బాబు పై మూడ్రోజుల్లో కేసులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు పై మూడ్రోజుల్లో కేసులు

బాబు పై మూడ్రోజుల్లో కేసులు

Written By news on Saturday, November 19, 2011 | 11/19/2011



ఆయన బినామీలపై కూడా.. ఆ వెంటనే విచారణ మొదలు
అదే బాటలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్
దర్యాప్తు బృందాల ఏర్పాటుపై సీబీఐలో పైస్థాయిలో జరుగుతున్న కసరత్తు

న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన బినామీల వ్యాపారాలు, ఆర్జనలు, ఆస్తులపై దర్యాప్తుజరిపి నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో మూడు నాలుగు రోజుల్లో సీబీఐ వారిపై కేసులు నమోదు చేయనున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు రాజకీయాల్లో అడుగు పెట్టింది మొదలు మోసాలు, వంచనలు, అబద్ధాలతో దేశ విదేశాల్లో విపరీతంగా ఆస్తులు పోగేశారని, సన్నిహితులను బినామీలుగా చేసుకుని వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించారని, వీటన్నింటిపైనా సమగ్ర విచారణ జరపాలని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వై.ఎస్.విజయలక్ష్మి హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దాన్ని పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం అందులో ఆరోపణలకు ఆధారాలున్నాయని భావించిన మీదట ఈ నెల 14న సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ), రాష్ట్ర డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శితో దర్యాప్తునకు ఆదేశించిన విషయం విదితమే. మూడు నెలల్లోగా విడివిడిగా నివేదికలివ్వాలని దర్యాప్తు సంస్థలకు హైకోర్టు గడువు నిర్దేశించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు, ఆయన బినామీలపై కేసులు నమోదుచేసి దర్యాప్తు ఆరంభించడానికి సీబీఐ సమాయత్తమవుతోంది. ఇందుకోసం సీబీఐలో పైస్థాయిలో కసరత్తు శుక్రవారం ఆరంభమైంది. ఈ కసరత్తు వచ్చే రెండుమూడు రోజుల్లో పూర్తవుతుందని, ఆ వెంటనే కేసులు నమోదుచేసి విచారణ ఆరంభిస్తారని సీబీఐలోని విశ్వసనీయ ఉన్నతస్థాయి వర్గాలు ఢిల్లీలో వెల్లడించాయి.

సిద్ధమవుతున్న ఈడీ..
ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ)లోనూ ఇదే తరహా కసరత్తు జరుగుతోందని అందులోని వర్గాలు చెబుతున్నాయి. కేసుల నమోదు, దర్యాప్తు మొదలు ఎప్పుడు ఉండవచ్చో వెల్లడించడానికి ఈడీ వర్గాలు నిరాకరించాయి. ‘‘ప్రతిదీ సమయానుసారం ముందుకు కదులుతుంది. వివరాలు ఇవ్వడం సాధ్యం కాదు’’ అని ఆ వర్గాలు స్పష్టంచేశాయి.

సీబీఐ డెరైక్టర్‌తో లక్ష్మీనారాయణ భేటీ
ఢిల్లీ వచ్చిన జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ శుక్రవారం సీబీఐ డెరైక్టర్ ఎ.పి.సింగ్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి దేశంలోని వివిధ జోన్లకు చెందిన సీబీఐ కీలకాధికారులు హాజరయ్యారు. సమావేశం ముగిశాక లక్ష్మీనారాయణ విడిగా డెరైక్టర్‌తో భేటీ అయ్యారని, రాష్ట్ర కేసుల్లో పురోగతిపై చర్చలు జరిపారని తెలుస్తోంది. ఓఎంసీ, ఎమ్మార్ ప్రాపర్టీస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కేసుల్లో దర్యాప్తు సంగతులను లక్ష్మీనారాయణ ఆయనకు వివరించినట్టు సమాచారం. కొత్తగా చంద్రబాబు, ఆయన బినామీల ఆస్తులపై దర్యాప్తునకు అదనంగా అవసరమైన సిబ్బంది, ఇతర సౌకర్యాలను సత్వరమే కల్పించాలని కోరినట్లు తెలియవచ్చింది.

దర్యాప్తు టీమ్‌ల ఏర్పాటుపై తీవ్ర చర్చ..
చంద్రబాబు ఆస్తుల దర్యాప్తు కోసం చేయాల్సిన ఏర్పాట్లపై లక్ష్మీనారాయణతో డెరైక్టర్ విసృ్తతంగానే మాట్లాడారని చెబుతున్నారు. ప్రధానంగా దర్యాప్తు టీమ్‌ల ఏర్పాటుపైనే వీరిద్దరూ చర్చించుకున్నారని, చాలామందిని విచారించాల్సిన పరిస్థితి ఉన్నందున ఎక్కువమంది అధికారులే అవసరమని లక్ష్మీనారాయణ తెలిపారని అంటున్నారు. ఈ సమావేశం తర్వాత సీబీఐ ఉన్నతస్థాయి వర్గాలు పేరు వెల్లడించవద్దన్న షరతుపై మాట్లాడుతూ, వచ్చే వారం మొదట్లో కేసు నమోదు చేస్తారని, ఆ వెంటనే దర్యాప్తు మొదలుపెట్టవచ్చని పేర్కొన్నాయి. కొత్త కేసుల దర్యాప్తు బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే దానిపై పైస్థాయిలో ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని, బహుశా కేసుల నమోదు సమయానికి ఆ విషయమై స్పష్టత రావొచ్చని ఆ వర్గాలు చెప్పాయి.
Share this article :

0 comments: