చేబ్రోలులో ఘనస్వాగతం.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చేబ్రోలులో ఘనస్వాగతం..

చేబ్రోలులో ఘనస్వాగతం..

Written By ysrcongress on Saturday, December 10, 2011 | 12/10/2011

అభిమానానికి కొలమానం లేదు. అది గుండె లోతుల్లోంచి పుడితే దాని విలువ లెక్కించతరం కాదు. ఆ మహానేత తనయుడు ఓదార్పు యాత్రలో పల్లె తలుపులు తడుతున్న సమయంలో కనిపిస్తున్నది అదే! ఆత్మీయ తోరణాలు కట్టిన ఊరూరా.. పూలదారిలో నడిపించాలని.. జననేతను కళ్లారా చూడాలని.. నోరారా పలకరించాలని.. ఒక్కసారి చేతిని తాకాలని.. ఏదైనా తినిపించాలని.. ఆ జ్ఞాపకాన్ని పదిలం చేసుకోవాలని.. తమ సమస్యలు విన్నవించాలని.. పసిపిల్లల నుంచి పండుటాకుల వరకు ఒక్కొక్కరు ఒక్కోలా పడుతున్న ఆతృతను ఏమని వర్ణించగలం. ఎంతని చెప్పగలం! ఆ అవినా‘భావం’ అనుభవపూర్వకంగానే అర్థమవుతుంది.

చేబ్రోలు, న్యూస్‌లైన్ : అడుగడుగునా జన నీరాజనాల నడుమ శుక్రవారం ఓదార్పు యాత్ర కొనసాగింది. చేబ్రోలు మండలంలో 30 కిలోమీటర్లు ప్రయాణించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 14 వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఉదయం విజ్ఞాన్ కళాశాల నుంచి ఆయన ఓదార్పు యాత్రకు పయనమయ్యారు. తొలుత వడ్లమూడి మెయిన్ సెంటర్‌కు చేరుకున్న జగన్‌కు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. అక్కడ వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం గ్రామంలోని దర్గాలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. తర్వాత జవహర్‌లాల్ నెహ్రూ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం జెండా చెట్టు సెంటర్‌లో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

చేబ్రోలులో ఘనస్వాగతం..
చేబ్రోలు చేరుకున్న జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు ఘనస్వాగతం పలికారు. వరికుప్పలు వేస్తున్న కూలీలతో జగన్ మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చేబ్రోలు ప్రధానసెంటర్‌లో జగన్ ప్రసంగించారు. తర్వాత చీలిపాలెం చేరుకుని ఎస్సీకాలనీలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం హోసన్న మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అక్కడి నుంచి పాతరెడ్డిపాలెం చేరుకున్న జగన్‌కు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. జోసఫ్‌నగర్‌లో వైఎస్సార్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. అనంతరం అంబేద్కర్‌నగర్‌లో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంబేద్కర్ విగ్రహా నికి పూలమాలవేసి నివాళులర్పించారు. స్థానిక లూథరన్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. తర్వాత రిటైర్డు కండక్టర్ గుంటూరు వెంకటేశ్వరరెడ్డి ఇంటికి అల్పాహార విందుకు హాజరయ్యారు. 

కొత్తరెడ్డిపాలెం చేరుకుని.. 
కొత్త రెడ్డిపాలెం చేరుకున్న జగన్ గ్రామంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తదనంతరం యంగ్‌ఇండియా కాన్వెంట్ నిర్వాహకులు చల్లా వెంకటేశ్వరరెడ్డి ఏర్పాటుచేసిన అల్పాహార విందు కు హాజరయ్యారు. అనంతరం గ్రామ పంచాయతీ సెంటర్‌లో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సీతారామస్వామి దేవస్థానంలో, బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాత మాదిగపల్లి చేరుకుని వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత చెన్నారెడ్డి కాలనీలో మరో వైఎస్సార్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. అక్కడినుంచి సుగాలి కాలనీ చేరుకుని అక్కడ వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. షెడ్యూల్‌లో లేనప్పటికీ గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు చెరువులపాలెం చేరుకుని అక్కడ కూడా విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం గొడవర్రు చేరుకుని వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. అక్కడినుంచి గుండాలవరం మీదుగా నారాకోడూరు చేరుకున్న జగన్‌కు ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎస్సీకాలనీ చేరుకుని వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత స్థానిక చర్చిలో ప్రార్థనలు చేసి, మరో విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడి నుంచి వడ్లమూడిలోని విజ్ఞాన్ కళాశాలలోని అతిథి గృహానికి రాత్రిబసకు చేరుకున్నారు. 

పాల్గొన్న పార్టీ నేతలు..
విగ్రహావిష్కరణ కార్యక్రమాలకు పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ అధ్యక్షత వహించారు. పార్టీ జిల్లా ఇన్‌చార్జి జ్యోతుల నెహ్రూ, ప్రోగ్రామ్స్ కమిటీ కో ఆర్డినేటర్ తలసిల రఘురామ్, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ, నగర కన్వీనర్ అప్పిరెడ్డి, పార్టీ నాయకులు మారుపూడి లీలాధర్, ఆళ్ల రామకృష్ణారెడ్డి, షేక్ యాసిన్, రూత్‌రాణి, దాసరి నారాయణరావు, చిట్టా విజయభాస్కరరెడ్డి, మహ్మద్ నజీర్, ఆళ్ల శ్రీనివాసరెడ్డి పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: