మేమంతా జగన్ వైపే: ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మేమంతా జగన్ వైపే: ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి

మేమంతా జగన్ వైపే: ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి

Written By news on Thursday, November 17, 2011 | 11/17/2011

రాజీనామాలు విషయమై స్పీకర్ నుంచి తమకు ఎలాంటి పిలుపు అందలేదని అనంతపురం ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి తెలిపారు. జగన్ వర్గ
ఎమ్మెల్యేలంతా జగన్ వైపేనని ఆయన స్పష్టం చేశారు. జగన్ వర్గ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు తామంటే గిట్టని
మీడియా సృష్టేనని గుర్నాథరెడ్డి అన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన ముగ్గురు కాంగ్రెసు శాసనసభ్యులు గురువారం శానససభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలిశారు. పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఉదయం పూట స్పీకర్‌ను కలవగా, శివప్రసాద్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి సాయంత్రం కలిశారు. వారు స్పీకర్‌తో ఏం మాట్లాడారనే విషయం తెలియదు. వారెవరు కూడా మీడియాతో మాట్లాడలేదు. తన వద్ద పెండింగులో రాజీనామాలను పరిష్కరించే పనిలో స్పీకర్ పడ్డారు. డిసెంబర్ 1వ తేదీన శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యేలోగా వాటిని పరిష్కరించాలని ఆయన అనుకుంటున్నారు. ఈ స్థితిలో వారు ముగ్గురు స్పీకర్‌ను కలిశారు.

మోళ్లగుంట చేరుకున్న ఓదార్పు యాత్ర


గుంటూరు : గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్ర విశేష ప్రజాదరణ మధ్య గురువారం మధ్యాహ్నం మోళ్లగుంటకు చేరుకుంది. ఈరోజు ఉదయం ఆయన తన యాత్రను రేపల్లె నుంచి ప్రారంభించారు. తమ్మలలోని రామాలయంలో వైఎస్ జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం గ్రామస్తులు ఏర్పాటు చేసిన మహానేత వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ తో తమ పొలాలకు సాగునీరు అందటం లేదని రైతులు తమ గోడు చెప్పుకున్నారు. తాళ్ళతిప్పలో దండుప్రోలు రమేష్ కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు.

ప్రజల హృదయాల్లో మహానేత: జగన్


అడవులదీవి: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిని ప్రజలు ప్రతి క్షణం స్మరించుకుంటూనే ఉన్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లాలో కొనసాగుతున్న మలి విడుత ఓదార్పుయాత్రలో భాగంగా జగన్ అడవులదీవి గ్రామానికి చేరుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన పథకాలు ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయాయని జగన్ అన్నారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, వృద్దాప్య ఫించన్ లాంటి పథకాలు పేద ప్రజలకు అండగా నిలిచాయన్నారు.
Share this article :

0 comments: