అది కల్పిత కథనం - డెక్కన్ క్రానికల్‌లో వచ్చిన జగన్ బెదిరింపు వార్తను ఖండించిన వై.సతీశ్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అది కల్పిత కథనం - డెక్కన్ క్రానికల్‌లో వచ్చిన జగన్ బెదిరింపు వార్తను ఖండించిన వై.సతీశ్

అది కల్పిత కథనం - డెక్కన్ క్రానికల్‌లో వచ్చిన జగన్ బెదిరింపు వార్తను ఖండించిన వై.సతీశ్

Written By news on Monday, November 14, 2011 | 11/14/2011

* అసత్యమని, స్వార్థ ప్రయోజనాల కోసమే రాశారని స్పష్టీకరణ
* బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ పత్రికకు లీగల్ నోటీసు
* లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తనను రివాల్వర్‌తో బెదిరించారంటూ ఆంగ్ల దినపత్రిక ‘డెక్కన్ క్రానికల్’లో వచ్చిన వార్తను ‘మహాబళేశ్వరప్ప అండ్ సన్స్’ మైనింగ్ కంపెనీ మేనేజింగ్ పార్ట్‌నర్ వై.సతీశ్ ఖండించారు. ఈ మేరకు ఆయన తరపు న్యాయవాది వేములపాటి పట్టాభి ఆదివారం డెక్కన్ క్రానికల్(డీసీ) యాజమాన్యానికి, సీబీఐకి లీగల్ నోటీసులు పంపించారు. 

తాము మైనింగ్ చేస్తున్న గనులు ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి పక్కనే ఉన్నాయని, ఈ నేపథ్యంలో వాటిని గాలి జనార్దనరెడ్డికి కట్టబెట్టేందుకే జగన్ తనను బెదిరించారంటూ సతీశ్ సీబీఐకు వాంగ్మూలమిచ్చినట్లు ఆ పత్రిక ఆదివారం మొదటి పేజీలో ఓ కథనం ప్రచురించింది. సీబీఐ వర్గాలే తమకు ఈ విషయం చెప్పినట్లు పేర్కొంది. ఈ వార్త పూర్తిగా అసత్యమని, దురుద్దేశపూర్వకమైందని, స్వార్థప్రయోజనాలు ఆశించి రాశారని సతీశ్ న్యాయవాది పంపిన లీగల్ నోటీస్‌లో పేర్కొన్నారు. అందులోని ముఖ్యాంశాలు ఇవీ..

* డీసీలో వచ్చిన తప్పుడు వార్తను చూసి నా క్లయింట్ సతీశ్ దిగ్భ్రాంతి చెందారు. నిరాధారమైన, అసత్య అంశాలతో కథలల్లినట్లుగా వార్త రాశారు. ఆ వార్తను పూర్తిగా ఖండిస్తున్నాం. 

* నా క్లయింట్‌ను సీబీఐ విచారించింది. సీబీఐ అధికారులు అడిగిన ప్రశ్నలకు సతీశ్ సమాధానం ఇచ్చారు. అవన్నీ రికార్డుల్లో ఉన్నాయి. ఎవరైనా చూసుకోవచ్చు. తన వ్యాపార కార్యకలాపాల్లో జగన్ ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని నా క్లయింట్ స్పష్టంచేశారు. ఆయన తనను బెదిరించారంటూ వచ్చిన ఆ వార్త అసత్యమని తెలిపారు.

* తన క్లయింట్‌కు సమాజంలో ఉన్న ప్రతిష్ట, విశ్వసనీయతను దెబ్బతీయడానికి ఉద్దేశపూర్వకంగా అసత్య వార్తా కథనాన్ని ప్రచురించారు. దీని వల్ల.. నా క్లయింట్‌కు బంధువులు, స్నేహితులు, పరిచయస్తుల నుంచి పెద్ద సంఖ్యలో ఫోన్‌కాల్స్ వస్తున్నాయి. ఇది ఆయనకు ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ.. ఆ వార్త అసత్యమని, అందులోని అంశాలన్నీ అబద్ధాలని ఆయన వారికి వివరిస్తున్నారు.

* ఆ అసత్య వార్తకు నా క్లయింట్ సతీశ్ ఖండనను సోమవారం నాటి డీసీ పత్రిక తొలి పేజీలో, ఇంటర్నెట్ ఎడిషన్‌లో ప్రముఖంగా, బాక్సు కట్టి ప్రచురించడంతోపాటు పత్రిక బహిరంగ క్షమాపణలు చెప్పాలి. ఇలా చేయని పక్షంలో నా క్లయింట్ మీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

* హైకోర్టు ఆదేశాల మేరకు జరుగుతున్న దర్యాప్తు మీద ప్రతికూల ప్రభావం చూపించే విధింగా తప్పుడు వార్తలు ప్రచురించడం కోర్టు ధిక్కార నేరం అవుతుంది. అందువల్ల.. తప్పుడు కథనాలు ప్రచురిస్తున్న, ప్రసారం చేస్తున్న మీడియా సంస్థల మీద సీబీఐ తగిన చర్యలు తీసుకోవాలి. తప్పుడు కథనాలను ఆపడానికి కోర్టు నుంచి తగిన ఆదేశాలు తీసుకురావాల్సిన బాధ్యత సీబీఐ మీద ఉంది.
Share this article :

0 comments: