మా 18 మంది ఎమ్మెల్యేలకు సెల్యూట్ కొడుతున్నా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మా 18 మంది ఎమ్మెల్యేలకు సెల్యూట్ కొడుతున్నా

మా 18 మంది ఎమ్మెల్యేలకు సెల్యూట్ కొడుతున్నా

Written By ysrcongress on Thursday, December 8, 2011 | 12/08/2011

ప్రభుత్వం పడదని నిర్ధారించుకున్న తర్వాతే బాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కై అవిశ్వాసం పెట్టారు
వైఎస్సార్ కాంగ్రెస్ రైతులు,పేదల పక్షమేనని నిరూపించిన ఎమ్మెల్యేలకు సెల్యూట్ చేస్తున్నా
అసెంబ్లీ వేదికగా సీఎం నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడుతున్నారు
విద్యార్థులకు ఫీజుల కష్టాలు ఇంకెన్నాళ్లు?
ప్రజల్లోకి వెళ్తాం.. రైతులు, రైతు కూలీల గోడు ఢిల్లీకి వినిపిస్తాం

ఓదార్పు యాత్రనుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: ఉప ఎన్నికలతో ప్రజల్లోకి వెళ్లి రాష్ట్రంలోని రైతుల కష్టాలను, పేదల గోడును ఢిల్లీ పెద్దలకు వినిపిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. ‘‘జగన్ వర్గం ఎమ్మెల్యేలను సింగిల్ డిజిట్‌కే కట్టడి చేయాలన్న కుళ్లు, కుతంత్రంతో కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబునాయుడు కుమ్మక్కై అవిశ్వాసం పెట్టారు. వాళ్ల ఉద్దేశం ఏదైనా.. రైతులు, రైతు కూలీల కోసం పదవీత్యాగానికి సిద్ధపడి విలువలు, విశ్వసనీయతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమని నిరూపించిన మా 18 మంది ఎమ్మెల్యేలకు సెల్యూట్ కొడుతున్నా’’ అని కొనియాడారు. బుధవారం గుంటూరు జిల్లాలో 35వ రోజు ఓదార్పు యాత్రలో భాగంగా జగన్ ప్రత్తిపాడు నియోజకవర్గంలోని బోడిపాలెం గ్రామంతోపాటు పొన్నూరు నియోజకవర్గంలోని పలు పల్లెల్లో పర్యటించారు. ఇటికింపాడులో కూలీలతో కలిసి వరి కోశారు. పంటసాగులో రైతు సమస్యలను, కూలీ గిట్టుబాటు వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు, పేదల పక్షమేనని అసెంబ్లీ వేదికగా నిరూపించిన జగన్‌కు జనం నీరాజనాలు పలికారు. ప్రతి గ్రామంలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జనంతో కిటకిటలాడింది. పొన్నూరు నియోజకవర్గ కేంద్రంలో జరిగిన బహిరంగ సభకు జనం భారీ సంఖ్యలో పోటెత్తారు. వివిధ సభల్లో జగన్ చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే...

అసెంబ్లీ వేదికగా అబద్ధాలా..?

అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్షంలో కూర్చున్న చంద్రబాబునాయుడు నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడటం చూస్తుంటే బాధనిపిస్తుంది. నేను ఇక్కడకు రాకముందు (మాచవరం) ఇంజనీరింగ్ విద్యార్థులు కలిశారు. ఏం చదువుతున్నారమ్మా అని వాళ్లను అడిగా. కొందరు బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నామని, ఇంకొందరు మూడో సంవత్సరం చదువుతున్నామని చెప్పారు. ఈ సంవత్సరం ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు మీకు వచ్చాయా అని అడిగితే.. డబ్బులు రాలేదని చేతులు అడ్డంగా ఊపారు. ఒక్క విద్యార్థి నుంచి కూడా డబ్బులు వచ్చాయన్న మాట వినపడలేదు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మైకు పట్టుకొని అసెంబ్లీలోనే అబద్ధాలు ఆడుతున్నారు. 2009-10కి సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి రూ.3200 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి కేవలం రూ.900 కోట్లు ఇచ్చారు. 

మళ్లీ 2011-12 కు సంబంధించి ఇప్పుడు ఈ సంవత్సరం బడ్జెట్‌లో రూ.2900 కోట్ల కేటాయింపులు చేశారు. కానీ ఇవి అంతకుముందు సంవత్సరానికి అంటే.. 2009-10కి సంబంధించిన బకాయిలు తీర్చటానికే ఉపయోగించారు. 20011-12 సంవత్సరానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేని అధ్వాన పరిస్థితిలో ఉండి కూడా ఈ ప్రభుత్వం నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతోంది. మరో నాలుగు నెలల్లో ఈ విద్యాసంవత్సరం కూడా పూర్తవుతుంది. విద్యార్థులు ఒక సెమిస్టర్‌ను పూర్తిచేసుకొని మరో సెమిస్టర్‌లోకి అడుగుపెడతారు. 2011-12 విద్యా సంవత్సరానికి రూ. 3500 కోట్లు కావాల్సి ఉండగా బడ్జెట్‌లో ఉన్న సొమ్ము కేవలం రూ.113 కోట్లు. మరి మిగిలిన డబ్బును ఎక్కడ్నుంచి తీసుకువస్తారు? ఎందుకు కేటాయింపులు చేయలేదు?

చంద్రబాబు అప్పుడే అవిశ్వాసం పెట్టి ఉంటే..

అన్యాయమైన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంటే విపక్షంలో కూర్చున్న చంద్రబాబునాయుడు గారు అసెంబ్లీ వేదికగా రాజకీయాలు చేయటం మొదలుపెట్టాడు. చంద్రబాబు రాజకీయాలలోనే పుట్టారు. రాజకీయాల్లోనే జీవితం గడుపుతున్నారు. ఇదే చంద్రబాబు ఆరు నెలల కిందట.. చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో విలీనం కాకముందు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఉంటే... ఆ వేళ నాకు బాగా గుర్తుంది.. లైలా తుఫాను వచ్చింది, జల్ తుఫాను వచ్చింది, రైతుల బతుకులు అతలాకుతలంగా ఉన్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం కాలేజీ యాజమాన్యాలు సుప్రీంకోర్టు దాకా వెళ్లి ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో వరలక్ష్మి అనే విద్యార్థిని ఫీజులు అందక ఆత్మహత్య చేసుకుంది. ఆరునెలల కిందటి ఈ పరిస్థితికి ఇవాళ్టి పరిస్థితికి పెద్దగా తేడా లేని రోజులవి! ఆరు నెలల కిందటే చంద్రబాబునాయుడు అవిశ్వాసం పెట్టి ఉంటే ఈ ప్రభుత్వం జల్ తుఫాన్ లో కొట్టుకొనిపోయి ఉండేది.

జగన్ వైపు వెళ్లే ధైర్యం చేయలేరనే...

గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు వరి వేసుకున్న రైతన్నలు, వరి కోస్తున్న అక్కాచెల్లెమ్మలు నన్ను చూసి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎలా ఉన్నావన్నా అని రైతన్నని అడిగితే... బస్తా ధాన్యం రూ.680 కూడా పలక ని అధ్వాన పరిస్థితులు ఉన్నాయని చెప్పినప్పుడు నా గుండె పగిలినంత బాధనిపించింది. ఎకరం పొలంలో వరికోస్తే కేవలం రూ.1000, మరికొన్ని చోట్ల రూ.1200 ఇస్తున్నారని రైతులకు అంతకన్నా ఎక్కువ ఇచ్చే పరిస్థితులు లేవని అక్కాచెల్లెళ్లు చెప్పినప్పుడు ఇంకా బాధనిపించింది. ఇవాళ చంద్రబాబునాయుడు మొసలి కన్నీళ్ళు కారుస్తూ రైతులకు తాను తోడుగా ఉన్నానని అబద్ధాలు చెప్తూ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ ప్రభుత్వం పడిపోదు.. అని నిర్ధారించుకున్న తర్వాతే చంద్రబాబు అవిశ్వాస తీర్మానం పెట్టారు. జగన్‌కు మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేలను సింగిల్ డిజిట్ కు కట్టడి చేయాలన్న ఉద్దేశంతోనే అవిశ్వాస తీర్మానం పెట్టారు. 

పదవి పోయి ఉప ఎన్నికలు వస్తే ఎమ్మెల్యేలు ఎవరు జగన్ వైపు వెళ్లే ధైర్యం చేయలేరని, దీంతో జగన్ పూర్తిగా నిస్సహాయుడై పోతాడన్న కుళ్లు, కుతంత్రాలతో చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై అవిశ్వాసం పెట్టారు. నేను గుంటూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్నప్పుడే చెప్పా.. వాళ్లు ఏ ఉద్దేశంతో అవిశ్వాసం పెట్టినా నాయకుడు అనే వాడికి విలువలు ఉండాలి, విశ్వసనీయత ఉండాలి అని. అక్కడికి పోయి నాకు మద్దతు తెలుపుతున్న ప్రతి ఎమ్మెల్యేకు కూడా ఇదే విషయం చెప్పా. తాను వేసే ఓటుతో అనర్హుడిని అవుతానని, ఎమ్మెల్యే పదవి పోతుందని, ఉప ఎన్నికలు వస్తాయని తెలిసి కూడా ప్రతి ఎమ్మెల్యే ముందుకు వచ్చి అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేశారు. విశ్వసనీయతకు, విలువలకు గౌరవం ఇచ్చి రైతు, పేదవాని పక్షాన నిలబడ్డ ఏకైక పార్టీ ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని మా 18 మంది ఎమ్మెల్యేలు నిరూపించారు. వారందరికీ నేను సగర్వంగా సెల్యూట్ కొడుతున్నా.

రైతులను మరచి వైఎస్‌పై మాట్లాడారు..

అవిశ్వాసం ప్రవేశపెట్టిన చంద్రబాబు రైతుల గురించి, కూలీల కష్టాల గురించి మాట్లాడాల్సింది పోయి చనిపోయి రెండున్నరేళ్లవుతున్న దివంగత వైఎస్సార్ గురించి మాట్లాడారు. కారణం ఏమిటంటే సభలో ఉన్న ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి వారిని అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు వేయించాలన్న దిక్కుమాలిన ఆలోచనతోనే ఆయన వైఎస్సార్‌ను విమర్శించారు.


ఆడపడుచును ఆశీర్వదించండి..

ప్రత్తిపాడు నియోజకవర్గంలోని బోడిపాలెంలో జగన్ మాట్లాడుతూ... రాబో యే ఉప ఎన్నికల్లో సుచరితను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘‘త్వరలో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు రాబోతున్నా యి. రైతుల కోసం, పేదవాని కోసం, మీకోసం, విశ్వసనీయత కోసం నా చెల్లి సుచరిత పదవి త్యాగం చేసింది. మీ కష్టాలు, కన్నీళ్ళు ఢిల్లీ పెద్దలకు వినిపిం చేందుకు మళ్లీ మీ వద్దకు వస్తోంది. మీ అందరి ఆశీస్సులు అడుగుతుంది. నా సోదరిని ఆశీర్వదించండి. 50 వేల ఓట్ల మెజారిటీ ఇవ్వండి’’ అని అన్నారు.
Share this article :

0 comments: