జగనన్నకు నీరా‘జనం’ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగనన్నకు నీరా‘జనం’

జగనన్నకు నీరా‘జనం’

Written By news on Saturday, November 19, 2011 | 11/19/2011

గుంటూరుసెంట్రల్, న్యూస్‌లైన్ : ఓదార్పుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే చూసి ఓర్వలేక ఎల్లో మీడియాలో అసత్య కథనాలు ప్రచురించి, ప్రసారం చేస్తున్నారని వైఎస్సార్‌కాంగ్రెస్ కృష్ణాజిల్లా నాయకుడు శీలం రాజా విమర్శించారు. అరండల్‌పేటలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వైఎస్ జగన్‌మోహనరెడ్డిపై ఈనాడు, ఆంధ్రజ్యోతి అసత్యకథనాలు ప్రచురించడాన్ని నిరసిస్తూ పోస్టర్లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా శీలం రాజా మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహనరెడ్డిని గుంటూరు జిల్లా ఓదార్పుయాత్రలో ప్రజలు అపూర్వంగా ఆదరిస్తున్నారని చెప్పారు.

వైఎస్సార్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం నాయకుడు దర్శనపు శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్‌జగన్‌మోహనరెడ్డి, వైఎస్ విజయమ్మలను కించపరిచే విధంగా కొన్ని పత్రికల్లో కథనాలు వెలువడడాన్ని తీవ్రంగా ఖండించారు. వైఎస్ జగన్ ఓదార్పుయాత్రకు విద్యార్థులంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో విద్యార్థులు పానుగంటి చైతన్య, ఈశ్వరరెడ్డి, నరేంద్ర, తియ్యగూర వంశీ, అజయ్, దర్శనపు అశోక్, చంద్ర తదితరులు పాల్గొన్నారు. 






జగనన్నకు నీరా‘జనం’


 
కర్లపాలెం, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ఓదార్పుయాత్రకు గ్రామగ్రామాన జనం నీరాజనం పడుతున్నారని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం చెప్పారు. శుక్రవారం స్థానిక ఆర్యవైశ్య కల్యాణమండపంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. రఘురాం మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలు అమలు కావాలంటే జగనన్న ప్ర భుత్వం అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం వైఎస్సార్ పథకాలకు తూట్లు పొడిచిందని విమర్శించారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించకపోవడం, ప్రాజెక్టుల నిర్మాణం ఆగిపోవడం, ఇందిరమ్మ గృహాలకు కోత పెట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఇచ్చిన మాట ప్రకారం జగన్ ఓదార్పుయాత్ర నిర్వహిస్తున్నారని తెలిపారు.

అధికార, ప్రతిపక్షపార్టీలతో పాటు ఎల్లోమీడియా, సీబీఐ అధికారులు వేధింపులకు గురిచేస్తున్నా లెక్కచేయకుండా ఓదార్పు కుటుంబాలకు అం డగా నిలుస్తానంటూ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ స్తుందని స్పష్టం చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఎం.శివరామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే), యు.ఎస్.రామిరెడ్డి, మోదుగుల బసవపున్నారెడ్డి, సలగల రాజశేఖర్‌బాబు, దొంతిరెడ్డి జగదీష్‌కుమార్‌రెడ్డి, నాగేశ్వరరెడ్డి, జి.శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: