బిడ్లను ఆహ్వానించింది. ఈ బిడ్లను కేంద్ర ప్రభుత్వ సంస్థ రైట్స్ పరిశీలించి కొన్ని సూచనలు చేసింది. కానీ.. ఈ పోర్టును నాటి మలేసియా ప్రధాని మహతిర్ మహమ్మద్ తనయుడు మిర్జాన్ బిన్ మహతిర్ నేతృత్వంలోని కన్సార్షియానికి అప్పగించటానికి.. రైట్స్ సూచనలకు కూడా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీళ్లొదిలారు. 

రైట్స్ నివేదికలో అసలు మహతిర్ కన్సార్షియం ఊసే లేకపోవటంతో.. ఆ నివేదికను పూర్తిగా మార్చివేశారు. టీడీపీ మాజీ మంత్రి పద్మావతి కుమారుడు కూడా భాగస్వామిగా ఉన్న ఈ కన్సార్షియానికే పోర్టును అప్పగించారు. ప్రయివేటు డెవలపర్లకు ప్రయోజనం చేకూర్చేలా కాంట్రాక్టు నియమ నిబంధనలను పలుమార్లు మార్చారు. ఫలితంగా ప్రభుత్వానికి తీవ్ర నష్టం వాటిల్లింది. కాంట్రాక్టు ప్రకారం కన్సార్షియం ప్రతి ఏటా మినిమం గ్యారంటీ అమౌంట్ (కనీస మొత్తం) చెల్లించాల్సి ఉంది. మహతిర్ కన్సార్షియం తొలి రోజు నుంచీ లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ ఆ మొత్తాన్ని చెల్లించలేదు. దీనిని ‘కాగ్’ తప్పుపట్టినా చంద్రబాబు పట్టించుకోలేదు. ఈ వ్యవహారంలో ఎన్నో మారిషస్ కంపెనీలు కీలకపాత్ర పోషిం చాయి. తప్పుడు సమాచారమిచ్చిన ‘ఎవర్‌లింక్ ఏసియా ఇన్వెస్ట్‌మెంట్స్’ వంటి కంపెనీల షేర్లు ఆ తరవాత ఎల్ అండ్ టీ చేతిలోకి వచ్చేశాయి. దీని అసలు లబ్ధిదారు చంద్రబాబే. అసలు పోర్టు రంగంతో ఏమాత్రం సంబంధం లేని బోళ్ల బుల్లిరామయ్యకు చెందిన ‘సౌతిండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కంపెనీ’కి వాటాలు కేటాయించారు. బుల్లిరామయ్య 1999-2004 మధ్య ఏలూరు నుంచి టీడీపీ ఎంపీగా ఉన్నారు. అంతేకాదు.. ఆయన చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ ఫుడ్స్ ఇండియా లిమిటెడ్ వ్యవస్థాపక సభ్యుడు కూడా. ప్రస్తుతం కాకినాడ సీపోర్ట్స్‌కు సారథ్యం వహిస్తున్న కర్నాటి వెంకటేశ్వరరావు కూడా బాబు వివాదాస్పద లావాదేవీలకు ప్రతినిధే. సింగపూర్, మలేసియా, మారిషస్‌లలో వివిధ పేర్లతో నెలకొల్పిన కంపెనీల్లో చంద్రబాబు ప్రయోజనాలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు.
Share this article :

0 comments: