ఏ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఏ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది?

ఏ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది?

Written By news on Wednesday, November 16, 2011 | 11/16/2011

*ఏ కోర్టయినా బాబును నిజాయతీపరుడని అన్నదా? 
*అక్రమాస్తులపై బాబు, టీడీపీలకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతల ప్రశ్నలు 
*బాబు అవినీతి మచ్చలేని వ్యక్తి అని.. ఆయన ఆస్తులన్నీ నీతి సంపాదనే అనీ ఏ కోర్టయినా, ఏ కమిషన్ అయినా చెప్పిందా? 
*హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో బాబు, టీడీపీ అబద్ధాల ప్రహసనం 
*తేలిపోయిన కేసులంటూ బాబు, ఆయన బృందం బుకాయిస్తున్నారు
*గతంలో సాంకేతిక అంశాలను అడ్డుపెట్టుకుని తప్పించుకున్నారు 
*లక్ష్మీపార్వతి ఏసీబీని ఆశ్రయించినా.. కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నారు 
*హైకోర్టు తీర్పును బాబు, టీడీపీ నేతలు తప్పుపట్టడం హేయం 
*కోర్టులు జోక్యం చేసుకుంటేనే న్యాయం జరుగుతుందన్నారు.. ఇప్పుడు ఎందుకు బేజారవుతున్నారు?

హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడి అక్రమ ఆస్తులు, బినామీలను నిగ్గుతేల్చేందుకు సీబీఐ దర్యాప్తుకు ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆ పార్టీ నేతలు తప్పుడు ప్రచారానికి ఒడిగట్టారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. చంద్రబాబుపై గతంలో నమోదైన ఏ కేసూ నిర్థారణ కాలేదంటూ టీడీపీ నేతలు బుకాయిస్తున్నారని తప్పుపట్టింది. గతంలో అనేక సందర్భాల్లో చంద్రబాబుకు క్లీన్‌చిట్ లభించిందంటూ పచ్చి అబద్ధాలు చెప్తోందని ఎండగట్టింది. టీడీపీ చెప్తున్న అబద్ధాలకు చంద్రబాబు అనుకూల ఎల్లో మీడియా ప్రచారం కల్పిస్తోందని, నిజానికి చంద్రబాబుకు ఇంతవరకు ఏ కోర్టు కానీ ఏ సంఘం కానీ క్లీన్‌చిట్ ఇవ్వలేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ గుర్తుచేసింది. 

హైకోర్టు తీర్పుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు మేకా శేషుబాబు (పశ్చిమ గోదావరి), సి.నారాయణరెడ్డి (వైఎస్‌ఆర్ కడప), డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి (చిత్తూరు)లు మంగళవారం సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు, ఆయన వందిమాగధులు కోర్టు తీర్పుకు సంబంధించి లేవనెత్తిన అంశాలపై వారు ఘాటుగా స్పందించారు. ఈ విషయంలో చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలు చెప్తున్నవన్నీ వట్టి బుకాయింపులేనన్నారు. పైగా హైకోర్టు తీర్పు విషయంలో ‘ప్రజలందరికో నీతి.. మాకో నీతి’ అన్న చందంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. నిన్నమొన్నటి వరకు కోర్టులు జోక్యం చేసుకుంటే కానీ దేశంలో న్యాయం లభించటం లేదని చెప్పిన చంద్రబాబు ఇప్పుడెందుకు భుజాలు తడుముకుంటున్నారో అర్థం కావటం లేదని దుయ్యబట్టారు. 

చంద్రబాబు అక్రమ ఆస్తులు, బినామీలను నిగ్గుతేల్చేందుకు రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును టీడీపీ నేతలు తప్పుపట్టటం హేయమన్నారు. బాబు అక్రమ ఆస్తులకు సంబంధించి ఇంతకుముందు దాఖలైన కేసులు ఎన్ని ఉన్నా.. వాటిలో ఏ ఒక్క కేసునూ ఎదుర్కొనే ధైర్యం చంద్రబాబుకు ఏనాడూ లేకపోయిందని వారు విమర్శించారు. చివరికి స్వయానా అత్తగారైన లక్ష్మీపార్వతి ఏసీబీని ఆశ్రయిస్తే.. దర్యాప్తు జరగకుండా కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవాల్సిన అగత్యం చంద్రబాబుకు ఎందుకు పట్టిందని వారు ప్రశ్నించారు. ఈ సందర్భంగా చంద్రబాబుకూ, టీడీపీ నేతలకూ సూటిగా కొన్ని ప్రశ్నలు సంధించారు. అవి... 

* ఇంతవరకు భారతదేశంలోని ఏ న్యాయస్థానమైనా చంద్రబాబు సంపాదన నీతిమంతమైనదే అని కానీ, ఆయన ఎలాంటి అవినీతికి పాల్పడలేదని కానీ క్లీన్ చిట్ ఇచ్చిందా? 

* 26 కమిషన్లు తనమీద వేశారంటున్న చంద్రబాబు అందులో ఏ ఒక్క కమిషన్ అయినా తనను అవినీతి అంటని వ్యక్తిగా పేర్కొన్నట్లు చూపగలరా? 

శాసనసభా సంఘాలన్నవి పాలనాపరమైన అంశాలను పరిశీలించగలవే తప్ప చంద్రబాబు అవినీతి, అక్రమాలు, ఆశ్రీత పక్షపాతాలు వాటి పరిధిలోకి రావన్న విషయం టీడీపీ నేతలకు తెలియదా? తెలిసి కూడా ప్రజలను పక్కదారి పట్టించాలని చూడటం వంచన కాదా? 

* రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పరిశ్రమల్ని చంద్రబాబు అమ్మకానికి పెట్టి వేల కోట్ల విలువైన సంపదల్ని తన బినామీలైన పచ్చ చొక్కాల వాళ్ళ జేబుల్లో పెట్టటం నిజం కాదా? 

* ఉదాహరణకు నామా నాగేశ్వరరావుకు పాలేరు షుగర్స్‌ను కట్టబెట్టటం వంటి నిర్ణయాలను వైఎస్ ఆధికారంలోకి వచ్చిన తరవాత ఏర్పాటు చేసిన విచారణ సంఘం తీవ్రంగా తప్పుపట్టిన విషయం నిజం కాదా? 

* రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలు బెంబేలెత్తుతారన్న అభిప్రాయంతో అప్పట్లో వైఎస్ ప్రభుత్వం టీడీపీ హయాంలో తీసుకున్న నిర్ణయాలమీద చర్యలు తీసుకోవటం లేదని ప్రకటించటం నిజం కాదా? 

నెల్లూరు జిల్లా బాలాయపల్లిలో ఏ ఒక్కరిని అడిగినా అవి చంద్రబాబు భూములేనని చెపుతున్నారే! అదీగాక ఆ భూమి అంతటికి ఒకే ఫెన్సింగ్ వేశారే. ఇదంతా ఎవరి పని? అసలు చంద్రబాబుకు బాలాయపల్లిలో భూములు కొనుగోలు చేయటానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చూపాలికదా? అది అవినీతి సొమ్మేకదా?

* కేజీ బేసిన్ ఆరో బావికి సంబంధించిన బిడ్డింగ్‌లో ఆంధ్రప్రదేశ్ పాల్గొనకుండా చంద్రబాబు చక్రం తిప్పిన మాట వాస్తవం కాదా? లేదంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఇంటికీ పైపుల ద్వారా నెలకు రూ.100 మించకుండా గ్యాస్ సరఫరా వీలయ్యేదే కదా? రిలయన్స్ బిడ్‌కు అడ్డు పడకపోవటం ద్వారా బాబు వారికి సహకరించటం నిజం కాదా? 

* విమానాశ్రయాలకు రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని చూపితేనే కేంద్రం నిర్ణయం తీసుకుందా? లేక శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం కడతామని కేంద్రమే ముందుకు వచ్చిందా? బేగంపేటలో విమానాశ్రయం ఉండగా మరో విమానాశ్రయం కట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చినట్లు? 

కాకినాడ పోర్టుకు చెందిన కర్నాటి వెంకటేశ్వరరావు వైఎస్ హయాంలో కూడా భారీగా మేళ్ళు పొందాడని టీడీపీ ఇప్పుడు అంటోంది. మరి ఆ మేళ్ళ సంగతి వారు వేసిన రిట్ పిటిషన్‌లో ఎందుకు ప్రస్తావించలేదు? ఇప్పుడు కర్నాటి పేరెత్తగానే చంద్రబాబు పార్టీ వారు ఎందుకు భయపడుతున్నారు? 

* రామోజీరావు భూములకు చేరువలోనే విమానాశ్రయాలు ఉండాలని ఎందుకు నిర్ణయించుకున్నారు? నాటి హోంమంత్రి దేవేందర్‌గౌడ్ సహా ఎందరు పచ్చ చొక్కాలవారు మూకుమ్మడిగా శంషాబాద్ చుట్టూ భూముల్ని చౌక ధరలకే దక్కించుకున్నట్లు? రంగారెడ్డి రైతులకు జరిగిన అన్యాయం సీబీఐ విచారణలో బయటకు వస్తుందని భయపడుతున్నారా? 

* హైటెక్ సిటీ ప్రకటనకు ముందే చంద్రబాబు భార్య, చంద్రబాబు తనయుడి పేర్ల మీద జనం సొమ్ముతో ఎకరాలకు ఎకరాలు అక్కడ కొనుగోలు చేయటం నిజం కాదా? అప్పట్లోనే చంద్రబాబు మనుషులు వేల ఎకరాలు కొనుగోలు చేసి.. ఆ తరవాత హైటెక్ సిటీ ప్రకటన చేయటం నిజం కాదా? 

* హైటెక్ సిటీ భూముల్లోనే చంద్రబాబు సన్నిహితులు, దగ్గరి వ్యక్తులకు భారీగా భూ కేటాయింపులు జరిపి మరో కుంభకోణానికి తెరతీయటం నిజం కాదా? ఇది కుట్రపూరితమైన క్రిమినల్ నేరం కాదా? 
* రామా అగ్రికల్చరల్ ఫామ్స్ పేరు మీద చంద్రబాబు ఫ్యామిలీ కొన్న భూములకు సొమ్ములెక్కడివి? 
* రాజకీయాల్లోకి వచ్చీ రాగానే తిరుపతిలో విష్ణుప్రియ హోటల్‌ను ఏ సంపాదనతో కొన్నావు? 

* 1995-2004 సంవత్సరాల మధ్య చంద్రబాబు అధికారంలో ఉన్న కాలంలోనే రామోజీరావుకు చెందిన చట్టవిరుద్ధ డిపాజిట్ల సేకరణ సంస్థ మార్గదర్శి ఫైనాన్షియర్స్‌లోకి వేల కోట్ల రూపాయల సొమ్ము వచ్చింది. ఇది ఎవరి సొమ్ము? దశాబ్దాలుగా నష్టాల్లో కూరుకుపోయి ఉన్న రామోజీ కంపెనీల్లోకి దాదాపు రూ. 2,600 కోట్లు ఎవరు పెట్టుబడులు పెట్టారు? ఇందులో చంద్రబాబు పోషించిన పాత్ర ఏమిటి? రామోజీరావు శంషాబాద్, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో తన సంస్థలో ఉద్యోగుల్ని బినామీలుగా పెట్టి 2,000 ఎకరాలు మింగేయటం నిజం కాదా? ఈ మొత్తం వ్యవహారాలమీద నిజం చెప్పవయ్యా అంటే ఎందుకు నోరు మెదపరు? 

సాక్షి తన రూ. 10 షేరును రూ. 350 ప్రీమియంకు అమ్మటం నేరమని అంటున్న రామోజీరావు, టీడీపీ పెద్దలు ముందుగా సమాధానం చెప్పాల్సిన అంశం.. నష్టాల రామోజీ సంస్థల్లో రూ. 100 షేరును రూ. 5,28,630కి కొనుగోలు చేయటమే! ఇది ఈ దేశంలోకెల్లా అతి పెద్ద గోల్‌మాల్ కాదా? అసలు రామోజీ సంస్థల్లోకి వచ్చిన డబ్బు ఎవరిది? 

ఆ ‘బిల్డప్’ ఏమయింది? 
దేశంలో కెల్లా మొట్టమొదటిసారిగా చంద్రబాబు తన ఆస్తులను డిక్లేర్ చేశారని, అంతటి నీతిపరుడిని ఏమన్నా అంటే కళ్ళు పోతాయని, పాపం తగులుతుందన్నట్టు టీడీపీ నాయకులు మాట్లాడటం వంచనే అన్నారు. చంద్రబాబు తన ఆస్తులకు సంబంధించి 1989లో కోర్టుకు సమర్పించిన డిక్లరేషన్ కానీ, 1999లో అసెంబ్లీకి సమర్పించిన డిక్లరేషన్ కానీ, 2004, 2009 ఎన్నికలప్పుడు ఇచ్చిన డిక్లరేషన్లు కానీ.. అన్నీ అసత్యాలు, అర్ధసత్యాలతో కూడినవేనని ఆరోపించారు. ఆయన ఈ మధ్య అన్నాహజారేని చూడగానే.. పులిని చూసి నక్క వాత పెట్టుకున్న కథ మాదిరిగా.. తనను మించిన నిజాయతీపరుడు లేడని ప్రజల ముందు బిల్డప్ ఇస్తున్నారని ఎద్దేవాచేశారు. 

తన బిల్డప్‌ను తనకు అనుకూలమైన పత్రికలు, చానళ్లు అదే నిజం నమ్మండని ప్రజలను మోసం చేయగలవని చంద్రబాబు భావించార ని, అందుకే రెండు నెలల కిందట బాబు తన కొడుకు, కోడలు ఆస్తులు ఇవి అంటూ ప్రకటన ఒకటి చేశారని వ్యాఖ్యానించారు. అన్నింటికంటే విచిత్రంగా.. 1999 నాటికే తన ఆస్తులు రూ. 4 కోట్లని స్వయంగా ప్రకటించిన చంద్రబాబు.. 2011కి అవన్నీ మాయమై రూ. 39 లక్షలకు తగ్గిపోయాయన్నట్లు డిక్లేర్ చేశారని ఎద్దేవా చేశారు. 

‘‘మరీ ఇంతగా అబద్ధాలు ఆడుతున్నారంటే.. ప్రజలు అమాయకులని చంద్రబాబు భావించటమే కారణం. అదీగాక.. సెప్టెంబరు 2- మహానేత వైఎస్ వర్ధంతి. ఆ రోజున వైఎస్ గురించి మీడియాలో కవరేజి రాకుండా చూడటానికి బాబు తనదైన కుట్ర మార్కుతో ఆ ప్రకటన చేశారు’’ అని విమర్శించారు. అయినా వైఎస్ చేసిన మంచిని, చంద్రబాబు చేసిన చెడును ఎవరూ మరచిపోలేదని పేర్కొన్నారు. 

కొత్త చట్టాలతో సాక్ష్యాధారాలు... 
చంద్రబాబు అక్రమ ఆస్తులకు సంబంధించి ఇంతకుముందు న్యాయస్థానాల్లో వేసిన పిటిషన్లకు, తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ వేసిన పిటిషన్‌కు చాలా భేదాలు ఉన్నాయని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. చంద్రబాబు అధికారంలో నుంచి దిగిపోయింది 2004లో అయితే, మనీ లాండరింగ్ చట్టం అమల్లోకి వచ్చింది 2005లో అని.. కాబట్టి చంద్ర బాబు పాత పాపాలను కూడా బయటపెట్టేందుకు కొత్త చట్టాలు ఉపయోగపడుతున్నాయని వ్యాఖ్యానించారు. అలాగే, సమాచార హక్కు చట్టం కూడా అమలులోకి వచ్చింది 2005లో, దాని ద్వారా లభించిన సమాచారం కూడా వైఎస్ విజయమ్మ పిటిషన్‌లో ఉపయోగపడిందని వివరించారు. 

అన్నింటికీ మించి.. 1995-2004 మధ్య సింగపూర్, మలేసియా అంటూ ఇక్కడ అవినీతి సొమ్మును అక్కడికి బాబు తరలించిన వైనాన్ని తెహల్కా పత్రిక ఏనాడో బయటపెట్టిందని, అలా విదేశాలకు తరలించిన సొమ్మును 2009 ఎన్నికల సమయంలో తన బినామీలైన సుజనాచౌదరి, సి.ఎం.రమేశ్ కంపెనీల ద్వారా వెనక్కు రప్పించిన వైనాన్ని పిటిషన్ బట్టబయలు చేసిందని అన్నారు. కాబట్టి చంద్రబాబు అవినీతి ఊడల మర్రిలా దేశదేశాలకు విస్తరించి సన్నిహితులు పెట్టిన డొల్ల కంపెనీల ద్వారా వెనక్కు చేరుతున్న వైనం వెల్లడి అవుతోందని వివరించారు. నేరానికి సంబంధించి చట్టం ఒకటే చెప్తోందని.. పాత నేరాలు, కొత్త నేరాలు అని కాక, శిక్ష పడిందా లేదా అన్నది మాత్రమే ప్రధానమని, దానికి తగిన ఆధారాలు ఇప్పుడు మరింతగా బయటపడుతున్నాయని పేర్కొన్నారు.
Share this article :

1 comments:

raja said...

Mr.chandrababu naidu neeku nevu clean cheet prepare chesukuni ela mataladutunnava? leka nee thoka paper ramoji clean cheet echada? leka nee yellow media echinda? chetakani matalu kattipetti nevu cbi interagation ku accept cheyi. nevu oka GADAFFI laga, oka BINLADEN laga, oka SADDAM HUSSAIN laga, oka MUSHARAF laga behave cheyaku. vallu nelaga murakkam behave chesi, dikku leni chau chacharu. ne thoka patrika and ne yellow media chusukuni neeku nevu, niyanthalaga behave cheste, neeku vallanti gathi padutundi. no dout at all.