భయపడే మనస్తత్వమే ఉంటే ఆయన కాంగ్రెస్ నుంచి బయటికొచ్చేవారు కాదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » భయపడే మనస్తత్వమే ఉంటే ఆయన కాంగ్రెస్ నుంచి బయటికొచ్చేవారు కాదు

భయపడే మనస్తత్వమే ఉంటే ఆయన కాంగ్రెస్ నుంచి బయటికొచ్చేవారు కాదు

Written By ysrcongress on Monday, December 5, 2011 | 12/05/2011

జగన్ బెంగళూరు వెళుతున్నారన్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే
భయపడే మనస్తత్వమే ఉంటే ఆయన కాంగ్రెస్ నుంచి బయటికొచ్చేవారు కాదు
జగన్‌పై ఆది నుంచీ ఎల్లోమీడియా విషప్రచారం చేస్తూనే ఉంది
ఆయనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలపై తీవ్రమైన ఒత్తిడి ఉంది
అయినా జగన్‌పై అభిమానంతో ఆయన వెనుకే నడుస్తున్నాం.. ఆయన చెప్పినట్టే అవిశ్వాసానికి మద్దతిస్తాం

హైదరాబాద్, న్యూస్‌లైన్: అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీలు కుట్రలు చేస్తూ కొన్ని మీడియా చానళ్లతో వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నాయని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. అవిశ్వాసంపై జగన్‌వర్గ ఎమ్మెల్యేలు ఢీలా పడ్డారని, జగన్ చేతులెత్తేశారని, ఆయన ఆదివారమే బెంగళూరు వెళుతున్నారంటూ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆమె చెప్పారు. ఆదివారమిక్కడ ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, ధర్మాన కృష్ణదాస్, సుచరిత, కాపు రామచంద్రారెడ్డితో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. భయపడే మనస్తత్వమే ఉంటే జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేవారే కాదన్నారు. ప్రభుత్వం, కాంగ్రెస్‌పార్టీ ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేసినా వెనుకడుగు వేయబోరని ఆమె కుండబద్దలు కొట్టారు. 

‘‘కాంగ్రెస్ నుంచి బయటకొచ్చినప్పటి నుంచి జగన్‌ను అణగదొక్కేందుకు అధికారపార్టీ ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తోంది. దీనికి ప్రతిపక్ష టీడీపీ వంత పాడుతోంది. ఆ పార్టీలకు కొమ్ము కాస్తున్న ఎల్లోమీడియా జగన్‌ను అస్థిరపరిచేందుకు మొదటినుంచీ విషప్రచారం చేస్తూనే ఉంది. ఆయన వెంట ఇద్దరు లేదా ముగ్గురికి మించి ఎమ్మెల్యేలు లేరంటూ దుష్ర్పచారం చేసింది. 

తీరా ఒక్కసారిగా 29 మంది రాజీనామా చేసేసరికి వాటి గొంతులో పచ్చి వెలక్కాయపడ్డటైంది. అయినా ఎల్లోమీడియా తన వక్రబుద్ధి కొనసాగిస్తూనే ఉంది’’ అని ఆమె మండిపడ్డారు. అవి ఎంతగా విషప్రచారం చేసి జగన్‌ను కించపరచాలని చూసినా, ఎలాంటి నష్టం జరగకపోగా సానుభూతి పెరిగి మరింత పెద్ద నాయకుడవుతారని శోభానాగిరెడ్డి అన్నారు. జగన్‌కున్న ధైర్యం, విశ్వసనీయతవల్లే తామంతా(ఎమ్మెల్యేలు) ఆయనకు మద్దతు ఇస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. సమావేశానికి ఎమ్మెల్యేల హాజరు తగ్గింది కదా? అని కొందరు విలేకరులు ప్రశ్నించగా.. ‘‘ఈరోజు(ఆదివారం) ఎమ్మెల్యేల సమావేశం పెట్టుకున్నామని ఎవరికి చెప్పాము? ఎక్కడా ప్రకటించలేదే? అలాంటప్పుడు ఎమ్మెల్యేలు తగ్గారని ఎలా అంటారు? జగన్ హైదరాబాద్‌లో ఉన్నారు కదా అని కలసి వెళ్దామని వస్తున్నాం. ఎవరికి వీలున్నట్లు వారు వచ్చి వెళ్తున్నారు. అయినా టీడీఎల్పీ సమావేశానికి మొత్తం 86 మంది సభ్యులు వస్తున్నారా? సీఎల్పీ సమావేశానికి సభ్యులందరూ హాజరవుతున్నారా? టీడీపీ నుంచి పదిమంది ఎమ్మెల్యేలు బయటకు వెళ్లినా ఎల్లో మీడియా కంటికి కనబడదు. వారికి జగన్ తప్ప వేరెవరూ కనిపించరు’’ అని ఆమె ధ్వజమెత్తారు. ఎల్లోమీడియా ముందు రోజూ ఎమ్మెల్యేలు పరేడ్ చేయాలా? అని ప్రశ్నించారు. అయినా తాము వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలవలేదని, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా జగన్‌పై ఉన్న అభిమానంతోనే వస్తున్నామని శోభానాగిరెడ్డి స్పష్టం చేశారు.

ఎమ్మెల్యేలను భయపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి..

‘‘జగన్‌కు మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేలపై ఎంత ఒత్తిడి ఉందో, ఎన్ని ప్రలోభాలకు గురిచేస్తున్నారో మీకు(మీడియా), మాకు తెలుసు. వారికున్న వ్యాపారాలను బూచిగా చూపి కొందరిని భయపెడుతున్నారు. రకరకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ జగన్‌పై ఉన్న ప్రేమ, ఆదరాభిమానాలతో మేమంతా ఆయనవెంటే నడుస్తున్నాం. అవిశ్వాసం విషయంలో జగన్ మాటకు కట్టుబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తాం’’ అని ఆమె తెలిపారు. ‘‘ప్రభుత్వాన్ని పడగొట్టే సంఖ్య మా దగ్గర లేదు. ఈ విషయాన్ని జగన్ మొదటినుంచి చెబుతూనే ఉన్నారు. అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేస్తామన్నదీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కాదు. రాష్ట్రంలో ప్రజలెదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా రైతాంగ సంక్షేమంపట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. అంతేగాక దివంగత వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తోంది. ఈ విషయాన్ని సాక్షాత్తూ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణే బహిరంగంగా చెబుతున్నారు. 108, 104 వాహనాలపై రాజీవ్‌గాంధీ బొమ్మ తీసేసి, పరువు కాపాడాలంటూ ఆయనే వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలకు అండగా ఉండటంతోపాటు ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతోనే అవిశ్వాసానికి మద్దతిస్తున్నాం’’ అని శోభానాగిరెడ్డి ఓ ప్రశ్నకు బదులిచ్చారు. అసెంబ్లీలో చేతులెత్తినప్పుడు మా బలం ఎంతో మీకు(మీడియా) తె లుస్తుందని ఆమె మరో ప్రశ్నకు జవాబుగా చెప్పారు. ప్రభుత్వాన్ని కాపాడటానికి కేవీపీ రంగంలోకి దిగారంట కదా? అన్న ప్రశ్నకు.. బాలినేని బదులిస్తూ అంత పరిస్థితి వచ్చిందంటే వాళ్లు ఎంతగా భయపడుతున్నారో అర్థం చేసుకోవచ్చని అన్నారు.
Share this article :

0 comments: