రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవటమన్నది ఒబామా... ఒసామా కలిశారన్నట్టు చిత్రించాల్సిన అంశం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవటమన్నది ఒబామా... ఒసామా కలిశారన్నట్టు చిత్రించాల్సిన అంశం

రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవటమన్నది ఒబామా... ఒసామా కలిశారన్నట్టు చిత్రించాల్సిన అంశం

Written By news on Friday, November 18, 2011 | 11/18/2011

అధికార పక్ష వైఫల్యాలు... విపక్షం చేతగానితనం ఇవి కాదు రామోజీ మార్కు జర్నలిజం...
మహానేత వైఎస్ మీద... మరణించి రెండేళ్లయినా అదే విష విద్వేషం...
సీబీఐ చెప్పిదంటూ నెలలుగా అవే రాతలు... 
చంద్రబాబు, ఆయన బినామీల ఆస్తులపై రాష్ట్ర హైకోర్టు సీబీఐ, ఈడీ, డీజీపీ, హోం సెక్రటరీ విచారణలకు ఆదేశించిన నేపథ్యంలో... బోనులో రామోజీ...
పాఠకుల దృష్టిని మరల్చటానికి పాత పద్ధతుల్లో రాత పరమైన కుట్రలు...
చంద్రబాబు భూ కేటాయింపులే కుంభకోణమనుకుంటే, వాటినీ వైఎస్ మీదకు నెట్టడానికి ఈనాడు యత్నాలు...
75 ఏళ్ల రామోజీరావుకు ఏనాడూ గుర్తుకురాని బాబు అవినీతి బాగోతాలు...
అధికారంలో ఉండగా రూ. 5లక్షలు ప్రభుత్వ వాటా పెంచాలన్న సంస్థల నుంచి పెట్టుబడులు ఉపసంహరించిన చంద్రబాబు...
మరోవంక తనకు సన్నిహితమైన దుబాయ్ కంపెనీ ఈమార్‌కు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో 535 ఎకరాల భూములు ఇచ్చినదీ చంద్రబాబే...
అందులో భాగంగా లాభాలు వచ్చే విల్లాలూ... కమర్షియల్ కాంప్లెక్స్‌ల ప్రాజెక్టులో ఈమార్‌కు 74శాతాన్ని ఈ మేరకు కట్టబెట్టిన చంద్రబాబు...
ఈమార్‌లో లాభాల ప్రాజెక్టుకు సంబంధించి ఏపీఐఐసీ వాటాను బాబు 26 శాతంగా నిర్ణయించడమే అతిపెద్ద కుంభకోణం...
మరోవంక ఎక్కువ ఖర్చు ప్రాజెక్టులో ఏపీఐఐసీకి భారీగా 49శాతం వాటా ఇచ్చిందీ బాబే...
వైఎస్ అధికారంలోకి వచ్చాక బాబు అక్రమాలపై రోశయ్య కమిటీ సమీక్ష...
ఖర్చు తడిసి మోపెడయ్యే ప్రాజెక్టుల్లో ప్రభుత్వ వాటా 26 శాతానికి తగ్గింపు...
నాటి నిర్ణయాన్ని అవినీతిగా చిత్రించేందుకు ఇప్పుడు ఈనాడు ఆపసోపాలు...

ఇండియా-వెస్టిండీస్ క్రికెట్ మ్యాచ్ ప్రసార హక్కులు నియోస్పోర్ట్స్ సంస్థకు దక్కాయి. ఇవి ఎక్స్‌క్లూజివ్ హక్కులు. అంటే, అందరికంటే భారీగా చెల్లించి దక్కించుకున్నందువల్ల ఆ సంస్థకు మాత్రమే క్రికెట్ మ్యాచుల్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు హక్కులు లభించాయి. ఈ రాష్ట్రంలో కొన్ని వార్తా సంస్థలకు సీబీఐ కూడా అలాంటి హక్కుల్ని కట్టబెట్టిందా అన్న అనుమానాలు నాలుగు నెలలకు పైగా ఆ దర్యాప్తు సంస్థ పేరిట ప్రసారమవుతున్న వార్తా కథ(నా)లు చూస్తే వచ్చి తీరుతుంది. చంద్రబాబు నాయుడి అధికార దుర్వినియోగం, అక్రమ ఆస్తులకు సంబంధించి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సీబీఐ, ఈడీ, పోలీసు శాఖల దర్యాప్తునకు ఆదేశించిన వార్త ప్రచురించిన రోజునే, అదే సీబీఐ ఈ కేసులో విచారణను ఎదుర్కోవాల్సి ఉన్న రామోజీరావు పత్రికకు పిలిచి ప్రత్యేక సమాచారం ఇచ్చిందన్నది మొన్నటి ఈనాడులో మొదటి పేజీ కథనం అందిస్తున్న సంకేతం.

అదెలాగో చూడండి... ఈమార్(దీన్నే ఎమ్మార్‌గా కూడా వ్యవహరిస్తున్నారు) సంస్థకు అప్పగించిన కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంలో ఏపీఐఐసీ వాటా తగ్గిపోవటానికి ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన సలహాదారు కేవీపీ రామచంద్రరావులు బాధ్యులన్నది ఆ కథనం ద్వారా ‘ఈనాడు’ తన పాఠకులకు చెప్పదలచుకున్న సారాంశం. ఈమార్ ఛైర్మన్‌తో వైఎస్, కేవీపీ మంతనాల తరవాతే 2005లో ఈ నిర్ణయం వెలువడిందన్నది... ఆ తరవాతే ఆ ప్రాజెక్టులో ఏపీఐఐసీ వాటా 49 నుంచి 26 శాతానికి తగ్గిందన్నది ఆ కథనం. ఇక్కడ ఈనాడు ఉద్దేశాల గురించి కొత్తగా చర్చించాల్సినది ఏమీ లేదు. 

ఈమార్ సంస్థకు ఒకప్పుడు సీఈవోగా వ్యవహరించిన ఏజే జగన్నాథన్ వాంగ్మూలం ఇది అంటూ ఈనాడు తన మూసలో పోసి దాన్ని ముద్రించింది. ‘‘ఆ భేటీతోనే వాటా తగ్గింది’’ అంటూ మొన్నటి సంచికలో ఈనాడు ప్రచురించిన ఈ వార్తా కథనం లక్ష్యాల్లో మొదటిది చంద్రబాబునాయుడుమీద రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ప్రజల దృష్టికి వెళ్ళకుండా చూడటం. రెండోది-వైఎస్ రాజశే ఖరరెడ్డిని అవినీతిపరుడిగా చిత్రించే ఏ అవకాశాన్నీ ఆయన చనిపోయిన రెండేళ్ళ తరవాత కూడా జారవిడుచుకొనకపోవటం. మూడోది-స్వయంగా తనమీదా సీబీఐ, ఈడీ, రాష్ట్ర డీజీపీల దర్యాప్తు జరుగుతుందన్న అంశాన్ని తన పాఠకుల కళ్ళలో పడకుండా నివారించటం. నాలుగోది-ఈమార్ ప్రాజెక్టుకు సంబంధించిన అసలు నిజాలు, మౌలిక అంశాలు తన పాఠకులకు కనిపించకుండా ముసుగులు కప్పటం. ఇలాంటి పనుల కోసం రామోజీ పెట్టుకుని, గడచిన మూడున్నర దశాబ్దాలుగా నడుపుతున్న పత్రిక పేరే ‘ఈనాడు’.

ఈమార్‌కు సంబంధించిన మౌలికాంశాలలోకి వెళ్ళేముందు ఏ పాఠకుడికి అయినా వచ్చే అనుమానం... ఇంతకూ ఓ పారిశ్రామిక సంస్థ ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవటమన్నది ఒబామా... ఒసామా కలిశారన్నట్టు చిత్రించాల్సిన అంశం కాదే అన్నది. అలా చెప్పదలచుకుంటే దొంగ నోట్ల రామకృష్ణగౌడ్, యూరో లాటరీ కోలా కృష్ణమోహన్ సహా చంద్రబాబు ఎలాంటి మనుషుల్ని ఎప్పుడు కలిసేవారో కూడా ప్రజల మెమరీ చిప్‌లలో చెరిపివేయటానికి వీల్లేని విధంగా నిక్షిప్తమై ఉంది. పారిశ్రామికవేత్తలు తమకు ఫలానా ఆమోదాలో అనుమతులో కావాలని కోరటానికి ముఖ్యమంత్రిని కలుసుకోవటం అసాధారణమూ కాదు, అభ్యంతరకరం అంతకన్నా కాదు. ఇక్కడ మౌలికమైన వాస్తవం ఏమిటంటే, రామోజీ మాదిరిగా పారిశ్రామికవేత్తలంతా ఉప ప్రధాని... రక్షణ మంత్రి, ముఖ్యమంత్రి ఇలా అందరూ తమ ఇంటికే వచ్చి వాలాలనుకునే మనస్తత్వం ఉన్నవారుగానీ, అలా వారు రానట్లయితే బ్లాక్‌మెయిల్ చేయగల సమర్థులుగానీ కాకపోవచ్చు. ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్‌ను ఈమార్ సంస్థ ప్రతినిధులు కలుసుకున్న నేపథ్యంలోనే, ఆ సంస్థ నిర్మించాల్సిన కన్వెన్షన్ సెంటర్‌కు చెందిన ఒప్పందంలో ఏపీఐఐసీ వాటా తగ్గిందని చెప్పేందుకు తహతహలాడిన 75 ఏళ్ళ రామోజీ, ఈ సమయంలోనే మరి కొన్ని వాస్తవాలను మరిచిపోయారు. 

ఈమారైనా నిజాలు చెప్పండి!

అందులో మొదటిది- ఈమార్ సంస్థకు ఆంధ్రప్రదేశ్‌లో మారుపేరైన కోనేరు ప్రసాద్‌ను బడా పారిశ్రామికవేత్తగా మార్చినది సాక్షాత్తు చంద్రబాబు నాయుడే. ఈమార్ సంస్థకు రాష్ట్ర రాజధానిలో ఏకంగా 535 ఎకరాలు కేటాయించినది కూడా నారా చంద్రుడే. బాబు కోడలు సహా అనేకమందికి విల్లాల స్థలాన్ని పప్పు బెల్లాల్లా పంచిపెట్టారంటున్న కుంభకోణం జరిగినది ఈమార్ ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు 74 శాతం హక్కులతో కేటాయించిన భూముల్లోనే. అందుకు భిన్నంగా నాటికి ఏపీఐఐసీకి 49 శాతం వాటా ఉన్న కన్వెన్షన్ సెంటర్‌కు చెందిన ఒప్పందంలో ప్రభుత్వ వాటా వైఎస్ ముఖ్యమంత్రి అయిన తరవాత తగ్గిపోవటంలో ఏదన్నా కుంభకోణం ఉందా లేదా అన్న అంశాన్ని పరిశీలించటానికి ముందు.... ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో చంద్రబాబు నాయుడు ఈమార్‌కు భూ కేటాయింపులు చేసిన వైనాన్ని పరిశీలిద్దాం...

ఇదీ బాబు కుదుర్చుకున్న ఒప్పందం...

హైదరాబాద్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో పద్దెనిమిది రంధ్రాలున్న గోల్ఫ్ కోర్స్, దాని చుట్టూ నివాసానికి వీలయిన విల్లాలు, ఫైవ్ స్టార్ హోటళ్ళు, బిజినెస్ హోటల్, కన్వెన్షన్ సెంటర్ వంటివి సర్కారీ భాగస్వామ్యంలో ప్రైవేటు సొత్తుగా నిర్మాణం కావాలని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న 2000లో అనుకున్నారు. అనుకున్నదే తడవు... ఎవరెవరికి ఇలాంటి నిర్మాణం చేయటం ఆసక్తి ఉందంటూ ఆహ్వానాలు పలికారు. అయిదు కంపెనీలు రెడీ అన్నాయి. దుబాయ్‌కి చెందిన ఈమార్, మలేసియాకు చెందిన ఐఓఐ, చెన్నైలో రిజిస్టరయిన ఎల్ అండ్ టీ, ముంబాయికి చెందిన షాపూర్‌జీ పల్లోంజీ, హాంకాంగ్‌కు చెందిన సోమ్ ఆసియా సంస్థలు మాకు ఆసక్తి ఉంది అంటూ 2001 జూలై నుంచి సెప్టెంబరులోపు ప్రభుత్వానికి వెల్లడించాయి. వాటిలో, మొదటి మూడు సంస్థల్ని బాబు ప్రభుత్వం ‘షార్ట్ లిస్ట్’ చేసింది. కోనేరు ప్రసాద్ ఉన్న దుబాయ్ సంస్థకు ఏపీఐఐసీ ద్వారా 2002 సెప్టెంబరులో ఆ 535 ఎకరాలను అప్పగిస్తూ ఉత్తర్వు(జీవో ఎంఎస్ నంబర్ 359) జారీ చేసింది. ఈ ఉత్తర్వు ప్రకారం ... ప్రాజెక్టు పూర్తి చేయటానికి రెండు ప్రత్యేక సంస్థలు(ఎస్.పి.వి.లు) ఏర్పాటు చేశారు. అందులో మొదటి ఎస్‌పీవీ పరిధిలో గోల్ఫ్‌కోర్స్, క్లబ్, విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు ఉంటాయి. ఈ ప్రాజెక్టులో చంద్రబాబు ఒప్పందం ప్రకారమే ఏపీఐఐసీ వాటా 26 శాతం. రెండో ఎస్‌పీవీ పరిధిలో కన్వెన్షన్ సెంటర్, స్టార్ హోటల్ ఉంటాయి. ఇందులో ఏపీఐఐసీ వాటా 49, ఎమ్మార్ వాటా 51. 

ఖరీదైన రియల్టీ ప్రాజెక్టులో 26 శాతం వాటాయేనా?

గమనించాల్సిన కీలక అంశాలు ఇక్కడే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(ఏపీఐఐసీ) లిమిటెడ్ అన్నది 1973లోనే ఏర్పాటయినా అది చంద్రబాబు జమానా ప్రారంభమయ్యే వరకు పోషించిన పాత్ర వేరు. పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్(పీపీపీ)లూ, గవర్నమెంట్ టూ గవర్నమెంట్(జీ టూ జీ) ఒప్పందాలు ప్రారంభమైనది చంద్రబాబు ఆధ్వర్యంలోనే. ప్రభుత్వ రంగం అనేదే వ్యర్థమని, దానిమీద పగబట్టి... ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా బయటకు పంపేసినది... రాష్ట్రంలో ప్రభుత్వరంగ సంస్థలను సంత సరకులుగా అమ్మకానికి పెట్టినది కూడా చంద్రబాబు హయాంలోనే. ఆ కార్యక్రమాలన్నింటి వెనకా ఓ నేరపూరితమైన కుట్ర దాగి ఉందని పాలేరు సుగర్స్‌ను నామా నాగేశ్వరరావుకు, గురజాలలోని నాగార్జున కో ఆపరేటివ్ సుగర్ మిల్స్‌ను నూజివీడు సీడ్స్‌కు, నెల్లూరు స్పిన్నింగ్ మిల్లును సీఎం రమేశ్‌కు, రిపబ్లిక్ ఫోర్జ్ భూములు దేవేందర్ గౌడ్‌కు అప్పగించటాన్ని గమనిస్తే అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కేవలం ఫెసిలిటేటర్ పాత్రకు పరిమితం కావాలంటూ చంద్రబాబు భారీ ఉపన్యాసాలను అంతర్జాతీయ వేదికలమీదనుంచి ఇస్తూ వచ్చారు. ఈ పరిస్థితుల్లోనే ఏపీఐఐసీ పాత్ర పెట్టుబడిదారుగా కాక, ప్రాజెక్టును అమలు చేసే క్రమంలో పర్యవేక్షణకు మారింది. కాబట్టే ఏపీఐఐసీ వాటా ఏ ప్రాజెక్టును తీసుకున్నా తక్కువే ఉంటుంది. చంద్రబాబు హయాంలో కుదిరిన ఈమార్ ఒప్పందం చెప్పేది అదే. జాగ్రత్తగా చూస్తే... విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్సుల నిర్మాణం, రియల్ ఎస్టేట్ అమ్మకాల ద్వారా భారీ రాబడికి అవకాశం ఉన్న మొదటి ఎస్‌పీవీలో ఏపీఐఐసీకి చంద్రబాబు కేవలం 26 శాతం వాటా చాలునంటూ సరిపెట్టారు. దీన్ని అప్పట్లోనే ప్రతిపక్షం నిలదీసింది. రియల్ ఎస్టేట్ వెంచర్లలో భూమి సొంతదారు... డెవలపర్‌ల వాటా కనీసంగా 40-60 ఉంటున్న దశలో ఈ 26 శాతం మతలబు ఏమిటన్న ప్రశ్నకు చంద్రబాబు ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వలేదు. నేరుగా ఏపీఐఐసీ వాటాను మరీ నీచంగా 26 శాతం నిర్ణయించటం అంటే ప్రభుత్వ భూమిని దుబాయ్ సంస్థకు కట్టబెట్టి వేల కోట్లు ముడుపులు కట్టుకోవటమేనని ‘ఈనాడు’ లాంటి పత్రికలు నోరెత్తనే లేదు. కాబట్టే నాడు ‘వాటా’లు సరిపోయినట్టు కనిపించాయి.

ఖర్చయ్యే కన్వెన్షన్ సెంటర్‌లో మాత్రం 49 శాతం వాటా!

చంద్రబాబు ప్రభుత్వం కన్వెన్షన్ సెంటర్, హోటల్ నిర్మించాలన్న రెండో ఎస్‌పీవీలో 49 శాతం ఏపీఐఐసీ వాటాగా నిర్ణయించి 51 శాతాన్ని ఈమార్ వాటాగా పేర్కొన్నది. అంటే వేరు సెనగ చేలో భూమికి పైన పండే పంటను... చెరకు తోటలో భూమి కింది పంటను తన వాటాగా తీసుకుంటానన్నట్టు ఒప్పందం కుదుర్చుకుంది. 

ఏదైనా ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణం ఒప్పందంలో వ్యయాలు పెరుగుతుంటే వాటిని వాటా దారులు తమ వాటాకు అనుగుణంగా భరించాలి. అలాంటిది భారీ కన్వెన్షన్ సెంటర్, హోటల్ ఉన్న ఎస్‌పీవీలో, నిర్మాణానికి సమయం ఎక్కువ పట్టటమే కాకుండా లాభాలు దరిదాపులో కనిపించని వెంచర్లలో చంద్రబాబు ఎక్కువ వాటాను ఏపీఐఐసీకి కట్టబెట్టటం అంటే అందులో ప్రజా ప్రయోజనం దాగున్నట్టా... లేక కుట్ర కనిపిస్తున్నట్టా? ఏపీఐఐసీ పని భూములు అప్పగించి భారీ వాటాలను పొందటం అని చంద్రబాబు ప్రభుత్వం భావించినట్టయితే, మొత్తం 100 శాతం వాటా ప్రభుత్వం చేతిలోనే ఉండే విధంగా ఆ ప్రాజెక్టులను ప్రభుత్వ రంగంలోనే ఎందుకు అమలు చేయలేదు? అసలు ప్రైవేటు రంగానికి మెజారిటీ వాటాలు ఎందుకు అప్పగించారు? పనిలో వేగం, నిర్మాణ ఖర్చులు ప్రైవేటు రంగం బాధ్యతలని పీపీఏ ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు... ప్రభుత్వ సంస్థగా ఏపీఐఐసీ వాటా వల్ల ఎలాంటి ప్రయోజనాలను ఆశించారు?

నిర్ణయాల్ని వీటో చేయొచ్చు కనకే 26 శాతం వాటా!

కంపెనీలో వాటా అన్నది ఆ సంస్థ నిర్ణయాధికారాన్ని శాసించే అంశం. కంపెనీ నిర్ణయాల్లో సాధారణ తీర్మానాలు, ప్రత్యేక నిర్ణయాలు అని రెండు రకాలు ఉంటాయి. సగానికి పైగా (51) వాటాలున్న వ్యక్తి (లేదా సంస్థ) సాధారణ తీర్మానాల ద్వారా సంస్థకు సంబంధించి తన నిర్ణయాలను అమలు చేయగలుగుతాడు. అదే సంస్థలో కీలక నిర్ణయాలను... అంటే మెమోరాండమ్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ వంటి వాటిని మార్చాలంటే 75 శాతం వాటాలున్నవారు అందుకు అంగీకరించాల్సి ఉంటుంది. కాబట్టే 26 శాతం వాటా కలిగిన వ్యక్తి/సంస్థ కీలక నిర్ణయాలను ప్రభావితం చేయగలుగుతారు. ఈమార్‌కు సంబంధించి మొదటి ఎస్‌పీవీలో చంద్రబాబు ప్రభుత్వం 26 శాతం వాటా నిర్ణయించుకోవటానికి కారణం ఇదే. అయితే, ఆదాయం ఎక్కువగా ఉండే ఎస్‌పీవీలో చంద్రబాబు ఒప్పందం సమయంలోనే 26 శాతం వాటాకు ఒప్పుకున్నారంటే ఎన్ని వందల కోట్లు కైంకర్యం చేసి అలా తక్కువశాతానికి అంగీకరించారని ప్రశ్నించనూ వచ్చు. ఇక రెండో ఎస్‌పీవీ వ్యయం ఎక్కువ... రాబడి తక్కువ వ్యవహారం. అలాంటి చోట ఏపీఐఐసీకి ఎక్కువ వాటా ఉండేలా ఒప్పందం చేసుకోవటం అంటే ప్రభుత్వ ధనాన్ని భవిష్యత్తులో ఆ సంస్థకు కట్టబెట్టేందుకే నిర్ణయించుకున్నారనీ భావించవచ్చు.

అదనపు వ్యయం చెల్లించకపోవటం వల్లే వాటా తగ్గింది

కన్వెన్షన్ సెంటర్‌కు సంబంధించిన ఎస్‌పీవీలో ఏపీఐఐసీ వాటా 49 శాతం నుంచి 26 శాతానికి తగ్గటం అన్నది నాడు మంత్రివర్గ ఉప సంఘం ప్రతిపాదనల ప్రాతిపదికగా ప్రభుత్వం తీసుకున్న హేతుబద్ధ నిర్ణయం. ఈ నిర్ణయం ద్వారా చట్టబద్ధంగా ఈమార్ కన్వెన్షన్ సెంటర్‌కు సంబంధించిన ఎస్‌పీవీలో తన పట్టు కోల్పోకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 26 శాతమైనా 49 శాతమైనా అది మెజారిటీ స్టేక్ కాదు. కాబట్టి 23 శాతం వాటా కోల్పోవటం అనే ప్రచారమే అర్థరహితం. 

ఇక్కడ జరిగినది కన్వెన్షన్ సెంటర్ సామర్థ్యాన్ని పెంచటంతో పాటు ప్రాజెక్టును విస్తరించటం. అదే సమయంలో ఏపీఐఐసీ పెట్టుబడులను తదనుగుణంగా పెంచటం కాకుండా... ఆ ఖర్చును ఈమార్ భరించేటట్టు ఒప్పించి, ఏపీఐఐసీ వాటాను 26 శాతానికి తగ్గకుండా చూడటం. ఇక్కడే ఇంకో మౌలికమైన ప్రశ్న ఏమిటంటే... చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 1995-2004 మధ్య దేశంలోని మరే రాష్ట్రంలోనూ చేయనంత ఎక్కువగా పెట్టుబడుల ఉపసంహరణ చేసింది. ఇది వేరెవరో చేస్తున్న ప్రచారం కాదు... స్వయానా చంద్రబాబు ప్రభుత్వమే ఇందుకు సంబంధించిన వివరాలను పుస్తక రూపంలో ప్రచురించింది. ఒక వంక ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేస్తూ... మరోవంక వాటిలో తన వాటాలను కూడా అమ్మేస్తూ పరిపాలన సాగించిన చంద్రబాబు నాయుడు- మరోవంక ఏపీఐఐసీ తరఫున పీపీపీలలో ఎందుకు ప్రభుత్వ రంగాన్ని భాగస్వామిగా చేయాలనుకున్నారు? రహేజా కావచ్చు, ఈమార్ కావచ్చు... ఏపీ జెమ్స్ అండ్ జ్యూయలరీ పార్క్ కావచ్చు... చంద్రబాబు అత్యంత ఖరీదైన స్థలాలను తనకు నచ్చినవారికి, తాను మెచ్చిన వారికి కట్టబెట్టారు. కొన్నింటిలో ప్రభుత్వ వాటాను ప్రారంభంలోనే 11 శాతంగా నిర్ణయించారు. 

అంటే మిగతా 89 శాతాన్ని ఎంతకు అమ్ముకున్నట్టు? 49 శాతం ఏపీఐఐసీ వాటా ఉండాలన్న నిబంధనను చంద్రబాబు నాయుడు ఒక ప్రాజెక్టుకు సంబంధించిన రెండు ఎస్‌పీవీలలోనే రెండు రకాలుగా ఎందుకు నిర్ణయించారు? ప్రభుత్వ ఈక్విటీ ఎక్కువగా ఉంటే అందుకు తగ్గట్టు భవిష్యత్తులో పెట్టుబడులు, పెరిగే వ్యయాలు భరించటానికి కూడా సిద్ధపడాలికదా? ఆ మాత్రం విజన్ బాబులో ఎందుకు లోపించింది? అదీగాక... చంద్రబాబు నాయుడు తీసుకున్న మిగతా నిర్ణయాలవల్ల ఏపీఐఐసీకి వందల కోట్లు లాభాలు వచ్చే పరిస్థితి ఎక్కడైనా ఉందా? ఏపీఐఐసీ భూముల కేటాయింపుల్లో ఎక్కువ భాగం 33 ఏళ్ళ లీజు లేదా 66 సంవత్సరాల లీజు ఉంటాయి. అలాంటప్పుడు భూమిమీద లీజు తీసుకున్న సంస్థలకు శాశ్వత హక్కులు సంక్రమించవు. ఈమార్‌కు సంబంధించి రామోజీ పత్రిక ఇలాంటి నిజాలన్నింటినీ తన రాతల మాటున దాచేసి... వైఎస్ దోచేశారని తన పాఠకులను వంచించటానికి తెగబడుతోంది.

అన్నింటికీ మించిన విచిత్రం ఏమిటంటే...

ఈమార్ కావచ్చు, చంద్రబాబు హయాంలో చేసుకున్న ఇతర ఒప్పందాలు కావచ్చు. వాటిని పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే వైఎస్ ప్రభుత్వం సమీక్షించింది. సీనియర్ మంత్రి రోశయ్య ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉప సంఘం సిఫారసుల మేరకే... ఆ తరవాత మంత్రిమండలి ఆమోదం పొందిన తరవాతే ఈమార్ ప్రాజెక్టులో మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పటి ఆర్థిక మంత్రి రోశయ్య ఆ తరవాత ముఖ్యమంత్రి పదవి నిర్వహించి ఇప్పుడు తమిళనాడు గవర్నర్‌గా ఉన్నారు. అప్పటి పరిశ్రమల మంత్రి ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా పదవిలోట ఉన్నారు. ఈమార్ వాటా తగ్గింపునకు కారణాలు సహేతుకమా కాదా అన్న అంశాన్ని సీబీఐ విచారించదలచుకుంటే అంతకు మించిన సాక్ష్యం మరెక్కడ లభిస్తుంది? సీబీఐ పేరు పెట్టి స్వయానా విచారణ ఎదుర్కోబోతున్న ఇంటరెస్టెడ్ పార్టీకి చెందిన పత్రిక నిత్యం ఇలాంటి రాతలు రాస్తుంటే... విచారణ ప్రక్రియల నిష్పాక్షికతమీద విశ్వాసం ఎవరికి కలుగుతుంది? 


బాబు హయాంలో వాటాలు...

ఒక వంక ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేస్తూ... మరోవంక వాటిలో తన వాటాలను కూడా అమ్మేస్తూ పరిపాలన సాగించిన చంద్రబాబు నాయుడు- మరోవంక ఏపీఐఐసీ తరఫున పీపీపీలలో ఎందుకు ప్రభుత్వ రంగాన్ని భాగస్వామిగా చేయాలనుకున్నారు? రహేజా కావచ్చు, ఈమార్ కావచ్చు... ఏపీ జెమ్స్ అండ్ జ్యూయలరీ పార్క్ కావచ్చు... చంద్రబాబు అత్యంత ఖరీదైన స్థలాలను తనకు నచ్చినవారికి, తాను మెచ్చిన వారికి కట్టబెట్టారు. కొన్నింటిలో ప్రభుత్వ వాటాను ప్రారంభంలోనే 11 శాతంగా నిర్ణయించారు. అంటే మిగతా 89 శాతాన్ని ఎంతకు అమ్ముకున్నట్టు? 49 శాతం ఏపీఐఐసీ వాటా ఉండాలన్న నిబంధనను చంద్రబాబు నాయుడు ఒక ప్రాజెక్టుకు సంబంధించిన రెండు ఎస్‌పీవీలలోనే రెండు రకాలుగా ఎందుకు నిర్ణయించారు? ప్రభుత్వ ఈక్విటీ ఎక్కువగా ఉంటే అందుకు తగ్గట్టు భవిష్యత్తులో పెట్టుబడులు, పెరిగే వ్యయాలు భరించటానికి కూడా సిద్ధపడాలికదా? ఆ మాత్రం విజన్ బాబులో ఎందుకు లోపించింది? అదీగాక... చంద్రబాబు నాయుడు తీసుకున్న మిగతా నిర్ణయాలవల్ల ఏపీఐఐసీకి వందల కోట్లు లాభాలు వచ్చే పరిస్థితి ఎక్కడైనా ఉందా?

మంత్రి వర్గ ఉపసంఘం ఏం చెప్పింది?

తాము అధికారంలోకి వస్తే, చంద్రబాబు కుదుర్చుకున్న ఒప్పందాలను ప్రజా ప్రయోజనాలు ప్రాతిపదికగా పునః సమీక్షిస్తామని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రకటించారు. ఆ మాటకు అనుగుణంగానే సీనియర్ నేత రోశయ్య ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించి, దాని సూచనలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకున్నారు. 2005 సెప్టెంబరు రెండో వారంలో తన నివేదికను సమర్పించిన రోశయ్య కమిటీ, చంద్రబాబు హయాంలో భూ కేటాయింపులకు సంబంధించి తీవ్రమైన అవకతవకలున్నాయని లెక్క తేల్చింది. 2004 నవంబరు 23న సమావేశమైన మంత్రివర్గ ఉప సంఘం, ఈమార్ ప్రాజెక్టులో కన్వెన్షన్ సెంటర్‌కు సంబంధించి ఏపీఐఐసీ వాటాను 49 నుంచి 26కు ఎందుకు తగ్గించుకోవాలో వివరించింది. దాని ప్రకారం...

1) కన్వెన్షన్ సెంటర్, దానితో పాటు నిర్మించాలనుకున్న హోటల్... ఈ రెండింటి నిర్మాణానికి భారీగా వ్యయం కావటంతోపాటు, వాటిని పూర్తి చేయటానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. అదీకాక, ఈ ప్రాజెక్టులో పెట్టుబడులకు వచ్చే లాభాలు కూడా తక్కువే.

2) అదీగాక, ప్రాజెక్టు వ్యయానికి సంబంధించి కూడా ఏపీఐఐసీ 49, ఈమార్ 51 శాతం భరించాలన్న ఒప్పందం ఫలితంగా... ప్రాజెక్టు వ్యయంతోపాటు ఏపీఐఐసీ పెట్టుబడిని కూడా పెంచాల్సివస్తోంది. కాబట్టే ప్రభుత్వ వాటాను 49 నుంచి 26కు తగ్గించటం ద్వారా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం మీద పడే ఆర్థిక బాధ్యత, భారం రెండింటినీ తగ్గించుకున్నట్టవుతుంది.

3) 26 శాతం వాటాతో ప్రభుత్వం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక కార్యకలాపాలను నియంత్రించే పరిస్థితిలో ఉండటంతోపాటుగా... రాష్ట్ర ప్రయోజనాలకు, ప్రాజెక్టు ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తాయనుకునే ఎలాంటి తీర్మానాలనైనా కంపెనీ చేస్తున్నట్టయితే వాటిని అడ్డుకోగలుగుతుంది.

4) ఈమార్ ప్రాపర్టీస్ ఈక్విటీ పెంచటం ద్వారా... వారికి అదనపు పెట్టుబడులకు అవకాశం కల్పించినట్టవుతుంది.
Share this article :

0 comments: