జగన్ వెంటే ఉంటాo:ఆదినారాయణరెడ్డి, గొల్ల బాబూరావు, తెల్లం బాలరాజు, పూతలపట్టు రవి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ వెంటే ఉంటాo:ఆదినారాయణరెడ్డి, గొల్ల బాబూరావు, తెల్లం బాలరాజు, పూతలపట్టు రవి

జగన్ వెంటే ఉంటాo:ఆదినారాయణరెడ్డి, గొల్ల బాబూరావు, తెల్లం బాలరాజు, పూతలపట్టు రవి

Written By news on Friday, November 18, 2011 | 11/18/2011

హైదరాబాద్ : రాజీనామాలపై వివరణ ఇచ్చేందుకు జగన్ వర్గ ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, గొల్ల బాబూరావు, తెల్లం బాలరాజు, పూతలపట్టు రవి శుక్రవారం స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను కలిశారు. తమ రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎమ్మెల్యే గొల్ల బాబురావు విలేకర్లతో మాట్లాడుతూ రాజీనామాలపై స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని, తాము జగన్ వెంటే ఉంటామని ఆయన స్పష్టం చేశారు


ఈదుపల్లిలో వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ
గుంటూరు : ఓదార్పు యాత్రలో భాగంగా గుంటూరు జిల్లా నగరం మండలం ఈదుపల్లిలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని శుక్రవారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. అంతకు ముందు తమ ప్రియతమ నాయకుని కుమారుడు గ్రామానికి వస్తున్నారని సంతోషం వ్యక్తం చేస్తూ గ్రామస్తులు ఎదురు వెళ్లి జగన్ కు స్వాగతం పలికారు. ఓదార్పు యాత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పాల్గొన్నారు.
Share this article :

0 comments: